ఓ క్రేజీ డైరెక్టర్ ని చిరంజీవి తక్కువగా అంచనా వేశారు. ఫలితంగా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఆ దర్శకుడు అద్భుతమైన కథ చెప్పినప్పటికీ చిరంజీవి రిజెక్ట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి కథల ఎంపిక చాలా బావుంటుంది. ఆయన జడ్జిమెంట్ ఫెయిల్ అయిన సందర్భాలు తక్కువ. మంచి కథ దొరికినా, ప్రతిభావంతుడైన దర్శకుడు, టెక్నీషియన్స్ ఎవరు కనిపించినా చిరంజీవి వదలరు. వారిని ప్రోత్సాహిస్తారు. అయితే చిరంజీవి ఓ అగ్ర దర్శకుడిని మాత్రం తక్కువగా అంచనా వేశారు. తన చుట్టూ ఉన్న వారి ప్రభావం వల్ల ఆ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా చేయడం కుదర్లేదు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
25
టాలీవుడ్ లో క్లీన్ డైరెక్టర్
టాలీవుడ్ లో మిస్టర్ క్లీన్ డైరెక్టర్ అంటే ముందుగా చెప్పేది ఎస్వీ కృష్ణారెడ్డి గురించే. ఆయన వివాదాలకు దూరంగా ఉండే దర్శకుడు. అదే విధంగా ఆయన సినిమాలు కూడా చాలా క్లీన్ గా ఉంటాయి. ఆయన చిత్రాల్లో అశ్లీలత, అసభ్యతకు తావు ఉండదు. ఎమోషనల్ చిత్రాలు, కడుపుబ్బా నవ్వించే చిత్రాలని ఎస్వీ కృష్ణారెడ్డి ఎక్కువగా తెరకెక్కించారు.
35
ఎస్వీ కృష్ణారెడ్డిపై చిరంజీవి అనుమానం
సూపర్ స్టార్ కృష్ణతో ఎస్వీ కృష్ణారెడ్డి నెంబర్ వన్ అనే బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించారు. కృష్ణారెడ్డి చిరంజీవితో సినిమా చేయాలని ప్రత్నించారు. ఈ విషయాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చిరంజీవి గారికి అద్భుతమైన కథ చెప్పాను. చిరంజీవి గారికి కూడా కథ నచ్చింది. కానీ ఆయన ఇంత అడ్వాన్స్డ్ కథని మనం చేయగలమా ? అనే సందేహం వ్యక్తం చేశారు. చేయాలి సార్.. మన కాంబినేషన్ అంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. కొత్తగా చేయాలి అని చిరంజీవి సమాధానం ఇచ్చినట్లు కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
ఆయన ఆలోచించి చెబుతా అని అన్నారు. ఇంతలో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎస్వీ కృష్ణారెడ్డి.. పెద్ద హీరోలతో సినిమా చేయలేరు అని చెప్పారట. అందువల్ల చిరంజీవితో తన చిత్రం ఆగిపోయింది అని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. స్టార్ హీరోలతో సినిమా చేయలేనని ఎందుకు ఇండస్ట్రీలో అనుకున్నారో నాకు తెలియదు. బాలకృష్ణ గారు ఒకే ఒక్క సీన్ విని నాతో సినిమా చేశారు.
55
ఆశ్చర్యపోయిన సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ అయితే నా దర్శకత్వ శైలి చూసి ఆశ్చర్యపోయారు. స్క్రిప్ట్ పేపర్ కూడా చూసేవాడిని కాదు. ఏంటయ్యా అంత కాన్ఫిడెన్స్ అని కృష్ణ తనని అడిగినట్లు కృష్ణారెడ్డి పేర్కొన్నారు. బాలకృష్ణ, కృష్ణారెడ్డి కాంబినేషన్ లో టాప్ హీరో అనే మూవీ వచ్చింది.