రామరాజు ఇంట్లో హల్దీ ఫంక్షన్ మొదలవుతుంది. అమూల్యను బాగా తయారుచేసి అందరూ పసుపు రాసి ఆశీర్వదిస్తారు. ఈ మధ్యలో కూడా ప్రేమ, ధీరజ్ మళ్లీ గిల్లికజ్జాలు పెట్టుకుంటారు. కానీ భాగ్యం, వల్లి మాత్రం ముఖాలు మాడ్చుకొని ఉంటారు. మంగళ స్నానాలు పూర్తవుతాయి. అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు.
ఇక పెద్దమ్మ వేదవతి ఇంటికి వస్తుంది. అక్కడ వేదవతి, నర్మద, ప్రేమ అమూల్యను రెడీ చేస్తూ ఉంటారు. అక్కడ పెద్దమ్మను చూసి అందరూ షాక్ అవుతారు. పెళ్లికి మమ్మల్ని పిలవలేదేమి అని అడుగుతుంది పెద్దమ్మ. దానికి వేదవతి ‘నాకు అందర్నీ పిలవాలనిపిస్తుంది. కానీ భద్రావతి అక్కకి కోపం ఎక్కువ. ఆ ఇంటి మనుషులతో మాట్లాడితే కోపంతో ఊగిపోతుంది’ అని చెబుతుంది.
దానికి పెద్దమ్మ తనకు అన్ని విషయాలు తెలుసని చెబుతుంది. పెద్దమ్మ కాలి పై పడి అమూల్య ఆశీర్వాదాలు పొందుతుంది. ప్రేమను చూసి ‘నేను మీ నాన్నమ్మ అక్కని. మీ నానమ్మ ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పింది’ అని వివరిస్తుంది. మీరందరిని ఒక్కటి చేసే సందర్భం త్వరలోనే వస్తుంది. సంతోషంగా ఉండండి అని చెబుతుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.