
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన `దేవర 2` మూవీ రెండేళ్ల క్రితం ఆడియెన్స్ ముందుకు వచ్చి మెప్పించింది. మిశ్రమ స్పందన రాబట్టుకున్నా ఈ చిత్రం నార్త్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంది. అక్కడి నుంచి ఊహించని రెస్పాన్స్ పొందింది. ఈ క్రమంలో `దేవర 2`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అనూహ్యంగా ఈ మూవీపై చాలా రోజులుగా విభిన్నమైన వార్తలు వస్తున్నాయి. సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది.
`దేవర 2` మూవీ ఆగిపోయిందని ఇటీవల రూమర్స్ వినిపించాయి. ఎన్టీఆర్ నటించిన `వార్ 2` ఫెయిల్యూర్ కావడంతో `దేవర 2`పై తారక్ ఆసక్తిగా లేరని అన్నారు. ఇక ఈ మూవీని పక్కన పెట్టినట్టే అనుకున్నారు. `వార్ 2` డిజాస్టర్ కారణంగా తారక్ ఓ బాలీవుడ్ మూవీని పక్కన పెట్టారు. నెల్సన్ దిలీప్ కుమార్‌తో చేయాల్సిన మూవీని పక్కన పెట్టారని టాక్. చాలా ఫ్రెష్‌గా వెళ్లబోతున్నారనే వార్తలు వినిపించాయి. అందులో భాగంగా `దేవర 2` కూడా ఆగిపోయిందని అనుకున్నారు.
కానీ `దేవర 2`కి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు నిర్మాత మిక్కిలినేని సుధాకర్. ఆయన ఇటీవల జనగాంలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొని `దేవర 2` ఉండబోతుందని చెప్పారు. మేలో సినిమా స్టార్ట్ అవుతుందని వెల్లడించారు. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ అవుతుందని, `దేవర 2` పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని పేర్కొన్నారు. దీంతో ఈ వార్త ఇప్పుడు తారక్ అభిమానులకు హ్యాపీ చేస్తుంది. దీన్ని వారంతా వైరల్ చేస్తున్నారు. మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటున్నారు. అంతేకాదు పెద్ద హీరోకి సమాధానం చెప్పే రోజులు వచ్చాయని కామెంట్ చేస్తున్నారు.
దర్శకుడు కొరటాల శివపై మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య` సమయంలో పరోక్షంగా పలు విమర్శలు చేశారు. దర్శకులు ఎలా సినిమా తీయాలి, ఎలా ఉండాలనేది తెలిపారు. అది కొరటాల శివనే అని అంతా భావించారు. అలానే ప్రచారం జరిగింది. బాగా ట్రోల్ నడిచింది. `వాల్తేర్ వీరయ్య` సమయంలో చిరు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత `దేవర`తో హిట్ కొట్టాడు కొరటాల శివ. కానీ మళ్లీ ఇటీవల కాలంలో కొరటాలకి పరోక్షంగా విమర్శలు తగులుతూనే ఉన్నాయి. పైగా `దేవర 2` ఆగిపోయిందనే వార్తలతో మరింతగా విమర్శలు వచ్చాయి. వస్తున్నాయి. ఈ నేపథ్యంలో `దేవర 2` ఉండబోతుందని నిర్మాత క్లారిటీ ఇవ్వడం, పైగా బ్లాక్ బస్టర్ పక్కా అని చెప్పడంతో ఇప్పుడు మళ్లీ కొరటాల టైమ్ స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. అదే సమయంలో మెగాస్టార్‌కి సమాధానం చెప్పే టైమ్ కూడా వచ్చిందని ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ అవకాశాన్ని కొరటాల ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 2024లో రూపొందిన `దేవర` మూవీ దాదాపు రూ.450కోట్ల వరకు వసూలు చేసింది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్ చేశారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, శ్రుతి మరాఠే వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ పతాకాలపై కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మించారు.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `డ్రాగన్` చిత్రంలో నటిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.