కింగ్డమ్ మూవీపై కేటీఆర్ తనయుడు హిమాన్షు రివ్యూ, విజయ్ దేవరకొండ రిప్లై ఇదే

Published : Aug 01, 2025, 05:27 PM IST

కింగ్డమ్ మూవీతో విజయ్ దేవరకొండ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఈసినిమా హిట్ టాక్ తో కింగ్ డమ్ టీమ్ పండగ చేసుకుంటుంది. ఈక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు కింగ్డమ్ సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. 

PREV
15

ఊపిరి పీల్చుకున్న విజయ్ దేవరకొండ

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్. చాలా కాలంగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్న విజయ్.. సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. దాంతో కింగ్డమ్ పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఈక్రమంలో భారీ అంచనాల నడుమ రీసెంట్ గార ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమా. జూలై 31న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈసినిమాలో రౌడీ హీరోకి జంటగా భవ్యశ్రీ బోర్సె హీరోయిన్ గా నటించారు. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించారు.

DID YOU KNOW ?
కింగ్డమ్ పై రష్మిక కామెంట్స్
కింగ్డమ్ సినిమాపై స్పందించింది రష్మిక మందన్నా. విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు తెలుపుతూ..మనం కొట్టినమ్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేసింది.
25

రౌడీ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్

మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ అందించిన మాస్ బీట్స్, బీజీఎం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులు విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ను ప్రశంసిస్తున్నారు. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ రావడం రౌడీహీరోకు ఒక సాలిడ్ కంబ్యాక్‌గా నిలుస్తోంది. ఈక్రమంలో ఈసినిమాపై స్టార్ సెలబ్రిటీలు కూడా పాజిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

35

హిమాన్షు కేటీఆర్ కింగ్డమ్ రివ్యూ

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఈ సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. కింగ్డమ్ సినిమాను చూడటానికి హైదరాబాదు ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లోని థియేటర్‌కు వెళ్లారు హిమాన్షు. సినిమా చూసిన తర్వాత హిమాన్షు ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “RTC X రోడ్స్‌లో ఇద్దరు స్నేహితులతో కలిసి కింగ్‌డమ్ చూశాను. మొదటిసారిగా థియేటర్‌లో సినిమా చూడటం ఉత్సాహభరితంగా అనిపించింది. థియేటర్‌లోని బిగ్ స్క్రీన్, హైప్ అప్ ఆడియన్స్ మధ్య కింగ్‌డమ్ వైబ్ గూస్‌బంప్స్ కలిగించింది. విజయ్ దేవరకొండ అద్భుతమైన యాక్టింగ్ వల్ల ఈ సినిమా బాగా నచ్చింది” అంటూ ట్వీట్ చేశారు.

45

కేసీఆర్ మనవడికి విజయ్ దేవరకొండ రిప్లై

హిమాన్షు చేసిన ఈ ట్వీట్‌కు విజయ్ దేవరకొండ వెంటనే రిప్లై కూడా ఇచ్చారు. హార్ట్ ఎమోజీతో సింపుల్ గా ఆయన స్పందించారు. ఇక హిమాన్షు రివ్యూ ఇవ్వడం, విజయ్ దేవరకొండ రిప్లై ఇవ్వడంతో ఈ ఇద్దరు సెలబ్రిటీల అభిమానులు ఈ విషయాలు దిలు ఖుష్ అవుతున్నారు. ఇద్దరు స్టార్స్ చేసిన ట్వీట్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరో వైపు ఈ సినిమాపై రష్మిక మందన్న కూడా స్పందించింది. కింగ్డమ్ సినిమాపై స్పందించింది రష్మిక మందన్నా. విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు తెలుపుతూ..మనం కొట్టినమ్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేసింది.

55

విజయ్ దేవరకొండ స్పెషల్ ట్వీట్

ఇక తాజాగా విజయ్ దేవరకొండ కూడా తన సోషల్ మీడియా వేదికగా సినిమా విడుదలపై స్పందించారు. “ప్రస్తుతం నాకు ఎలా అనిపిస్తుందో మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను.. మీరు నాతో ఇలా అనుభూతి చెందాలని కోరుకున్నాను.. ఆ వెంకన్న స్వామి దయ.. మీ అందరి ప్రేమ..నాలాంటి ప్రతీ ఒక్కడికి ఇంకా ఏం కావాలి ” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. అభిమానుల స్పందనతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా కింగ్‌డమ్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories