ఎట్టకేలకు కాబోయే భర్తని పరిచయం చేసిన అభినయ, ఇన్నాళ్ల సస్పెన్స్ కి తెర.. విశాల్‌తో ఆ బంధానికి ముగింపు

Abhinaya Lover: కోలీవుడ్‌, టాలీవుడ్‌లో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా నటిస్తూ మెప్పిస్తున్న నటి అభినయ తన జీవితంలోని అతిపెద్ద సస్పెన్స్ కి తెరదించింది. తన కాబోయే భర్తని పరిచయం చేసింది. 

heroine Abhinaya Reveals Lover Photo Engagement Pics Viral vishal relation close in telugu arj
Abhinaya

Abhinaya Lover: 2008లో తెలుగులో 'నేనింతే' సినిమాతో నటిగా పరిచయమైంది అభినయ. తెలుగు సినిమాల్లో నటిస్తూ, 2009లో సముద్రఖని దర్శకత్వంలో 'నాడోడిగల్' ద్వారా తమిళంలో పరిచయమైంది. ఈ సినిమాకి ఉత్తమ ఫిల్మ్‌ఫేర్ అవార్డు, ఉత్తమ విజయ్ అవార్డుతో సహా చాలా అవార్డులు అందుకుంది. ఈ సినిమా సక్సెస్ తో అభినయకి తర్వాత సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.

heroine Abhinaya Reveals Lover Photo Engagement Pics Viral vishal relation close in telugu arj
Abhinaya

నాడోడిగల్ నటి అభినయ
గత సంవత్సరం అక్టోబర్ 24న విడుదలైన అభినయ నటించిన 'పణి' సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు వచ్చాయి. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇటీవల సోనీ లివ్ ఓటీటీ వేదికలో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. చిన్నప్పటి నుండి వినికిడి, మాటలు రాని అభినయ తన ఆత్మవిశ్వాసంతో ఈరోజు నటిగా మెరిసిపోతుంది. ఆమె తల్లిదండ్రులు ఆమె డ్రీమ్స్ కి సపోర్ట్ చేయడం అభినయ   సక్సెస్ కి ముఖ్య కారణం అని చెప్పవచ్చు.


Abhinaya, vishal

విశాల్ తో అభినయ లవ్ ఎఫైర్
సాధారణంగా సినిమా రంగంలో సెలబ్రిటీల గురించి గుసగుసలు రావడం సహజం. అభినయ కూడా దీనికి అతీతం కాదు. గత సంవత్సరం విశాల్ తో అభినయ ప్రేమలో ఉన్నట్టు, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చాలా రోజులుగా సోషల్‌ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి గుసగుసలకు తెర దించే విధంగా అభినయ మొదటిసారిగా తన ప్రేమ గురించి బహిరంగంగా చెప్పింది. తాను తన స్నేహితుడిని గత 15 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని, ఇకపై తనను ఏ నటుడితో పోల్చి మాట్లాడవద్దని చెప్పింది.

abhinaya lover

లవర్ ఫోటో రిలీజ్ చేసిన అభినయ
ఈ మధ్యనే అభినయకి నిశ్చితార్థం అయింది. అయినా తన లవర్ ఫోటోను రిలీజ్ చేయకుండా ఉన్న అభినయ, నిన్న అధికారికంగా తన లవర్ తో దిగిన ఫోటోను రిలీజ్ చేసింది. వాళ్లిద్దరి నిశ్చితార్థం అప్పుడు తీసిన ఆ ఫోటోను చూసిన నెటిజన్లు ఇద్దరికీ జోడీ సూపర్ గా ఉంది అని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ పోస్ట్ తో అభినయం చుట్టూ ఉన్న రూమర్స్ అన్ని పటాపంచల్‌ అయ్యాయి. ముఖ్యంగా విశాల్‌తో ఉన్న ఆ రిలేషన్‌కి సంబంధించిన రూమర్స్ కి బ్రేకప్‌లు పడ్డాయని చెప్పొచ్చు. 

read  more: సల్మాన్‌, రష్మిక, కాజల్‌.. `సికందర్` మూవీ ఆర్టిస్ట్ ల ఆస్తులు ఎంతో తెలుసా? వామ్మో వేల కోట్లు

also read: ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369, ఈ చిత్రానికి గుండెకాయ ఏంటో తెలుసా.. తరుణ్, రాశిపై బాలయ్య కామెంట్స్

Latest Videos

vuukle one pixel image
click me!