100 కోట్ల వ్యూస్ దిశ‌గా దూసుకెళ్తున్న తెలంగాణ ఫోక్ సాంగ్‌.. ఇంత‌లా ఈ పాట‌లో ఏముంద‌బ్బా?

Published : Nov 17, 2026, 02:48 PM IST

Folk Song: తెలంగాణ జానపద పాటలకు ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమైంది. ఎలాంటి భారీ బడ్జెట్, స్టార్ హీరోల అండ లేకుండానే ఓ ఫోక్ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన కొద్ది కాలంలోనే దాదాపు 96 కోట్ల వ్యూస్‌కు చేరువైంది.

PREV
15
యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్

తెలంగాణ పల్లె సంస్కృతి, జానపద సంగీతానికి ప్రేక్షకుల్లో ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో ‘రాను బొంబాయికి రాను’ పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. తాజాగా ఈ పాట 957,502,301 వ్యూస్ సాధించింది. అంటే దాదాపు 95.75 కోట్ల మంది ఈ పాటను వీక్షించారు. ఒక ప్రాంతీయ జానపద గీతానికి ఈ స్థాయిలో ఆదరణ లభించడం విశేషం. ముఖ్యంగా సినిమా పాటలకు పోటీగా ఫోక్ సాంగ్స్ కూడా భారీ వ్యూస్ సాధించగలవని ఈ పాట నిరూపిస్తోంది.

25
బుట్టబొమ్మ పాటను దాటేసిన ఫోక్ సాంగ్

అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ పాట దేశవ్యాప్తంగా ఎంతటి ప్రజాదరణ పొందిందో తెలిసిందే. 2020లో యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాట ఇప్పటివరకు సుమారు 95.5 కోట్ల వ్యూస్ సాధించింది. అయితే ‘రాను బొంబాయికి రాను’ పాట తాజాగా 95.75 కోట్ల మార్కును దాటడంతో బుట్టబొమ్మను అధిగమించింది. స్టార్ హీరో సినిమా పాటకు మించి ఓ తెలంగాణ జానపద గీతం వ్యూస్ సాధించడం ఇప్పుడు సంగీత ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. తక్కువ సమయంలోనే ఈ స్థాయికి చేరుకోవడం ఈ పాట ప్రత్యేకతగా నిలుస్తోంది.

35
పాట వెనుక ఉన్న కళాకారులు వీరే

ఈ పాటకు ప్రముఖ జానపద గాయకుడు రాము రాథోడ్ సాహిత్యం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. ఆయనతో కలిసి సింగర్ ప్రభ గొంతు కలిపారు. పాటలో రాము రాథోడ్‌తో పాటు లిఖిత నటించి తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కళ్యాణ్ కీస్ సంగీతం అందించగా, శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. పాటలోని సంగీతం, సాహిత్యం, నృత్యం ఒకదానికొకటి చక్కగా సరిపోవడంతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాయి. ముఖ్యంగా కళాకారుల సహజమైన ప్రదర్శన పాటకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది.

45
పల్లె యాస.. ఆకట్టుకునే బాణీ

‘అద్దాల మేడలున్నయే.. మేడల్లా మంచి చీరులన్నయే.. చీరంచూ రైకలున్నయే.. కొనిపిస్తా నాతో బొంబాయ్ రాయే.. రాను.. నే రాను.. బొంబాయికి రాను’ అంటూ సాగే ఈ పాటలో తెలంగాణ మాండలికం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సులభంగా అర్థమయ్యే పదాలు, వినగానే గుర్తుండిపోయే ట్యూన్, ఉత్సాహభరితమైన డ్యాన్స్ స్టెప్పులు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పెళ్లిళ్లు, పండగలు, జాతరలు, కాలేజీ వేడుకల్లో ఈ పాటకు ప్రత్యేక స్థానం లభించింది. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ వీడియోల రూపంలోనూ విస్తృతంగా ప్రచారం పొందింది. దీంతో తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల ప్రేక్షకులకు కూడా చేరువైంది.

55
త‌క్కువ బడ్జెట్‌తో భారీ విజయం

ఈ పాట విజయానికి సంబంధించి మ‌రో ఆసక్తికరమైన అంశం దాని నిర్మాణ వ్యయం. ‘రాను బొంబాయికి రాను’ పాట చిత్రీకరణకు సుమారు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. సాధారణ పల్లెటూరి వాతావరణంలో రూపొందించిన ఈ పాటకు భారీ సెట్లు, స్టార్ నటీనటులు అవసరం కాలేదు. ప్రతిభావంతులైన కళాకారులు, సహజమైన సంగీతం, ఆకట్టుకునే సాహిత్యంతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. డిజిటల్ వేదికలు ప్రాంతీయ కళలకు ఎంతటి అవకాశాలు కల్పిస్తున్నాయో ఈ విజయం మరోసారి చాటిచెబుతోంది. రానున్న రోజుల్లో ఈ పాట 100 కోట్ల వ్యూస్ సాధించ‌డం పెద్ద క‌ష్ట‌మేమి కాద‌ని అన‌డంలో సందేహం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories