Gunde Ninda Gudi Gantalu: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. మీనా, సుమతిలకు చుక్కలు చూపించిన రోహిణీ

Published : Jan 26, 2026, 09:29 AM IST

Gunde Ninda Gudi Gantalu: గతం దాచి ఇంటి మొత్తానికి దొరికిన రోహిణీ చాలా తెలివిగా తప్పించుకుంది.ఘోరమైన అబద్ధం చెప్పడం కాకుండా.. అత్త ముందు మీనాని ఇరికించింది. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా మీ కోసం... 

PREV
14
మీనాపై విరుచుకుపడ్డ ప్రభావతి, రోహిణీ

రోహిణీ చెప్పిన అబద్దానికి మీనా బలి అవుతుంది. మీనా కారణంగానే తాను రోహిణీని తిట్టాల్సి వచ్చిందని ప్రభావతికి కోపం వస్తుంది. ఏకంగా కొట్టడానికి చెయ్యి కూడా ఎత్తుతుంది. అయితే సత్యం ఆపుతాడు. దీంతో..‘ ఏరికోరి ఈ పూలు అమ్మేదాన్ని తెచ్చి నా ఇంటిని బ్రష్టు పట్టించింది మీరు.. దేని వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయో తెలిసి కూడా నన్ను ఆపుతారేంటి?’ అని మీనాని తిడుతూ సత్యంని ప్రభావతి ప్రశ్నిస్తుంది. ‘ ఇలాంటివాళ్లకు చుదువుకున్న వాళ్లన్నా,గౌరవంగా బతికేవాలన్నా అసూయ ఉంటుంది.. అందుకే నా మీద అనుమానం వచ్చేలా చేసింది’ అని మీనా పై రోహిణీ విరుచుకుపడుతుంది. ‘ పార్లరమ్మా.. మర్యాదగా మాట్లాడు’ అని బాలు అంటే..‘ మీ గురించి నేను ఎప్పుడైనా తప్పుగా మాట్లాడానా? మా గురించి మీకు ఎందుకు? నీ పెళ్లాన్ని లిమిట్స్ లో ఉండమని చెప్పు’ అని మనోజ్ కూడా బాలుకి చెబుతాడు.అది విన్న బాలుకి కోపం వస్తుంది. ‘ ఒరేయ్ చవట దద్దమ్మా.. నీ పెళ్లాం కడుపుతో ఉన్న విషయం నిజం కాదా? అది నీకు కూడా తెలీదు.. ముందు మీనాకు తెలిసింది... ఇప్పుడు అందరికీ తెలిసింది.. ఆఖరికి నీకు తెలిసింది.. నీ కాపురం ఎంత కమ్మగా ఉందో ఇప్పుడే మాకు కూడా తెలిసింది’ అని బాలు అంటాడు. ఆ మాటకు మనోజ్ తల వంచుకుంటాడు.

‘ మీనా అసలు.. ఈ విషయం నీకు ఎలా తెలిసింది?’ అని రోహిణీ అడిగితే.. ‘ హాస్పిటల్ వాళ్లు రోజూ పూజకు పూలు అడిగితే ఇవ్వడానికి వెళ్లినప్పుడు.. నిన్ను అక్కడ చూశాను. వెళ్లి అడిగాను’ అని మీనా చెబుతుంది. ‘ అంటే.. రోహిణీని స్పై చేస్తున్నావా?’ అని మనోజ్ అంటాడు. ‘ కాజువల్ గాఎంక్వైరీ చేస్తే చెప్పారు... అందులో తప్పేముంది?’అని శ్రుతి అంటుంది. ‘ రోహిణీ గురించి ఎంక్వైరీ చేయడంలో దానికేం హక్కు ఉంది?’ అని ప్రభావతి సీరియస్ అవుతుంంది. ‘ అసలు.. మీనా ఏ తప్పు చేయలేదు..’ అని బాలు అంటే.. మనోజ్ ఊరుకోడు. బాలుకూడా రివర్స్ లో..‘ నీ భార్య చేసింది ఏంటి? లోక కళ్యాణమా? కడుపు వచ్చిందీ చెప్పలేదు.. పోయిందీ చెప్పలేదు.. రెండోసారి కడుపు రావాలని హాస్పిటల్ కి వెళ్లిందీ చెప్పలేదు.. మీనాకు తెలిసింది.. తెలిసిందే చెప్పింది..’ అని బాలు అంటాడు. కానీ.. ప్రభావతి మాత్రం మీనా మీద నిప్పులు చిమ్ముతుంది. ‘ ఇంకోసారి ఇలాంటి గొడవలు సృష్టించావో.. నేను మనిషినే కాదు’ అని వార్నింగ్ ఇస్తుంది.

