Hyper Aadi Review on HHVM: `హరి హర వీరమల్లు` మూవీపై హైపర్‌ ఆది రివ్యూ.. ఆ సీన్లకి గూస్‌బంమ్స్ పక్కా

Published : Jul 24, 2025, 03:08 PM IST

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వచ్చిన `హరి హర వీరమల్లు` మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అలరిస్తుంది. ఈ క్రమంలో మూవీపై కమెడియన్‌ హైపర్‌ ఆది తనదైన స్టయిల్‌లో రివ్యూ ఇచ్చారు. 

PREV
15
`హరి హర వీరమల్లు`పై హైపర్‌ ఆది రివ్యూ

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `హరి హర వీరమల్లు` సినిమా గురువారం విడుదలై థియేటర్లలో రచ్చ చేస్తుంది. ఫ్యాన్స్ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. క్రిష్‌తోపాటు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీకి జనరల్‌ ఆడియెన్స్ నుంచి స్పందన మిశ్రమంగా ఉంది.

 కాకపోతే పవన్‌ మార్క్ యాక్షన్‌ సీన్లు బాగున్నాయని అంటున్నారు. సినిమా ఫలితంపై మరింత క్లారిటీ రావాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్‌, నటుడు హైపర్‌ ఆది స్పందించారు.

25
`హరి హర వీరమల్లు`లో హైలైట్‌ లీక్‌ చేసిన ఆది

`హరి హర వీరమల్లు` సినిమాపై హైపర్‌ ఆది తనదైన స్టయిల్‌లో రివ్యూ ఇచ్చారు. సినిమా వేరే రేంజ్‌లో ఉందని చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ ఇంట్రడక్షన్‌ ఫైట్‌కే మీరు(అభిమానులు) తెచ్చుకున్న పేపర్లు అయిపోతాయన్నారు.

సినిమాలో ఇలాంటి హై ఇచ్చే సీన్లు చాలా ఉన్నాయని, ముఖ్యంగా క్లైమాక్స్ లో పవన్‌ కళ్యాణ్‌ కంపోజ్‌ చేసిన ఫైట్‌, దానికి కీరవాణి ఇచ్చిన బీజీఎం మీకు గూస్‌బంమ్స్ తెప్పిస్తుందని, ఆ హై తోనే మీరంతా థియేటర్‌ నుంచి బయటకు వస్తారని చెప్పారు ఆది.

35
అభిమానులకు నచ్చే సినిమాని తీయాలని తపించే వ్యక్తి పవన్‌

ఆయన ఇంకా చెబుతూ, `ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్లి వీరమల్లు చేసిన పోరాటాన్ని థియేటర్లో ఎక్స్ పీరియెన్స్ చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో నేను కూడా సెట్‌ కి వెళ్లాను.

 పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు నచ్చేసినిమా తీయాలని ప్రతి సీన్‌ విషయంలో ఆయన ఎంతో కేర్‌ తీసుకున్నారు. అది ఈ రోజు స్క్రీన్‌ మీద కనిపించింది. క్లైమాక్స్ లో ప్రతి అభిమానిని కదిలించింది. 

ఆయన అభిమానుల కోసం ఎప్పుడో ఒక్కసారి హిట్‌ కావాలని కోరుకుంటే `గబ్బర్‌ సింగ్‌` వచ్చింది. ఇప్పుడు మళ్లీ హిట్‌ కోసం కోరుకున్నారు, `హరి హర వీరమల్లు` వచ్చింద`న్నారు హైపర్‌ ఆది.

45
ఆయన కోసం సినిమా చూడాలని వేడుకున్న హైపర్‌ ఆది

`మీరు తెరవెనుక ధర్మం కోసం పోరాడిన పవన్‌ కళ్యాణ్‌ ని చూశారు. ఆన్‌ స్క్రీన్‌లో ధర్మం కోసం పోరాడుతున్న `హరి హర వీరమల్లు`ని కూడా చూసి ఎంజాయ్‌ చేయాలని కోరుకుంటున్నా.

 ఆయన సినిమా జీవితంలో ఎప్పుడూ ఇవ్వనన్నీ ఇంటర్వ్యూలు, సినిమా ప్రమోషన్స్ చేశారు. నిర్మాత ఏఎం రత్నంని నిలబెట్టేందుకు తనవంతుగా ప్రయత్నిస్తున్నారు. రత్నంగారు పవన్‌ కళ్యాణ్‌ పొలిటికల్‌ షెడ్యూల్‌ని బట్టి షూటింగ్ ప్లాన్‌ చేశారు. 

పవన్‌ కళ్యాణ్‌ సినిమా కెరీర్‌లో ఒక మంచి మైలు రాయిని సాధించడానికి తోడ్పడ్డ మంచి నిర్మాత ఏఎం రత్నం. అలాంటి వ్యక్తి కోసం సినిమా చూడాలని వేడుకుంటున్నట్టు తెలిపారు ఆది.

55
పవన్‌ మళ్లీ సినిమాలు చేస్తారో లేదో తెలియదు

మరోవైపు `పవన్‌ కళ్యాణ్‌ ముప్పై ఏళ్లుగా సినిమా రంగంలో ఉన్నారు. ఎన్నో మంచి సినిమాలు అందించారు. ఏ రోజూ కూడా ఆయన నా సినిమాని చూడండని అడగలేదు. మొదటిసారి అడుగుతున్నారు. 

ఎందుకంటే ఇప్పుడున్న ఈ మూడు సినిమాలు పూర్తయ్యాక మళ్లీ ఆయన ఎప్పుడు సినిమాలు చూస్తారో కూడా తెలియదు. అందుకే ఈ మూవీని చూసి ఎంకరేజ్‌ చేయాలని, ఆయన మళ్లీ సినిమాలు చేసేలా చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు ఆది. 

పవన్‌ కళ్యాణ్‌ నాయకులను వ్యతిరేకిస్తారు, కానీ సాధారణ ప్రజలందరినీ ఒకేలా చూస్తారు, కాబట్టి మూవీని చూసి ఆదరించాలని తెలిపారు హైపర్‌ ఆది. ఈ మేరకు ఆది తన సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ఇది వైరల్‌ అవుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories