ఘరానా మొగుడు చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. చిరంజీవి ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో అది కూడా ఒకటి. ఈ మూవీ సక్సెస్ వెనుక ఉన్న ఊహించని కారణాన్ని చిరంజీవి రివీల్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, కె రాఘవేంద్రరావు కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడు లాంటి చిత్రాలు ముఖ్యమైనవి. ఈ రెండు చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఫాంటసీ చిత్రం కాగా, ఘరానా మొగుడు మాస్ యాక్షన్ చిత్రం.
DID YOU KNOW ?
నెమ్మదించిన చిరంజీవి కెరీర్
ఘరానా మొగుడు తర్వాత చిరంజీవి కెరీర్ నెమ్మదించింది. ఫ్యాన్స్ కోరుకునే సరైన హిట్ కొన్నేళ్ల పాటు చిరంజీవికి దక్కలేదు. హిట్లర్ తో తిరిగి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.
25
ఘరానా మొగుడులో హైలైట్ అదే
ఘరానా మొగుడు చిత్రంలో నగ్మా హీరోయిన్ గా నటించింది. నగ్మా అహంకారం ఉన్న మహిళగా నటించింది. కంపెనీ ఓనర్ గా వర్కర్స్ ని చులకనగా చూసే పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీలో చిరంజీవి, నగ్మా మధ్య ఫేస్ ఆఫ్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. చిరంజీవి వంగి నమస్కారం పెట్టే విధానం, కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో అని చెప్పే డైలాగ్స్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
35
చిరంజీవి మ్యానరిజమ్స్
ఘరానా మొగుడు చిత్రం ఇండస్ట్రీ హిట్ కావడంలో చిరంజీవి మ్యానరిజమ్స్ ఎంతో ఉపయోగపడ్డాయి. అయితే తన మ్యానరిజమ్స్ వెనుక ఉన్న ఊహించని ట్విస్ట్ ని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఘరానా మొగుడు చిత్రంలో తన మ్యానరిజమ్స్ అనుకోకుండా సామాన్యుల నుంచి వచ్చినవే అని చిరంజీవి అన్నారు.
నిర్మాత రాశి మూవీస్ నరసింహారావు నమస్కారం పెట్టే విధానం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఆయన వంగి నమస్కారం చేస్తారు. రావు గోపాల్ రావుతో ఓ సన్నివేశంలో నటించే సమయంలో నరసింహారావు నమస్కారం గుర్తుకు వచ్చింది.ఆయన స్టైల్ ని కాస్త మార్చి నమస్కారం పెట్టే సీన్ లో నటించా. అది భలే కుదిరింది.
55
బాసూ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో
అదే విధంగా కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో అనే డైలాగ్ సామాన్య ప్రజలు, అభిమానుల్లో నుంచి వచ్చింది. ఓ మూవీ షూటింగ్ కోసం బుర్రా కేవ్స్ కి వెళ్ళాము. అక్కడ నేను శ్రీదేవి ఇతర చిత్ర యూనిట్ కూర్చుని లంచ్ చేస్తున్నాం. చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ కొంతమంది బాసూ అని అరుస్తున్నారు. వాళ్ళ వైపు చూడడానికి వెనక్కి తిరిగి చూశాను. కానీ వాళ్ళు బాసూ అటు కాదు ఇటు లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో అని అన్నారు. అది కూడా నాకు కొత్తగా అనిపించింది. దానినే ఘరానా మొగుడు చిత్రంలో ఉపయోగించినట్లు చిరంజీవి తెలిపారు. ఆ విధంగా చిరంజీవి ఘరానా మొగుడు చిత్రంలో అలరించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.