ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్ అప్‌డేట్: సందీప్ రెడ్డి వంగా ప్రకటన!

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' సినిమా షూటింగ్ అప్‌డేట్‌ను దర్శకుడు స్వయంగా తెలిపారు. ఉగాది పండుగా వేడుక‌ల‌లో పాల్గోన్న  సందీప్ మాట్లాడుతూ.. ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్‌ను మెక్సికోలో జ‌రుప‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

Sandeep Reddy Vanga shares exciting shooting update on the Prabhas starrer Spirit  in Telugu jsp
Sandeep Reddy Vanga shares exciting shooting update on the Prabhas starrer Spirit in telugu


  ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ గురించి ఓ సాలిడ్ అప్డేట్ బయటకొచ్చింది. అర్జున్ రెడ్డి వంటి ‘రా’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఆ తర్వాత  హిందీలో యానిమల్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసారు.

మధ్యలో అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్‌’తో సత్తా చాటి, ఇప్పుడు ప్రభాస్ తో సంచలనాలు సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నేపధ్యంలో  అసలు ప్రభాస్‌ను ఈ ‘రా’ డైరెక్టర్ ఎలా చూపిస్తాడనేది అనౌన్స్మెంట్ నుంచే ఎగ్జైటింగ్‌గా మారింది.

ప్రస్తుతం సందీప్ స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉన్నారు. ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించి సాలిడ్ అప్‌డేట్‌ను పంచుకున్నాడు ద‌ర్శ‌కుడు సందీప్.

Sandeep Reddy Vanga shares exciting shooting update on the Prabhas starrer Spirit  in Telugu jsp
Sandeep Reddy Vanga shares exciting shooting update on the Prabhas starrer Spirit in telugu


ఉగాది పండుగా వేడుక‌ల‌లో పాల్గోన్న  సందీప్ మాట్లాడుతూ.. ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్‌ను మెక్సికోలో జ‌రుప‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇంత‌కంటే ఏం అప్‌డేట్ ఇవ్వ‌లేమ‌ని తెలిపాడు.

ఈ సినిమాలో ప్ర‌భాస్ మూడు కొత్త లుక్స్‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తుంది.  "స్పిరిట్"  సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ ఆర్మీ ఆఫిసర్ పాత్రలో కనిపించనున్నాడు. స్పిరిట్ సినిమాని సందీప్ రెడ్డి భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.


Sandeep Reddy Vanga shares exciting shooting update on the Prabhas starrer Spirit in telugu


 ప్రస్తుతం ప్రభాస్ ఇతర సినిమాల షూటింగులతో బిజీగా ఉండటంతో సందీప్ రెడ్డి ప్రీ ప్రొడక్షన్ పనులు సైలెంట్ గా మొదలు పెట్టాడు. దీంతో క్యాస్ట్ అండ్ క్రూతోపాటూ లొకేషన్స్ ని కూడా వెతుకుతున్నాడు.

 ప్రస్తుతం సందీప్ రెడ్డి మెక్సికో లో స్పిరిట్ సినిమా కోసం షూటింగ్ లొకేషన్స్ చూస్తున్నట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా కొన్ని ఫారెస్ట్ ఏరియాలలో వార్ ఫాట్ సీన్స్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Sandeep Reddy Vanga shares exciting shooting update on the Prabhas starrer Spirit in telugu


 మొత్తానికి ప్రభాస్ స్పిరిట్ ఈ ఏడాది చివరిలో పట్టాలెక్కనుంది. అయితే ప్రభాస్ ఈ సినిమా కోసం కేవలం 90 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం.

ముంబై, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో కూడా షూటింగ్ చెయ్యనున్నారు. దీంతో స్పిరిట్ వచ్చే ఏడాది చివరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  ఇప్పటికే స్క్రిప్ట్ ఓ రేంజ్‌లో వచ్చిందట.

అసలు ఈ సినిమాలో ప్రభాస్ యాటిట్యూడ్‌ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుందట. ఎంతలా అంటే.. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్‌కి పది రెట్లు ఎక్కువగా.. స్పిరిట్‌లో ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందని టాక్. 

Sandeep Reddy Vanga shares exciting shooting update on the Prabhas starrer Spirit in telugu


 
మరో ప్రక్క  స్పిరిట్ లో ప్రభాస్ కి విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఇప్పటికే విజయ్ కి సందీప్ రెడ్డి స్పిరిట్ స్టోరీ వినిపించగా విజయ్ కూడా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం.అయితే స్పిరిట్ లో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నట్లు రూమర్లు రావడంతో సోషల్ మీడియాలో అప్పుడే హైప్ మొదలైంది.  

Latest Videos

vuukle one pixel image
click me!