హీరోయిన్ ఈషా రెబ్బాని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో హీరో తరుణ్ భాస్కర్ స్పందించారు. త్వరలోనే ప్రకటించబోతున్నట్టు తెలిపారు. రెండేళ్లు ఆమెనే తన సర్వస్వం అని చెప్పాడు.
హీరోయిన్ ఈషా రెబ్బా, దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పటికే దీనిపై ఈషా రెబ్బా స్పందించింది. తాను ఒకరితో డేటింగ్‌లో ఉన్నట్టు చెప్పింది. పెళ్లి గురించే చూస్తున్నట్టు వెల్లడించింది. తరుణ్ భాస్కర్‌తో పెళ్లి వార్తలను ఆమె చెప్పకనే చెప్పేసింది. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు హింట్ ఇచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి.
25
ఈషా రెబ్బాతో పెళ్లిపై తరుణ్ భాస్కర్ కామెంట్
ఈ క్రమంలో ఇప్పుడు తరుణ్ భాస్కర్ స్పందించారు. ఈషా రెబ్బాతో పెళ్లి వార్తలు వస్తున్నాయి, దీనికి ఎండ్ కార్డ్ పెట్టే ఛాన్స్ ఉందా అనే ప్రశ్నకి తరుణ్ భాస్కర్ రియాక్ట్ అయ్యాడు. రైట్ టైమ్ కోసం వెయిట్ చేస్తున్నానని, ఈషా తనకు బెస్ట్ ఫ్రెండ్, ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్ కంటే ఎక్కువ అని, గత రెండేళ్లుగా ఆమెనే సర్వస్వం అయ్యిందని, దాంట్లో చెప్పడానికి, దాచడానికి ఏం లేదుగానీ, అనౌన్స్ చేయడానికి రైట్ టైమ్ కోసం వెయిట్ చేస్తున్నానని తెలిపారు.
35
ఈషాతో పెళ్లి త్వరలోనే ఎండ్ కార్డ్
`ఇది పర్సనల్ విషయం కాబట్టి, నేను ఏదైనా చెబితే అది వేరే వాళ్లని ఎఫెక్ట్ చేసే ఆస్కారం ఉంటుంది, ఈ విషయంలో కాలిక్యూలేటెడ్‌గా ముందడుగు వేయాలనుకుంటాను. నాది బర్రెతోలు, గట్టిగానే ఉంటుంది, కానీ వాళ్లపై ప్రభావం పడుతుందేమో అని ఆలోచిస్తున్నాను. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఎండ్ కార్డ్ వేస్తాం` అని తెలిపారు తరుణ్ భాస్కర్.
మొత్తంగా ఈషా రెబ్బాతో రిలేషన్ నిజమే అని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని తరుణ్ భాస్కర్ చెప్పకనే చెప్పారు. సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పారు. ఆయన చెబుతున్నదాన్ని బట్టి ఈ సమ్మర్‌లోనే ఈ ఇద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్లానింగ్ కూడా చేసుకుంటున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుందని సమాచారం.
55
ఓం శాంతి శాంతి శాంతిః చిత్రంతో రాబోతున్న తరుణ్, ఈషా రెబ్బా
ఇదిలా ఉంటే తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కలిసి ప్రస్తుతం `ఓం శాంతి శాంతి శాంతిః` అనే చిత్రంలో నటించారు. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈ నెల 30న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తరుణ్ భాస్కర్ తెలుగు 360తో మాట్లాడుతూ ఈషా రెబ్బాతో పెళ్లి మ్యాటర్‌పై ఓపెన్ అయ్యారు. అయితే గత రెండేళ్లుగా ఈ ఇద్దరు రిలేషన్‌లో ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా ఈషాని కావాలనే తరుణ్ తీసుకున్నాడట. మొదట అనుపమా పరమేశ్వరన్‌ని అనుకున్నప్పటికీ తరుణ్ పట్టుబట్టి ఈషాని ఎంపిక చేసినట్టు ఆ మధ్య నిర్మాత వెల్లడించారు. ఈ సినిమా జర్నీలో ఈ ఇద్దరి మధ్య రిలేషన్ మరింత బలపడిందని, ఇప్పుడు పెళ్లికి దారి తీస్తుందని సమాచారం.