టైట్ జీన్స్, టీషర్ట్ లో ప్రణీతా సుభాష్ గ్లామర్ మెరుపులు.. కవ్వించే పోజులతో మతి చెడగొడుతున్న బుట్టబొమ్మ!

First Published Dec 9, 2022, 3:57 PM IST

గ్లామర్ బ్యూటీ ప్రణీత సుభాష్ (Pranitha Subhash) అందాల ఆరబోతతో అదరగొడుతోంది. పెళ్లి, ప్రెగ్నెన్సీతో దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. మళ్లీ వెండితెరపై అలరించేందుకు సిద్ధం అవుతోంది.
 

కన్నడ బ్యూటీ, గ్లామరస్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ తెలుగు ఆడియెన్స్ కు ఎంతగానో పరిచయం. ఫ్యామిలీ హీరోయిన్ లాగా గుర్తింపు పొందిన హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. ‘బావా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ప్రణీత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించింది.
 

గతేడాది 2021 మేలో వ్యాపార వేత్త నితిన్ రాజు ను హీరోయిన్ ప్రణీత సుభాష్ పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ వివాహాం. తనపెళ్లిపైనా ఎలాంటి అప్డేట్ ఇవ్వని ప్రణీత.. కొద్దిరోజులకు ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యింది. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స అందిస్తూ వచ్చింది.
 

ఇక పెళ్లైన కొద్దినెలలకే ప్రెగ్నెన్నీని కూడా అనౌన్స్ చేసింది. తన బేబీ బంప్ ను చూపిస్తూ నెట్టింట సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 10న బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో ప్రణీత పండంటి ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తోంది.
 

మరోవైపు మళ్లీ కేరీర్ ను చక్కదిద్దుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులు, నెటిజన్లను అలరిస్తోంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ క్రేజీగా  ఫొటోషూట్లు చేస్తూ.. ఆ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంటోంది.
 

తాజాగా ప్రణీత సింపుల్ లుక్ లో దర్శనమిచ్చింది. టైట్ జీన్స్, టీ  షర్ట్ లో హోయలు పోయింది. మెరిసిపోయే రూపసౌందర్యంతో కవ్వించే పోజులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.. బుట్టబొమ్మ కసి  చూపులకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

గ్లామరస్ గా ఉండే ఈ బ్యూటీ.. పెళ్లి తర్వాత మరింత అందంగా తయారవుతూ కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వరుసగా ఇలా గ్లామర ఫొటోలను షేర్ చేయడంతో ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రణీత సెకండ్ ఇన్నింగ్స్ లో ఏచిత్రంతో అలరించబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు చేస్తోంది.

click me!