‘ మీనా నీకు అంత కడుపు మంటగా ఉంటే.. నీకు అంత అసూయగా ఉంటే.. నాలో నీకు అన్నీ తప్పులే కనపడుతుంటే.. పొమ్మంటే పోతాను.. ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతాను’ అని రోహిణీ అంటుంది. అయితే.. ‘ దానికోసం నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఏంటి?’ అని ప్రభావతి సపోర్ట్ గా మాట్లాడుతుంది. ఈ గొడవ ఇంతటితో ఆపమని సత్యం అందరి మీదా అరుస్తాడు. ఇంట్లో అందరూ చేసిన తప్పులను బయటపెట్టి... ఎవరి దగ్గర సీక్రెట్స్ పెట్టుకోవద్దని సలహా ఇస్తాడు. దీంతో.. ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లిపోతారు.

24
రోహిణీ అసలు కథ తెలుసుకుంటానన్న బాలు..

మీనా ఏడుస్తూ ఉంటే.. బాలు ఓదారుస్తాడు. ‘నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్ మీనా?’ అని బాలు అంటే.. ‘ ఇదేం తలరాత అండీ.. నాకు తెలిసిందే చెప్పా తప్పా..లేనిది ఏమీ చెప్పలేదు కదా? దీనికే ఇంత రాద్ధాంతం చేయాలా? మీరు లేకపోతే అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసేవారు కూడా..అంత అలుసా నేనంటే..’ అని మీనా ఏడుస్తుంది. ‘ అసలు.. ఈ విషయాన్ని నువ్వు డబ్బుడమ్మకు ఎందుకు చెప్పావ్? నాతోనే చెప్పి ఉండొచ్చు కదా’ అని బాలు అడుగుతాడు. ‘ మీకు తెలిస్తే... మామయ్యకు చెబుతారు కదా.. చివరకు జరిగింది అదే కదా’ అని మీనా అంటుంది. ‘ ఈ ఇంట్లో ఏ విషయం అయినా, ఏ రహస్యం అయినా ఎక్కువ రోజులు దాచలేరు.. ఏదో ఒక రోజు బయటపడుతుంది.’ అని బాలు అంటాడు.. ‘ కానీ, తప్పించుకునే తెలివితేటలు నాకు లేవు’ అని మీనా అంటే.. ‘నీకు లేవు.. కానీ పార్లరమ్మకు ఉన్నాయ్.. ముందు అమ్మ అడిగినా, మనోజ్ గాడు అడిగినా వణికి పోయింది.. తర్వాత కొత్త కథ అల్లేసింది’ అని బాలు అంటాడు. వీళ్ల మాటలు మొత్తం రహస్యంగా రోహిణీ వింటూ ఉంటుంది. ‘ నాకు కూడా అది కొత్త కథ అల్లినట్లే అనిపించింది..’ అని మీనా చెబుతుంది.‘ ఈ విషయం ముందే నాకు తెలిసి ఉంటే.. మొత్తం కూపీ లాగేవాడిని.. మూలాల నుంచి నిజం రాబట్టేవాడిని.. నువ్వు డబ్బుడమ్మకు చెబితే..ఒకరి నుంచి ఒకరికి సరఫరా చేసింది’ అని బాలు అంటాడు. కానీ.. ప్రభావతి తిట్టినందుకు మీనా చాలా బాధపడుతుంది. ‘ పార్లరమ్మ పెద్ద కేడీ అని నాకు తెలుసు.. తన గురించి ఏ నిజం తెలిసినా నువ్వు పట్టించుకోవద్దు.. చెప్పాల్సింది అయితే నాకు మాత్రమే చెప్పు’ అని బాలు అంటాడు. ‘ అయినా.. అబార్షన్ అయితే.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎందుకు ఉండాలి? అలా చెప్పకపోవడం తప్పే కదా’ అని మీనా అంటే.. ‘ ఈ కథ వెనక అసలు కథ నేను తెలుసుకుంటాను’ అని బాలు అంటాడు. ఇదంతా విన్న రోహిణీ.. ‘ అయితే.. వీళ్లకు నా మీద వచ్చిన అనుమానం పోలేదన్నమాట.. ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుంటారు అన్నమాట.. వీళ్ల వల్ల నాకు ఎప్పటికైనా ప్రమాదమే.. ఈలోగా నేనే ఏదో ఒకటి చేయాలి’ అని నిర్ణయం తీసుకుంటుంది.

