Venkatesh: ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలంటే లేడీ అభిమానులకే కాదు కాదు సెలబ్రిటీలకు హీరోయిన్లకు కూడా క్రష్ ఉంటుంది. చాలామంది హీరోయిన్లు తమ పస్ట్ క్రష్ గురించి ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ఇక ఓ సీనియర్ హీరోయిన్ కూడా తన క్రష్ విక్టరీ వెంకటేష్ అంటోంది.
ఇండస్ట్రీలో స్టార్ హీరోల మీద కొంత మంది హీరోయిన్ల క్రష్ ఉండటం కామన్. తన ఫస్ట్ క్రష్ అతనే అని చాలమంది హీరోయిన్లు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు కూడా. ఈ తరం తారలైతే ఏమాత్రం మొహమాటం లేకుండా తమకు నచ్చిన హీరోల గురించి.. వారితో వన్ సైడ్ లవ్ గురించి వెల్లడిస్తుంటారు. ఈక్రమంలోనే ఓ సీనియర్ హీరోయిన్ కూడా విక్టరీ వెంకటేష్ పై తనకున్నక్రష్ గురించి వెల్లడించింది. కొన్ని ఆశ్చర్చకరమైన విషయాలు కూడా ఆమె షేర్ చేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు రాశి.
25
ఆరాధ్య నటుల గురించి
ఫిల్మ్ ఇండస్ట్రీలో నటీనటులకు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలు, వారి ఆరాధ్య నటుల గురించి బయటపడే విషయాలు అభిమానులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. తాజాగా ప్రముఖ సీనియర్ నటి, మాజీ హీరోయిన్ రాశి ఒక ఇంటర్వ్యూలో తనకు చిన్నతనంలో హీరోలపై, ప్రముఖ వ్యక్తులపై ఉన్న క్రష్ గురించి పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
35
రాశి చెప్పిన చిన్ననాటి కబుర్లు
అలీతో సరదాగా ప్రోగ్రమా్ లో పాల్గోన్న రాశి.. చిన్నతనం గురించి చాలా కబుర్లు పంచుకన్నారు. తాను చిన్నగున్నప్పుడు (సుమారు 6 నుండి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు) విక్టరీ వెంకటేష్ సినిమాలు బాగా చూసేవారట. ఆ సమయంలో చెన్నైలో ప్రివ్యూ షోలు ఒక పండుగలా జరిగేవని ఆమె గుర్తుచేసుకున్నారు. రాశి తాతగారు ప్రఖ్యాత డి సురేష్ బాబు/రామానాయుడు గారి బ్యానర్‌లో పనిచేయడం వల్ల కుటుంబసభ్యులకు ప్రత్యేక పాస్‌లు లభించేవి. ఆ కారణంగా వెంకటేష్ నటించిన సినిమాలను ఆమె తరచుగా ప్రివ్యూ షోలలో చూసేవారు. వెంకటేష్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన చూసి చిన్నతనంలోనే ఆయనకు రాశి పెద్ద అభిమానిగా మారిపోయారు .
ఇంటి దగ్గర ఎవరైనా సరదాగా "పెద్దయ్యాక ఎవరిని పెళ్లి చేసుకుంటావు?" అని అడిగితే, "నేను పెళ్లి అంటూ చేసుకుంటే ఒక్క వెంకటేష్ గారిని తప్ప ఇంకెవరినీ చేసుకోను" అని పట్టుపట్టేవారట . చిన్నతనంలో రాశికి వెంకటేష్‌పై ఉన్న ఆ అమాయకమైన అభిమానం ఒక సీజన్ పాటు బలంగా నడిచిందని ఆమె నవ్వుతూ వెల్లడించారు. ఆ తర్వాత పెద్దయ్యాక ఆయనతో జంటగా నటించే అవకాశం రాకపోయినా.. ఓ సాంగ్ కు డ్యాన్స్ చేసే అవకాశం మాత్రం వచ్చింది. శ్రీను' చిత్రంలో వెంకటేష్‌తో కలిసి ఓ మనాలి ఓ మనాలి పాటకు రాశీ డ్యాన్స్ చేసింది. అయితే చిన్ననాటి ఈ పెళ్లి మాటను ఆయనతో చెప్పలేకపోయానని ఆమె గుర్తు చేసుకున్నారు.
55
వెంకటేష్ తరువాత ఎవరు?
కేవలం వెంకటేష్ మాత్రమే కాకుండా, ఆ తర్వాత రోజుల్లో దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని చూసి కూడా ఆమె బాగా ఆకర్షితులయ్యారట. టీవీలు, దినపత్రికల్లో రాజీవ్ గాంధీ గారి ఫోటోలు చూసి ఆయన చాలా స్మార్ట్‌గా, గుడ్ లుకింగ్‌గా ఉన్నారని అనేవారట రాశి. ఆ వయసులో న్యూస్ చూస్తుంటే ఇంట్లోవాళ్లు ఆశ్చర్యపోగా, "నేను పెళ్లి చేసుకుంటే రాజీవ్ గాంధీని చేసుకుంటా" అని చెప్పేవారట. అలా వెంకటేష్ తర్వాత రాజీవ్ గాంధీపై కూడా కొంతకాలం క్రష్ నడిచిందని రాశి సరదాగా గుర్తుచేసుకున్నారు.