బాక్సాఫీస్ పై విజయ్ దేవరకొండ గర్జన, కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా ?

Published : Aug 01, 2025, 01:51 PM IST

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ భారీ స్థాయిలో నమోదయ్యాయి. ఈ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కథనంలో ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు తెలుసుకోండి. 

PREV
15
విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. తొలి షో నుంచే కింగ్డమ్ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. మూవీలో కొన్ని చోట్ల నెమ్మదిగా సాగే సన్నివేశాలు, లాజిక్ లేని సీన్లు ఉన్నప్పటికీ ఓవరాల్ గా గౌతమ్ తిన్ననూరి ఎంచుకున్న కథ బావుందని అంటున్నారు. విజయ్ దేవరకొండ అయితే తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు ప్రశంసలు దక్కుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

DID YOU KNOW ?
రాంచరణ్ తో మూవీ క్యాన్సిల్
కింగ్డమ్ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి జెర్సీ తర్వాత రాంచరణ్ తో ఒక చిత్రాన్ని ప్రకటించారు. అంతా ఒకే అనుకున్న తరుణంలో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత గౌతమ్.. విజయ్ దేవరకొండతో కింగ్డమ్ చిత్రం రూపొందించారు.
25
భారీ అంచనాలతో విడుదలైన కింగ్డమ్

అనిరుద్ సంగీతం అందించారు. విజయ్ దేవరకొండ సరసన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. విజయ్ దేవరకొండ సోదరుడి పాత్రలో సత్యదేవ్ నటించారు. భారీ అంచనాలతో విడుదలైన కింగ్డమ్ చిత్రం తొలి రోజు వసూళ్లు ఏ మేరకు సాధించింది ? అంచనాలకు తగ్గట్లుగా ఓపెనింగ్స్ వచ్చాయా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

35
కింగ్డమ్ ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్

కింగ్డమ్ చిత్రం వరల్డ్ వైడ్ గా తొలి రోజు 39 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ చిత్రం తొలి రోజు 9.9 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. కేవలం నైజాంలో మాత్రమే రూ. 4.2 కోట్ల షేర్ సాధించింది. సీడెడ్ లో 1.7 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.16 కోట్లు, గుంటూరులో 75 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 74 లక్షలు, వెస్ట్ గోదావరిలో 44 లక్షలు, కృష్ణాలో 59 లక్షలు, నెల్లూరులో 34 లక్షలు సాధించినట్లు తెలుస్తోంది.

45
విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ గర్జన

కేరళలో కూడా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద కింగ్డమ్ చిత్రం బాగానే పెర్ఫార్మ్ చేసింది. కేరళలో 50 లక్షలు రాబట్టింది. యూఎస్ లో తొలి రోజు ఈ చిత్రానికి 3 లక్షల డాలర్లు వచ్చినట్లు నిర్మాత ప్రకటించారు. మొత్తంగా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద విజయ్ దేవరకొండ గర్జించాడు అనే చెప్పాలి. ఇదే జోరు వీకెండ్ మొత్తం కొనసాగితే కింగ్డమ్ చిత్ర వసూళ్లు భారీ స్థాయిలో నమోదవుతాయి.

55
కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్

కింగ్డమ్ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా 47 కోట్లు జరిగింది. తొలి రోజు నమోదైన వసూళ్ల జోరు రానున్న రోజుల్లో కూడా కొనసాగితే కింగ్డమ్ చిత్రం బ్రేక్ ఈవెన్ చేరుకుంటుంది. జెర్సీ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇదే. జెర్సీ తర్వాత గౌతమ్.. రాంచరణ్ తో సినిమా చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories