Sadaa: చిలక పచ్చ చీర స్లీవ్ లెస్ జాకెట్... కత్తిలాంటి లుక్ లో కవ్విస్తున్న సదా బేబీ!

First Published Jul 2, 2022, 1:07 PM IST

ట్రెండీ లేక ట్రెడిషనల్... డ్రెస్ ఏదైనా సదా లుక్ మాత్రం సూపర్ హాట్ గా ఉంటుంది. చందమామ లాంటి మేని ఛాయలో సదా మెస్మరైజ్ చేస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టీవ్ అయిన సదా ఫ్యాన్స్ ని కట్టిపడేస్తున్నారు. తాజాగా చిలకపచ్చ చీర స్లీవ్ లెస్ జాకెట్ ధరించి సెక్సీ లుక్ లో కట్టిపడేసింది.

Sadaa


సదా లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి. ఇక సదా(Sadaa)ను వెండితెరపై చూసి చాలా కాలం అవుతుంది. ఆమె తెలుగులో నటించిన చివరి చిత్రం యమలీల 2. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. కెరీర్ బిగినింగ్ లో మెరుపులు మెరిపించిన సదా చాలా త్వరగా ఫేడ్ అవుట్ అయ్యారు. 

Sadaa


సదా డెబ్యూ మూవీ జయం(Jayam) అప్పట్లో ఓ సంచలనం. చిత్రం, నువ్వు నేను చిత్రాల తర్వాత దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. నితిన్, సదా లను వెండితెరకు పరిచయం చేస్తూ 2002లో విడుదలైన జయం భారీ విజయం సొంతం చేసుకుంది. 

Sadaa

జయం మూవీతో ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న సదా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఆమె పేరు టాలీవుడ్ లో మారుమ్రోగింది. తర్వాత దొంగ దొంగది, లీలా మహల్ సెంటర్ వంటి చిత్రాలలో నటించారు. ఎన్టీఆర్(NTR) తో నటించిన నాగ హిట్ కాకపోవడంతో ఆమెకు స్టార్స్ పక్కన అవకాశాలు రాలేదు.

Sadaa

జయం తర్వాత ఆ రేంజ్ హిట్ అపరిచితుడు చిత్రంతో సదా అందుకుంది. తమిళ చిత్రం అన్నియన్ తెలుగులో అపరిచుతుడుగా విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ భారీ విజయం సొంతం చేసుకుంది. అన్నియన్ విజయంతో తమిళంలో వరుసగా ఆఫర్స్ వచ్చాయి.

Sadaa


సౌత్ ఇండియాలోని అన్ని ప్రధాన భాషల్లో నటించిన సదా ఎక్కడా నిలదొక్కుకోలేదు. సినిమా సెలక్షన్స్ సరిగా లేక కెరీర్ త్వరగా ఫేడ్ అవుట్ అయ్యింది. చంద్రముఖి సినిమాలో నయనతార చేసిన పాత్ర ఆఫర్ సదాకు రాగా.... డేట్స్ ఖాళీగా లేక వదులుకున్నారట. అలా ఓ మంచి చిత్రంలో నటించే ఛాన్స్ మిస్ అయ్యానని సదా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

Sadaa

ఇక సదా నటించిన చివరి చిత్రం టార్చ్ లైట్ . ఈ తమిళ చిత్రం ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కింది. ప్రసుతం సదా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఆమె పలు బుల్లితెర షోలలో సందడి చేస్తున్నారు. ఆమె ఫ్యాన్స్ మాత్రం వెండితెరపై చూడాలని ఆశపడుతున్నారు. 
 

Sadaa


ఇక వెండితెరపై కనిపించకున్నా సోషల్ మీడియా వేదికగా అందాల విందు చేస్తూ వార్తలకు ఎక్కుతున్నారు. సదా గ్లామరస్ ఫోటో షూట్స్ తరచుగా వైరల్ అవుతున్నాయి. 

click me!