విశాల్ సంచలన నిర్ణయం.
ఏ పదవిలో ఉన్నా కాని సంచలన నిర్ణయాలు తీసుకోవడంతో విశాల్ మార్క్ వేరుగా ఉంటుంది. ఈక్రమంలోనే నడిఘర్ సంగానికి సెక్రట్రీగా మరో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు స్టార్ హీరో. సినిమా విడుదల అయిన వెంటనే జరగుతున్న రివ్యూల ప్రభావం సినిమాలపై తీవ్రంగా పడుతోందని, దానిని ఎలాగైనా నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు విశాల్. దాని కోసం రాబోయే రోజుల్లో సినిమాలు విడుదలైన మూడు రోజుల తర్వాతే పబ్లిక్ రివ్యూలకు అనుమతించాలంటూ విశాల్ విజ్ఞప్తి చేశాడు.
తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న విశాల్, మీడియాతో మాట్లాడుతూ “సినిమా విడుదలైన వెంటనే ఓటిటీల ప్రభావంతో పాటు, అర్థరాత్రి నుంచే వచ్చేస్తున్న నెగటివ్ రివ్యూల వల్ల థియేటర్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. దాంతో పాటు పాజిటివ్ మౌత్ టాక్ ఉన్నా, ముందుగానే వచ్చిన రివ్యూలతో ప్రేక్షకులు సినిమా చూడటానికి భయపడుతున్నారు. ఆ సినిమా చూసిన తరువాత తమకు నచ్చుతుందో లేదో అన్న విపయం పక్కన పెట్టి.. రివ్యూలు చదివి సినిమాపై అభిప్రాయానికి వస్తున్నారు. దాంతో ఈనిర్ణయం తీసుకున్నాడు విశాల్ .