డైరెక్టర్ ఎ. ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'సికందర్' మార్చి 30న రిలీజ్ అయింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, సత్యరాజ్ ఇంకా చాలామంది నటులు ఉన్నారు. ఈ సినిమా నటుల్లో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులున్నాయో మీకు తెలుసా...
సల్మాన్ ఖాన్
సినిమాలో సంజయ్ రాజ్ కోట్ అలియాస్ సికందర్ పాత్రలో నటించిన సల్మాన్ ఖాన్ దగ్గర దాదాపు రూ.2900 కోట్ల ఆస్తి ఉందని చెబుతున్నారు. బాలీవుడ్‌లో రిచ్చెస్ట్ హీరోల్లో సల్మాన్ ఒకరు.
రష్మిక మందన్న
'సికిందర్'లో సల్మాన్ ఖాన్ భార్య సాయిశ్రీ రాజ్ కోట్ పాత్రలో రష్మిక మందన్న నటిస్దితుంది. ఆమె దగ్గర దాదాపు రూ.66 కోట్ల రూపాయల ఆస్తి ఉందని సమాచారం.
కాజల్ అగర్వాల్
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా నటించిన కాజల్ అగర్వాల్ 'సికిందర్'లో వైదేహి రంగాచారి పాత్రలో కనిపించింది. ఈమెది సర్‌ప్రైజింగ్ రోల్. కాజల్ దగ్గర దాదాపు రూ.83 కోట్ల రూపాయల ఆస్తి ఉందని సమాచారం.
సత్యరాజ్
సినిమాలో ముఖ్య విలన్ మంత్రి ప్రధాన్ పాత్రలో కనపడుతున్న సత్యరాజ్ దగ్గర దాదాపు 80 కోట్ల రూపాయల ఆస్తి ఉందని చెబుతున్నారు.
ప్రతీక్ బబ్బర్
'సికిందర్'లో ప్రతీక్ బబ్బర్ సత్యరాజ్ కొడుకు అర్జున్ ప్రధాన్ పాత్రను పోషించాడు. అతని దగ్గర 17-42 కోట్ల రూపాయల ఆస్తి ఉందని అంచనా.
శర్మన్ జోషి
సినిమాలో శర్మన్ జోషి సల్మాన్ ఖాన్ స్నేహితుడు అమర్ పాత్రను పోషించాడు. శర్మన్ దగ్గర 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తి ఉందని చెబుతున్నారు.