సినిమాకు 200 కోట్లు తీసుకునే రజినీకాంత్ కంటే ఎక్కువ తీసుకున్న హీరోయిన్... ఎవరో తెలుసా?

First Published Apr 26, 2024, 2:29 PM IST

హీరో రజినీకాంత్ దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో. ఆయను ఇండియా వైడ్ మార్కెట్ ఉంది. అయితే ఓ హీరోయిన్ ఆయన రెమ్యూనరేషన్ కంటే రెండు రెట్లు అధికంగా తీసుకుందట.
 

Rajinikanth

రజినీకాంత్ ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్టార్ గా ఎదిగారు. వృత్తిరీత్యా బస్ కండక్టర్ అయిన రజినీకాంత్ స్నేహితుడు సలహా మేరకు చెన్నై వచ్చి యాక్టింగ్ స్కూల్ లో చేరారు. 
 

Rajinikanth

మొదట్లో రజినీకాంత్ విలన్, సపోర్టింగ్ రోల్స్ చేశారు. వచ్చిన పాత్ర కాదనకుండా చేసుకుంటూ పోయారు. దర్శకుడు కే బాలచందర్ రజినీకాంత్ ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. 1976లో విడుదలైన అపూర్వ రాగంగళ్ రజినీకాంత్ డెబ్యూ మూవీ. కమల్ హాసన్ లీడ్ రోల్ చేయగా రజినీకాంత్ ఓ పాత్ర చేశారు. 
 

Rajinikanth

అదే ఏడాది కమల్ హాసన్-రజినీకాంత్ కాంబోలో మరొక చిత్రం వచ్చింది. మూండ్రు ముడిచ్చు చిత్రంలో కమల్ హాసన్, రజినీకాంత్, శ్రీదేవి నటించారు. ఈ చిత్రానికి గానూ శ్రీదేవి రజినీకాంత్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకుందట. ఈ విషయాన్ని శ్రీదేవి ఓ సందర్భంలో వెల్లడించారు. 
 

Rajinikanth

మూండ్రు ముడిచ్చు చిత్రం నాటికి శ్రీదేవి, రజినీకాంత్ పరిశ్రమకు కొత్త. అప్పుడే ఎదుగుతున్నారు. కమల్ హాసన్ మాత్రం కొంత ఫేమ్ తెచ్చుకున్నారు. హీరోగా చిత్రాలు చేస్తున్నారు. దాంతో కమల్ హాసన్ రూ. 30000 రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఇక శ్రీదేవికి రూ. 5000 ఇచ్చారట. 
 

Rajinikanth

రజనీకాంత్ రెమ్యునరేషన్ మాత్రం జస్ట్ రూ. 2000 అట. మూండ్రు ముడిచ్చు రజినీకాంత్ కి నాలుగో చిత్రం. ఇది దర్శకుడు కే విశ్వనాథ్ తెరకెక్కించిన ఒక సీత కథ చిత్రానికి రీమేక్. కెరీర్ బిగినింగ్ లో కమల్ హాసన్, శ్రీదేవి కంటే ఆయన చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారట. 

స్టార్ గా ఎదిగాక రజినీకాంత్ అందరినీ దాటేశాడు. అతిపెద్ద కమర్షియల్ హీరో అయ్యారు. ఇండియా వైడ్ ఫేమ్ ఉన్న రజినీకాంత్ రెమ్యునరేషన్ విషయంలో అనేక రికార్డ్స్ బ్రేక్ చేశాడు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న కూలి చిత్రానికి రజినీకాంత్ రూ. 250 కోట్లకు పైగా తీసుకుంటున్నారని టాక్. 

click me!