పెళ్లైన రెండేళ్లకే విభేదాలు, హన్సిక మోత్వానీ విడాకులు తీసుకోబోతుందా? నిజమెంత?

Published : Jul 24, 2025, 03:14 PM IST

స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానికి పెళ్లై రెండేళ్లు మాత్రమే అవుతోంది. ఈక్రమంలో స్టార్ హీరోయిన్ తన భర్తతో విడాకులు తీసుకోబోతుందంటూ వార్త వైరల్ అవుతోంది. మరి ఈవిషయంలో నిజం ఎంత?

PREV
16

చాలా చిన్నవయస్సులో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ హన్సికా మోత్వాని. 15 ఏళ్లకే హీరోయిన్ అయ్యింది బ్యూటీ. బాల నటిగా బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన హన్సిక, దేశ ముదురు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఆతరువాత టాలీవుడ్ లో రాణించలేకపోయింది. వెంట వెంటనే ప్లాప్స్ పడటంతో ఇక్కడ అవకాశాలు తగ్గాయి. 

దాంతో తమిళ పరిశ్రమ హిన్సికను అక్కున చేర్చుకుంది. కోలీవుడ్ లో స్టార్ హీరోల తో హిట్ మీద హిట్ కొట్టిన హన్సికా.. 30 ఏళ్లు వచ్చేలోపు 50 సినిమాలు కంప్లీట్ చేసి హాఫ్ సెంచరీ కూడా కొట్టింది. ఇక కోలీవుడ్ లో కూడా హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న టైమ్ లో పెళ్లి చేసుకుని సినిమాలకు తగ్గించుకుంది బ్యూటీ.

26

తమిళంలో ధనుష్ నటించిన మాప్పిళ్ళై సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన హన్సికా, తర్వాత తక్కువ కాలంలోనే విజయ్, సూర్య, శివ కార్తికేయన్, కార్తి లాంటి స్టార్ హీరోల సరసన నటించి కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యారు. మొదట్లో బొద్దుగా ఉన్న హన్సిక, తర్వాత బరువు తగ్గించుకుని స్లిమ్ గా మారింది. ఆమె బరువు తగ్గిన తర్వాత సినిమాల్లో ఆఫర్లు తగ్గాయి.

36

2022లో సోహైల్ కతూరియాను ప్రేమించి పెళ్లి చేసుకుంది హన్సిక. సోహైల్ కతూరియాకు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలినే ఆయన మొదట పెళ్లి చేసుకున్నారు. కానీ హన్సికతో ప్రేమలో పడటంతో మొదటి భార్యకు విడాకులిచ్చి, హన్సికను రెండో పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్ లోని ఒక పురాతన కోటలో వీరి వివాహం ఘనంగా జరిగింది.

46

హన్సిక పెళ్లై రెండేళ్లు దాటినా, మొదటి వార్షికోత్సవానికి భర్తతో ఇన్స్టాలో ఫోటో పోస్ట్ చేసిన ఆమె, ఆ తర్వాత ఏడాది పాటు భర్తతో దిగిన ఫోటోలు పెట్టలేదు. దీంతో వారిద్దరి మధ్య గొడవలు జరిగి విడిగా ఉంటున్నారని, సోహైల్ కుటుంబం చాలా పెద్దది కావడంతో వారితో హన్సికకు పడకపోవడంతో విడిపోయారని వార్తలు వచ్చాయి. హన్సిక ప్రస్తుతం తన తల్లితో పాటే పుట్టింట్లో ఉంటున్నట్లు సమాచారం.

56

హన్సిక, సోహైల్ విడిపోయారనే వార్త రావడంతో, విడాకులకు తీసుకోబోతున్నారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ విషయంపై హన్సిక ఇప్పటి వరకూ ఎలాంటి వివరణ ఇవ్వకుండా మౌనంగా ఉండగా, సోహైల్ కతూరియా మాత్రం హిందుస్తాన్ టైమ్స్ కు వివరణ ఇచ్చారు. 

తమ గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. అయితే విడిగా ఉంటున్నది నిజం కాదా, విడాకుల వార్తల్లో వాస్తవం లేదా అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. దీంతో అభిమానుల్లో అయోమయం నెలకొంది. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

66

ఫిల్మ్ ఇండస్ట్రీలో విడాకులు కొత్తేం కాదు. ఇప్పటికే చాలామంది స్టార్ కపుల్స్ విడాకులు తీసుకుని వేరు వేరుగా జీవిస్తున్నారు. పెళ్లైన మూడేళ్లకే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుని విడిపోయారు. 18 ఏళ్లు కలిసున్న స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్య నుంచి విడిపోయి వేరుగా జీవిస్తున్నారు. జీవీ ప్రకాష్, సింధువి కూడా విడాకులు తీసుకున్నారు. ఇటీవలే జయం రవి తన భార్య ఆర్తిపై విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఇలా చాలా జంటలు విడిపోయి వేరు వేరుగా జీవిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories