విశాల్ ‘రత్నం’ మూవీ రివ్యూ

First Published | Apr 26, 2024, 2:43 PM IST

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజు విడుదల అయ్యింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? 

Rathnam Review

పందెం కోడి టైమ్ నాటి నుంచి విశాల్ సినిమాకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే గత కొన్ని ఏళ్లుగా విశాల్ సినిమాలు ఏవీ ఇక్కడ ఆడటం లేదు. వచ్చి సినిమా వచ్చినంత వేగంగా వెళ్లిపోతోంది. చివరగా అభిమన్యుడు, డిటెక్టెవ్ మాత్రమే  సినిమాలే ఆడాయి. మళ్లీ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇప్పుడు  ‘రత్నం’అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే విశాల్ కు ఓ ప్లస్ ఉంది.  కంటెంట్ బలంగా ఉంటే చాలు.... ఎలాగైనా లాక్కెళ్లిపోతాడు. సింగం వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరి డైరక్షన్ కావటంతో ఈ సినిమాపై అంచనాలు కొద్దిగా ఉన్నాయి. ఆ అంచనాలను హరి,విశాల్ కలిసి నిలబెట్టారా..సినిమా చూడదగ్గ యాక్షన్ ఎంటర్టైనరేనా లేక రొట్ట కొట్టుడు తమిళ మాస్ సినిమానా చూద్దాం.


స్టోరీ లైన్ :
 
చిత్తూరులో ఈ కథ జరుగుతూంటుంది.  లోకల్ ఎమ్మల్యే దండా పన్నీర్ స్వామి (సముద్రఖని) రైట్ హ్యాండ్ రత్నం(విశాల్) . విశాల్ చిన్నప్పుడే ఓ గొడవలో పన్నీర్ ని తన ప్రాణాలు పణం పెట్టి మరీ కాపాడతాడు. దాంతో పన్నీరు కూడా తన  అల్లుడు అని పిలుస్తూ సొంత మనిషిలాగ చూసుకుంటాడు. ఓ రోజు రత్నం ... మల్లిక (ప్రియా భవానీ శంకర్)ను చూస్తాడు. ఆమెను ఎక్కడో చూసినట్టు ఉందని అనిపిస్తుంది. బాగా దగ్గర మనిషిలా భావిస్తాడు. ఆమెపై  కొన్ని గ్యాంగ్ లుహత్యాయత్నం జరిగితే ప్రాణాలకు తెగించి కాపాడతాడు. ఆ తర్వాత  ఆమెకు తమిళనాడులోని లింగం (మురళీ శర్మ) బ్రదర్స్ నుంచి ముప్పు ఉందని అర్దం చేసుకుని వారి అంతు చూడాలనుకుంటాడు. అసలు ఈ లింగం బ్రదర్శ్ ఎవరు..వారికి, మల్లికకు మధ్య గొడవ ఏమిటి..అలాగే రత్నంకు,మల్లికకు మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి...అసలు రత్నం ఫ్లాష్ బ్యాక్ ఏంటి? రత్నం తల్లి రంగనాయకి (ప్రియా భవానీ శంకర్)లా మల్లిక ఎందుకు ఉంది? మల్లికను లింగం ఎందుకు అంతం చేయాలని అనుకుంటాడు? చివరకు మల్లిక కోసం రత్నం ఏం చేశాడు? అన్నదే కథ. ఆమెను ఎందుకు ప్రాణంలా చూసుకుంటున్నాడు అనేది ఓ ట్విస్ట్. అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.



ఎలా ఉందంటే..

యాక్షన్ సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకమైన జానరే. ఈ తరహా సినిమాలు ఫాస్ట్ పేస్ లో పరుగెడుతూ..మెయిన్ క్యారక్టర్ ని వరసపెట్టి డేంజర్స్ లోకి నెట్టేస్తూంటాయి. ఈ క్రమంలో ఫైట్ సీక్వెన్స్, కారు సీక్వెన్స్ ఇలా  వచ్చిపోతూంటాయి. అయితే ఇలా తెరపై ఏం జరిగినా ఎన్ని యాక్షన్ సీక్వెన్స్ లు అద్బుతంగా  వచ్చినా వాటి ని కనెక్ట్ చేసే ఎమోషన్ మాత్రం ఉండాల్సిందే. అయితే తమిళ దర్శకుడు హరికి ఆ టెక్నిక్ తెలుసు. హరి అంటేనే స్పీడు స్క్రీన్ ప్లే..పరుగెట్టిస్తాడు. కన్ను మూసి తెరచేటంతలో సీన్స్ పరుగెట్టుకుపోతూంటాయి. అయితే ఈ సారి ఆ స్పీడుకు కాస్త బ్రేక్ లు వేసుకుంటూ వెళ్లాడు. అయితే  ఇది పూర్తిగా కమర్షియల్ సినిమా కొలతల్లో నడిచే ఫార్మెట్ కథ.  సినిమా ప్రారంభం ఆంధ్ర ,తమిళనాడు సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలలో జరిగిన కొన్ని సంఘటనలను చూపించి ఏదో జరగబోతోందనే బిల్డప్ ఇస్తాడు. అయితే ఆ తర్వాత అంత సీన్ లేదని మెల్లిమెల్లిగా అర్దమవుతుంది.
 


