తండ్రి క్రిస్టియన్‌, తల్లి ముస్లిం.. కోటి రెమ్యునరేషన్‌ తీసుకున్న తొలి హీరోయిన్‌. ఎవరో గుర్తుపట్టారా?

Published : Jan 19, 2025, 01:04 PM IST

సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరినీ ఎలా శిఖరాన్ని ఎక్కిస్తుందో, ఎవరినీ కిందికి దించుతుందో తెలియదు. ఓవర్‌ నైట్‌లో స్టార్‌లుగా ఎదిగిన వారు ఉన్నారు. ఫుల్‌ ఫామ్‌లో ఉన్న సమయాల్లో కూడా అవకాశాలు లేక తెరమరుగైన వారు కూడా ఉన్నారు. రెండో జాబితాలోకే వస్తుంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ, ఇంతకీ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.?   

PREV
15
తండ్రి క్రిస్టియన్‌, తల్లి ముస్లిం.. కోటి రెమ్యునరేషన్‌ తీసుకున్న తొలి హీరోయిన్‌. ఎవరో గుర్తుపట్టారా?

క్రిస్టియన్‌ తండ్రి, ముస్లిం తల్లికి పుట్టిన ఓ అమ్మాయి. పదేళ్ల వయసులో గోవాకు షిప్ట్‌ అయ్యింది. అందుకే ఈ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఈ హీరోయిన్‌కి గోవా బ్యూటీ అనే ట్యాగ్ లైన్‌ కూడా వచ్చింది. 2003లో మోడలింగ్‌ రంగం ద్వారా తొలిసారి ముఖానికి మేకప్‌ వేసుకుంది. ఆ తర్వాత పలు యాడ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తెలుగు దర్శకుల కంట పడింది. దర్శకుడు తేజ తొలిసారి ఈ బ్యూటీలో ఉన్న ట్యాలెంట్‌ను గుర్తించి ఓ అవకాశం ఇచ్చాడు. అయితే ఈ సినిమా పట్టాలెక్కక ముందే క్యాన్సిల్‌ అయ్యింది. 
 

25

అయితే ఆ తర్వాత వచ్చిన అవకాశంతో తెలుగు ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. రెండో సినిమాతోనే ఏకంగా మహేష్‌ బాబు సరసన నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీ పేరు ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో మారుమోగింది. వరుసగా రెండు సినిమాలు విజయవంతం కావడంతో లక్కీ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. పవన్‌, రవితే, అల్లుఅర్జున్‌, ప్రభాస్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. 
 

35

ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో మీకు ఈ పాటికే ఓ క్లారిటీ వచ్చే ఉంటుంది కదూ! అవును ఈ చిన్నది మరెవరో కాదు గోవా బ్యూటీ ఇలియానా. దేవదాసు సినిమాతో ఇండస్ట్రీని షేక్‌ చేసిన ఈ చిన్నది ఆ తర్వాత రెండో చిత్రం పోకిరీతో ఇండస్ట్రీ హిట్‌ను సొంతం చేసుకుంది.

ప్రభాస్‌తో మున్న, బన్నీతో జల్సా, పవన్‌తో జల్సా ఇలా క్రేజీ సినిమాల్లో నటించి మప్పించింది. ఇక రవితేజతో నటించిన ఖతర్నాక్‌ సినిమాకు ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్‌ తీసుకొని.. తెలుగులో కోటి రూపాయల రెమ్యునరేషన్‌ తీసుకున్న తొలి హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. 
 

45

అయితే 2012లో వచ్చిన జులాయి చిత్రం తర్వాత ఇలియానా కెరీర్‌ కుంటుపడిందని చెప్పాలి. బర్ఫీ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇలియానా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. హిందీలో వరుస అవకాశాలు దక్కినా పెద్దగా విజయాలు మాత్రం వరించలేవు. 2018లో మరోసారి రవితేజ హీరోగా వచ్చిన 'అమర్ అక్బర్ ఆంటోని'తో మళ్లీ తెలుగు వారిని పలకరించింది అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. 
 

55

ఇక వ్యక్తిగత జీవితం విషయంలో కూడా ఇలియానా నిత్యం వార్తల్లో నిలిచింది. 2018లో ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫ్‌ ఆండ్రూ నీబోన్‌తో కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న ఈ బ్యూటీ ఆ తర్వాత అతనితో విడిపోయింది. అయితే 2023లో మైఖేల్‌ డోలన్‌ను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఆగస్టులో బాబు పుట్టాడు.

ఈ లెక్కన పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయ్యింది ఇలియానా. కాగా ఇలియానా చివరిగా 2024లో వచ్చిన 'డు ఔర్‌ డు ప్యార్‌' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. మరి 2025లో అయినా ఇలియానా కెరీర్‌ మలుపు తిరుగుతుందో లేదో చూడాలి. 

click me!

Recommended Stories