బిగ్ బాస్ తెలుగు 9 షో 66 వ రోజుకి చేరుకుంది. ఇక బుధవారం ఎపిసోడ్‌లో చాలా వరకు ఫన్నీ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ హౌజ్‌ని రాజ్యంగా మార్చారు. రీతూ, దివ్య, కళ్యాణ్ రాజులు, రాణులుగా వ్యవహరిస్తుండగా, ఇమ్మాన్యుయెల్, గౌరవ్, సుమన్ శెట్టి, భరణి ప్రజలుగా, తనూజ, నిఖిల్, సంజనా, డీమాన్ పవన్ కమాండర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల చేత సేవలు చేయించుకుంటున్నారు రాజులు. అందులో భాగంగా చిరు నవ్వుతో డాన్స్ లు చేయించారు. ఇమ్మాన్యుయెల్ ముఠామేస్త్రి స్టెప్ వేశారు. అలాగే సుమన్ శెట్టితో వీణ స్టెప్ వేయించారు. భరణి, గౌరవ్‌లను కూడా ఒక రేంజ్‌లో ఆడుకున్నారు.