Shriya Saran
శ్రియ శరన్ అంతకంతకు గ్లామర్ డోస్ పెంచుతూ పోతుంది. పీలికలు లాంటి డ్రెస్ లో ఎద అందాలు బంధించింది. శ్రియ గ్లామర్ చూసి నెటిజెన్స్ కి ఊపిరి సలపడం లేదు. ఉండబట్టలేక కామెంట్స్ చేస్తున్నారు. ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
Shriya Saran
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రియ శరన్ నటి కావాలని కలలు కన్నారు. అందుకు డాన్స్, యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నారు. ముంబైలో రామ్ చరణ్, శ్రియ ఒకే ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్నారట.
Shriya Saran
2001లో ఆమె హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇష్టం టైటిల్ తో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తోశ్రియ వెండితెరకు పరిచయమైంది. ఆ మూవీ పర్లేదు అనిపించుకుంది.
Shriya Saran
ఆమెకు బ్రేక్ ఇచ్చిన మూవీ సంతోషం. నాగార్జున హీరోగా తెరకెక్కిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ కొట్టింది. ఆ వెంటనే బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి మూవీలో శ్రియ నటించారు.
Shriya Saran
దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ డ్రామా హిట్ కొట్టింది. అక్కడ నుండి శ్రియ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ అయ్యారు. టాప్ స్టార్స్ అందరితో నటించారు. శ్రియ తన కెరీర్లో అనేక ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది.
Shriya Saran
2018లో శ్రియ ప్రియుడు ఆండ్రీని పెళ్లి చేసుకుంది. శ్రియ వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. అప్పటికి శ్రియ స్టార్ హీరోయిన్ హోదాకు దూరమయ్యారు. లాక్ డౌన్ సమయంలో శ్రియ రహస్యంగా ఓ పాపకు జన్మనిచ్చింది. తాను తల్లైన విషయాన్ని శ్రియ అనంతరం తెలియజేసింది.
Shriya Saran
ఇటీవల మ్యూజిక్ స్కూల్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ ఆర్ట్ ఫిల్మ్ అంతగా ఆదరణ పొందలేదు. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కబ్జ మూవీలో లీడ్ హీరోయిన్ గా చేసింది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తుంది. నాలుగు పదుల వయసులో కూడా శ్రియ నాజూకు సౌందర్యం కలిగి ఉన్నారు. ఫ్యాన్స్ ని నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంది. శ్రియ అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ బ్యాలన్స్ చేస్తూ ముందుకు సాగుతుంది...