34
మీనాని ఇంట్లో నుంచి గెంటేస్తానన్న ప్రభావతి..

ఇక, రోహిణీ చెప్పిన మాటల గురించి ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే.. రోహిణీ వచ్చి..ఏదైనా పనిలో ఉన్నారా అత్తయ్య అని అడుగుతుంది. ‘ లేదమ్మా.. నువ్వు ఏ తప్పు చేయవు అని నాకు తెలుసు..కానీ, మనకు ఈ నిందలు తప్పడం లేదు.. నీ ముఖంలో ఆ బాధ కనిపిస్తుంది.. కాసేపు విశ్రాంతి తీసుకోమ్మా’ అని ప్రభావతి అంటే..‘ పడుకున్నా నాకు నిద్ర పట్టదు అత్తయ్య’ అని రోహిణీ అంటుంది. ఇక రోహిణీ.. ప్రభావతికి సోప్ వేయడం మొదలుపెడుతుంది. ప్రభావతిని దేవత.. మనోజ్ ని బంగారం అని పొగుడుతూ..మీనా, బాలు లపై కావాలని ఎక్కిస్తుంది. రోహిణీ మరో ప్లాన్ వేస్తుంది.. మనోజ్ తో వేరు కాపురం పెడతాను అని అడుగుతుంది. కానీ..ప్రభావతి వద్దని బతిమిలాడుతుంది. కావాలంటే బాలు, మీనాలను ఇంట్లో నుంచి వెళ్లగొడతాను అని ప్రభావతి చెబుతుంది.

ఇక.. తర్వాత.. రోహిణీ బాలు అసలు కథ తెలుసుకుంటాను అన్న మాటలు తలుచుకుంటూ ఉంటుంది. మనోజ్ వచ్చి.. ఇంకా బాధపడుతున్నావా అని అడుగుతాడు. వేరే కాపురం పెడదామని అన్నావ్ అంటకదా.. నేను అమ్మను వదిలి రాలేను అని మనోజ్ చెబుతాడు. అంతేకాకుండా.. ఇప్పుడు వేరే కాపురం పెడితే.. ఖర్చులు పెరుగుతాయి అని భయపడతాడు. కానీ, రోహిణీ మాత్రం.. కావాలని బాలు, మీనా లమీద ఎక్కిస్తాడు.‘ నాకు ఇలా జరిగింది అనే బాధ లేదా ’ అని రోహిణీ అడిగితే.. ‘ నాకు చాలా సంతోషంగా ఉంది.. నీకు అబార్షన్ అయ్యిందని బాధ ఉన్నా.. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తండ్రిని అవుతాను అని నమ్మకం కలిగింది.. మన ఇద్దరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అనే నమ్మకం వచ్చింది’ అని చెబుతాడు. తర్వాత బిడ్డ గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడతాడు. ఆ మాటలకు రోహిణీ చాలా బాధపడుతూ.. మనోజ్ ని హత్తుకుంటుంది. ‘ నన్ను క్షమించు మనోజ్.. నీకు చాలా అబద్దాలు చెబుతున్నాను.. కానీ నీతో సంతోషంగా ఉండాలని మాత్రమే చెబుతున్నాను’ అని మనసులోనే అనుకుంటుంది.

44
సుమతి ఉద్యోగం పోగొట్టిన రోహిణీ..

ఇక.. సుమతి దగ్గరకు మీనా వెళ్తుంది. ఇద్దరూ కలిసి టీ తాగుతారు. ఇక.. రోహిణీ ప్రెగ్నెన్సీ విషయం సుమతి అడిగితే.. జరిగింది మొత్తం మీనా చెబుతుంది. ఇంకోసారి రోహిణీ విషయంలో జోక్యం చేసుకోను అని చెప్పి.. మీనా వెళ్లిపోతుంది. అయితే.. రోహిణీ గురించి ఆరా తీసినందుకు.. హాస్పిటల్ లో సుమతిని చాలా దారుణంగా తిడతారు. ఉద్యోగం లో నుంచి తీసేశామని.. ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెబుతారు. సుమతి బతిమిలాడుకుంటూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది..

Read more Photos on
click me!

Recommended Stories