మరణం ఎప్పుడు వస్తుందో చెప్పలేం ఏ వయస్సులో వస్తుందో చెప్పలేం.. అందుకే ఉన్నంత వరకూ మంచిగా బ్రతకాలి అంటారు. అనుకోకుండా మరణాన్ని చేరిన మన తెలుగు హీరోయిన్లు కూడా అదే పని చేశారు. కోట్లు సంపాదించిన తారలు.. తమ ఫ్యామిలీలకు ఆస్థిని అందించి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. వారిలో సౌందర్య, శ్రీదేవి లాంటివారు ఉండగా.. వారు ఎంత సంపాదించారంటే..?
ఆ టైంలో సౌందర్య పేరు మీద దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని అంటారు. ఆ ప్రమాదంలో తన అన్నయ్య అమర్నాథ్ కూడా చనిపోయారు. పిల్లలు అనాధలు అయిపోతారు కాబట్టి తనకి కొంత ఆస్తి ఇవ్వాలని సౌందర్య వదిన కోర్టుకు ఎక్కారు ఇంకా కేసు నడుస్తోంది.
ఇక ఇప్పటి వారికి సరిగ్గా తెలియకపోవచ్చు కాని.. శ్రీదేవి కంటే స్టార్ హీరోయిన్ అవుతున్న టైమ్ లో.. సడెన్ గా మరణాన్ని చేరింది దివ్య భారతి. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా చాలా తక్కువ టైమ్ లో మంచి పేరు సంపాదించింది ఈ బ్యూటీ. ప్రమాదవశాత్తూ.. బాల్కనీనుంచి జారిపడి మరణించారు దివ్వ భారతి. ఇక దివ్య భారతి పేరు మీద 70 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయట. ఆ కాలంలో అంత ఆస్తి అంటే మాటలు కాదు. అయితే ఆమె ఆస్తి అంతా తల్లిదండ్రుల పేరుపై ఉండడంతో సమస్యలు ఏమి రాలేదు. అయితే దివ్యభారతి కి 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు.
ఇలా చాలా మంది హీరోయిన్లు చనిపోతూ.. తమ ఫ్యామిలీకి కోట్ల ఆస్తి ఇచ్చి వెళ్లిపోయారు ప్రత్యూష, ఆర్తి అగర్వాల్ లాంటి హీరోయిన్లు కూడా మరీ ఎక్కువ కాకపోయినా.. అంతో ఇంతో సంపాదించిన వాళ్లే. మరణించిన హీరోయిన్లు అంతా దాదాపు ప్రమాదాల వల్ల పోయినవారే. వారు బ్రతికుండి ఉంటే.. పీక్ స్టేజ్ లో స్టార్ డమ్ ను చూసేవారు.
Jayalalithaa's Jewellery
ఇక పాతతరం హీరోయిన్ల పరిస్థితి చూసుకుంటే.. తమిలనాడు మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయలలిత ఆస్తుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇంటిపై రైడ్ చేస్తే దొరికిన కేజీలకొద్ది బంగారు నగలు, వెండీ.. పట్టు చీరలతో పాటు.. ఆమె ఆస్తి వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అక్రమాస్తుల కేసులో జైలు జీవితం కూడా గడిపారు జయలలిత.
ఇక అంత సంపాదించినా.. ఆమె ఆస్తులు చెల్లా చెదురు అయిపయాయి. కొన్ని ఆమె నెచ్చెలి శశికళ ఆధ్వర్యంలోకి రాగా..మరికొన్ని మెనకోడలు దీపా దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. మరికొన్ని కోర్టు కేసుల వల్ల ప్రభుత్వం స్వాదీనం చేసుకున్నారని తెలుస్తోంది.
ఇక అలనాటి అందాల తార.. మహానటి సావిత్రి కూడా కోట్లకు కోట్లు సంపాదించింది. స్టార్ హీరోలను మించి రెమ్యూనరేషన్ అందుకున్న సావిత్రి ఆస్తి.. ఆ కాలంలో 300 కోట్లకుపైమాటే అంట. కాని సరైన సమయానికి టాక్స్ కట్టాలని తెలియక కొంత, భర్త మోసం వల్ల మరికొంత, బందువులు.. సన్నిహితులు చేసిన మోసాల వల్ల ఇంకాస్త ఆస్తిని పోగొట్టుకుని దీనావస్తలో మరణించారు సావిత్రి. కాని కాస్త ముందు జాగ్రత్తగా ఆమె కూతురు పెళ్లి చేసి చాలావరకూ స్థిరాస్తిని ఆమెకు ఇచ్చారట.