విశాల్ రాజకీయ ప్రకటన, విజయ్ దళపతి పై పోటీ చేయబోతున్నారా..?

First Published Apr 16, 2024, 9:10 PM IST

తమిళ స్టార్ హీరో విశాల్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడా..? తాజాగా ఆయన చేసినప్రకటనతో అది కన్ ఫార్మ్ అయ్యిందా..? విశాల్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబున్నారా..? చేస్తే ఎవరిమీద..ఎక్కడి నుంచి పోటీలో ఉండబోతున్నారు..? 

హీరో విశాల్‌.. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. చాలా వేగంగా మూవీస్‌ చేస్తూ రాణిస్తున్నారు. జయాపజయాలకు అతీతంగా ఆయన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన ప్రతి సినిమా తెలుగులో ఏక కాలంలో విడుదలవుతుంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల విశాల్‌ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు ప్రచారం జరిగింది. 

ధనుష్ వర్సెస్ ఐశ్వర్య రజినీకాంత్, విడాకులపై కోర్టు కీలక ఆదేశాలు, ఏం జరుగుతోంది..?

తమిళ హీరో విజయ్‌ రాజకీయ ఎంట్రీని ప్రకటించిన నేపథ్యంలో విశాల్ కూడా ఆయన బాటలోనే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని అన్నారు.  ఈ విషయంలో విశాల్ కూడా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

రతికా రోజ్ కు బంపర్ ఆఫర్, ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బ్యూటీ..

యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న విశాల్ ప్రస్తుతం రత్నం అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో రెండు సినిమాలు  రాగా.. ముచ్చటగామూడో సినిమా రత్నం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో  విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది.
 

Tamil actor Vishal reveals about Vijay

నటుడు విజయ్‌కి వీరాభిమాని అయిన విశాల్ రాజకీయాల్లోకి వస్తున్నారట. ఆయన  ఈ విషయం ప్రకటించినట్లుగా తమిళ మీడియా నుంచి సమాచారం. విజయ్ తో పాటు  విశాల్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో అదేం లేదు అన్నట్టుగా మాట్లాడిన  విశాల్ ఇప్పుడు తన రాజకీయ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతే కాదు  2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలోగా రాజకీయాల్లోకి వస్తానని, పోటీలో కూడా ఉంటానని విశాల్ హామీ ఇచ్చారు.

ఇక ఆయన ప్రత్యేక పార్టీ పెడతారా..? లేక  ఇతర పార్టీల్లో చేరతాడా..? లేక స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తారా అనేది తెలియాల్సింది ఉంది. ఈ విషయాన్ని త్వరలో  ప్రకటిస్తానని కూడా ఆయన  చెప్పారు. విశాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రజలకు తగిన సౌకర్యాలు లేకపోవడం, వారి ఇబ్బందులు చూడలేకనే తాను  రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటికే కొన్ని స్వఛ్చంద సంస్థలు నడుపుతూ.. ప్రజా సేవ చేస్తున్నాడు విశాల్ ప్రజల ప్రగతి కోసం, జిల్లాల వారీగా, మండలాల వారీగా శాఖల వారీగా ప్రజల సంక్షేమ కోసం కృషి చేసేందుకు `మక్కల్‌ నా ఇయక్కం` సంస్థని రూపొందించాం అని గతంలో నే చెప్పారు విశాల్. అంతే కాదు విశాల్ వారి అమ్మ పేరు మీద స్థాపించిన `దేవి ఫౌండేషన్‌` ద్వారా దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం పేరు మీద ప్రతి ఏడాది చాలా మంది టాలెంట్‌ ఉన్న నిరుపేద విద్యార్థులను చదివిస్తున్నారు కూడా. 

vishal

అలాగే తమిళనాడులోని ప్రతి జిల్లాలో రైతులకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాడు విశాల్. ఇలా తమిళనాట అనేక సమాజిక కార్యక్రమాలు చేస్తున్న విశాల్ రాజకీయ ప్రవేశంపై గతంలో ఇంట్రెస్ట్ లేదు అన్నారు.. ఇప్పుడు రాబోతున్నట్టు ప్రకటించారు. ఇదివరకు దివంగత జయలలిత మరణానంతరం.. ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయ్యారు విశాల్. ఇక ఈసారి పూర్తిగా రంగంలోకి దిగబోతున్నారు.  
 

ఇక విశాల్ సినిమాల  విషయానికి వస్తే.. రత్నం సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 26న విడుదలకు సిద్దం అయ్యింది. ఇక ఈమూవీ ప్రమోషన్ జోరును పెంచారు టీమ్. ఈ సినిమా ప్రమోషన్ తో పాటు.. తాను డైరెక్ట్ చేస్తున్న మరో సినిమా షూటింగ్ కోసం విశాల్ లండన్‌కు వెళ్ళబోతున్నాడు. 

click me!