4 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్‌.. "సోల‌పురం" పాట‌లో ఎంత అర్థం ఉందో తెలుసా?

Published : Aug 07, 2026, 03:06 PM IST

Folk Song: తెలంగాణ జానపద పాటలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. గ్రామీణ జీవితం, సరదా సంభాషణల‌ను పాట‌గా మలిచిన తీరు ప్రేక్ష‌కుల‌ను తెగ ఆక‌ట్టుకుంటున్నాయి. తాజాగా "సోలపురం పోయినాను.. సోలడడ్లు తెచ్చినాను" అనే పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.

PREV
15
భార్యాభర్తల మధ్య చిలిపి సంభాషణే పాటగా

ఈ పాటలో భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న సంభాషణలను ఎంతో సహజంగా చూపించారు. "దంచనన్న దంచే.. నేను దంచపో", "సెరుగనన్న సెరుగే", "వండనన్న వండే" అంటూ భార్య ఒక్కో పని చేయనని సరదాగా అంటుంటే, భర్త కూడా అదే రీతిలో చమత్కారంగా స్పందిస్తాడు. ఇద్దరి మధ్య జరిగే ఈ మాటల యుద్ధం ప్రేక్షకులను నవ్విస్తూనే, వారి మధ్య ఉన్న అనురాగాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ పాటలో ఎక్కడా కోపం, ఆధిపత్యం కనిపించదు. ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ, చివరకు ప్రేమతోనే సమస్యను పరిష్కరించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అందుకే ఈ పాటను ఒక్కసారి విన్నవారు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

25
చివర్లో వచ్చే సందేశమే పాటకు అసలైన బలం

పాట చివర్లో వచ్చే లైన్లు ఈ ఫోక్ సాంగ్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. "నీకేది కావాలన్న చెప్పు.. తోడుగ నేనున్నా", "నువ్వే నాకు ధీమా", "రాముడంటి ప్రేమ.. సీత కష్టాలను పెట్టబోనే", "జీవితమే నీతో కలకాలం కలిసుందామే" వంటి పదాలు భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో అందంగా చెబుతాయి. భార్యను కేవలం ఇంటి పనులు చేసే వ్యక్తిగా కాకుండా, జీవిత భాగస్వామిగా గౌరవించే భర్త పాత్రను ఈ పాటలో ఎంతో చక్కగా ఆవిష్కరించారు. అందుకే "ప్రతి అమ్మాయికి ఇలాంటి భర్తే కావాలి" అనే భావన ఈ పాట విన్న ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ప్రేమ అంటే మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలనే సందేశాన్ని కూడా ఈ పాట చాలా సున్నితంగా అందిస్తోంది.

35
పల్లెటూరి యాస, సంగీతం..

ఈ పాటకు తెలంగాణ పల్లె భాషే ప్రధాన బలం. గ్రామాల్లో మాట్లాడుకునే సహజమైన పదాలను ఎలాంటి ఆర్భాటం లేకుండా ఉపయోగించడం వల్ల ప్రతి ఒక్కరికీ ఈ పాట దగ్గరగా అనిపిస్తుంది. మార్క్ ప్రశాంత్ అందించిన సంగీతం జానపద సొగసును ఏమాత్రం తగ్గించకుండా వినసొంపుగా తీర్చిదిద్దింది. దిలీప్ దేవగన్, మనిశ్రీ ఆలాపన పాటకు మరింత జీవం పోసింది.

45
శేఖర్ వైరస్ అదిరిపోయే కొరియోగ్రఫీ

వసీం రాసిన సాహిత్యానికి, మనిశ్రీ అందించిన అదనపు సాహిత్యం చక్కగా కలిసిపోయాయి. శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ, మోజేష్ కొలుగూరి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా ఈ పాటను విజువల్‌గా మరింత అందంగా నిలబెట్టాయి. ఈశ్వర్ సాయి, బ్రహ్మరాంబిక తెరపై చూపించిన హావభావాలు నిజమైన గ్రామీణ దంపతులను గుర్తు చేస్తాయి.

55
4 కోట్ల వ్యూస్‌కు చేరువలో..

"సోలపురం పోయినాను" పాటను Fly On Reels Media సమర్పించగా, అదే సంస్థ నిర్మించింది. వినీత్ నామిండ్ల, కృష్ణ లింగబత్తిని ఈ ప్రాజెక్ట్‌ను సమర్పించారు. సంగీతాన్ని మార్క్ ప్రశాంత్ అందించగా, దిలీప్ దేవగన్, మనిశ్రీ ఆలపించారు. సాహిత్యాన్ని వసీం రాయగా, అదనపు లిరిక్స్‌ను మనిశ్రీ అందించారు. ఈశ్వర్ సాయి, బ్రహ్మరాంబిక ప్రధాన పాత్రల్లో నటించగా, శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ చేశారు. మోజేష్ కొలుగూరి డీవోపీ, ఎడిటింగ్, డీఐ బాధ్యతలు నిర్వహించారు. దాదాపు 4 కోట్ల వ్యూస్‌కు చేరువలో ఉన్న ఈ తెలంగాణ ఫోక్ సాంగ్, కేవలం వినోదాన్ని మాత్రమే కాదు.. ప్రేమ, పరస్పర గౌరవం, అనుబంధం ఉన్న దాంపత్యమే అసలైన ఆనందమని గుర్తు చేస్తోంది. అందుకే ఈ పాట యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల మనసులను కూడా గెలుచుకుంటూ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

Read more Photos on
click me!

Recommended Stories