టాలీవుడ్ లో యాంకర్లు యాంకర్లుగానే ఉండిపోరు. నటనలో కూడా రాణించాలని అనుకుంటారు. చాలా మంది యాంకర్లు నటనలో కూడా సక్సెస్ అయ్యారు. అనసూయ చూస్తే ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. రంగస్థలం, పుష్ప, క్షణం లాంటి చిత్రాలు అనసూయకి తిరుగులేని క్రేజ్ తీసుకువచ్చాయి. శ్రీముఖి కూడా అప్పుడప్పుడూ నటిస్తోంది. యాంకర్ ప్రదీప్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.