 ఫస్టాఫ్ మొత్తం అంతా విశాల్ ఎవరు.అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి, అతను చిత్తూరు మార్కెట్ కి ఎలా చేరాడు? ఎందుకు పన్నీర్ కోసం ప్రాణాలు తీయడానికి అయినా ప్రాణాలు ఇచ్చేందుకు అయినా సిద్ధపడ్డాడు? లాంటి విషయాలని చూపించటంతో సరిపెట్టారు. దాంతో  ఫస్టాఫ్ లో పెద్దగా ఏమీ జరిగినట్లు అనిపించదు. దాదాపు ఇంటర్వెల్ వరకూ రొటీన్ మాస్ మసాలా సినిమా చూపిస్తూంటాడు.మనకీ అలా చూడటం అలవాటే కాబట్టి కిక్కురుమనకుండా చూస్తూంటాం.  ఎంతలా అంటే ఒక రొటీన్ ఫైట్ తో హీరో ఎంట్రీ ఇవ్వటం మొదలెట్టి... అంతే రొటీన్ స్టయిల్ లో విలన్ ని, హీరోయిన్ ఎంట్రీ ఇస్తాడు. 

Rathnam Review

హీరోయిన్ ఎంట్రీ నుంచి కథ మలుపు తిరుగుతుంది.   దాంతో యాక్షన్ ఎపిసోడ్ తో ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ మీద మరింత ఆసక్తి పెంచేలా ఉంటుంది. అయితే అనుకున్న స్దాయిలో సెకండ్ హాఫ్  లేదు. సెకండాఫ్ లో  పూర్తిగా డల్ అయ్యింది. కథలో స్పీడ్ తగ్గి పోతుంది. కథను అక్కడక్కడే తిరుగుతుంది.  క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది. కానీ అదేమీ ఇంట్రస్టింగ్ గా అనిపించదు. 

Rathnam Review


ఇలాంటి కథలకు విలన్ స్ట్రాంగ్ గా ఉండాలి.  ఇందులో విలన్ పాత్రలు వాళ్ల రీజన్ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది.  విలన్ వలన హీరో సమస్యలు ఎదుర్కొంటాడ‌ని ఎవరికీ అనిపించదు. ఇలా వీక్ విలనిజం వున్న పాత్ర వున్నప్పుపుడు కమర్షియల్ సినిమాలకి కావాల్సిన హీరోయిజం బిల్డ్ అవ్వదు. ఇందులోనూ అదే జరిగింది. ఒక దశలో ఈ కథని ఎలా మలుపు తిప్పాలో అర్దం కాక వదిలేసారనిపిస్తుంది. దాంతో స్క్రీన్ ప్లేలో  ఎన్ని జిమ్మిక్కులు చేసినా సన్నివేశాల్లో ఎంటర్టైన్మెంట్  పండలేదు.

Rathnam Review


ఎమోషన్ పిండాలని ప్రయత్నించారు కానీ అది కాస్త ఓవర్ డ్రమటిక్ గా అనిపించింది.  ఇందులో ప్రధానంగా వుండే మరో సమస్య ఏమిటంటే.. హీరో, విలన్ కి  ఒక  ప్రత్యేకమైన లక్ష్యాన్ని అంటూ నిర్దేశించలేదు దర్శకుడు. గాలివాటుగా వెళ్పిపోతూంటాయి. దాంతో చూసే ప్రేక్షకులకు అదే పరిస్దితి. ఏవేవో సినిమాల్లోని సీన్స్ చూస్తున్నట్లు అనిపిస్తాయి తప్పితే.. వాటికి ఒక లక్ష్యం అంటూ లేకుండాపోయింది. పోనీ కథలో ఎమోషన్ ని అంత సీరియస్ గా తీసుకుందామా అంటే చివర్లో ఇచ్చిన మరో ట్విస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. హీరోయిన్ లో హీరో తన తల్లిని చూసుకున్నాడని తెలిసి మనం విస్తుపోతాం.

Rathnam Review

 
టెక్నికల్ గా చూస్తే..

ఈ సినిమాకు  ప్లస్ పాయింట్  దేవిశ్రీప్రసాద్. ఆయన పాటల్లో ఓ పాట బాగుంది. అలాగే కొన్నిచోట్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఇక ఫైట్స్ ని బాగా డిజైన్ చేసారు.  సినిమాటోగ్రఫీ బాగుంది. తెలుగు లో డైలాగ్స్ కూడా బాగా రాసారు. ఎడిటింగ్ జస్ట్ ఓకే. 

నటీనటుల్లో ...

విశాల్ కు ఇలాంటి సినిమాలు,నటన కొట్టిన పిండి. ప్రత్యేకంగా కష్టపడినట్లు కనపించడు. యోగిబాబు కామెడీ ఉన్నంతలో కాస్త రిలీఫ్. హీరోయిన్ ప్రియ భవాని శంకర్..జస్ట్ ఓకే. సముద్ర ఖని కూడా ఇలాంటి క్యారక్టర్స్ చాలా చేసేసి ఉన్నాడు.  మురళి శర్మ, జయప్రకాష్, విజయ్ చందర్ వంటి సీనియర్స్ క్యాజువల్ గా చేసుకుంట వెళ్లిపోయారు.

Rathnam Review

ఫైనల్ థాట్..

ఓ పదేళ్ల క్రితం వచ్చి ఉంటే అప్పటి ప్రేక్షకులకు బాగా నచ్చే సినిమానే ఇది. సింగం హరి అప్పటి రోజుల్లోనే ఉండిపోయినట్లున్నారు.
 
Rating:2

Latest Videos

click me!