`కాంత` మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌, ప్లాట్‌ఫామ్‌.. థియేటర్లో డిజాస్టర్, మరి ఓటీటీలో ఆడుతుందా?

Published : Nov 20, 2025, 05:59 PM IST

దుల్కర్‌ సల్మాన్‌, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన `కాంత` మూవీ థియేటర్లలో పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్ అయినట్టు సమాచారం. 

PREV
14
`కాంత`తో ఆడియెన్స్ ముందుకొచ్చిన దుల్కర్‌ సల్మాన్‌

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్ ఇప్పుడు తెలుగు హీరో అయ్యాడు. ఆయన వరుసగా తెలుగు మూవీస్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. తెలుగులోనే కాదు, తమిళంలోనూ మూవీస్‌ చేస్తూ హీరోగా రాణిస్తున్నారు. చాలా వరకు పాన్‌ ఇండియా చిత్రాలతో మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన `కాంత` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, రానా, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషించారు.

24
బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసిన `కాంత`

తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని `కాంత` పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ నెల 14న విడుదలైంది. ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. 1950 బ్యాక్‌ డ్రాప్‌లో అప్పటి కోలీవుడ్‌ హీరో, దర్శకుడికి మధ్య జరిగిన ఈగో సమస్య నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ మూవీ కమర్షియల్‌గా సత్తా చాటలేకపోయింది. దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.

34
`కాంత` కలెక్షన్లు

అయితే నటీనటులు పర్‌ఫెర్మెన్స్ పరంగా ప్రశంసలందుకున్నారు. దుల్కర్‌ సల్మాన్‌ తన నటనతో విశ్వరూపం చూపించారు. మహదేవన్‌ పాత్రలో ఇరగదీశారు. అంతేకాదు ఇందులో హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ బోర్సే నటన కూడా మెప్పిస్తుంది. ఆమె నటన ఆడియెన్స్ కి సర్‌ప్రైజ్‌ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రం విడుదలై వారం రోజులు అవుతుంది. దాదాపు రూ.20కోట్ల వరకు వసూళ్లని రాబట్టింది. కేవలం 40-50శాతం మాత్రమే రికవరీ చేయగలిగిందని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. దీంతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

44
`కాంత` ఓటీటీ రిలీజ్‌ డేట్‌?

దుల్కర్‌ సల్మాన్‌ నటించిన `కాంత` మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను నెట్‌ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు అన్ని సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే `కాంత` కూడా నెలలోపే ఓటీటీలోకి రాబోతుందని, డిసెంబర్‌ 12న నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కాబోతుందని సమాచారం. థియేటర్లలో సత్తా చాటని ఈ మూవీ ఓటీటీలో ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా అనేది చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories