ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియా వైడ్‌గా మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాని విడుదల చేస్తుంది. అక్టోబర్ నెలకు సంబంధించిన లిస్ట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ దెబ్బకి బాలీవుడ్ హీరోలు పరార్.
ఇండియా వైడ్‌గా టాప్ 10 హీరోల జాబితాని ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల విడుదల చేస్తుంది. తాజాగా అక్టోబర్ నెలకు సంబంధించి లిస్ట్ వచ్చింది. ఇందులో ఎప్పటిలాగానే ప్రభాస్ టాప్‌లో ఉన్నారు. ఆయన ప్రతి నెల నెంబర్ 1గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇమేజ్ పరంగా, క్రేజ్ పరంగా, మార్కెట్ పరంగా, సోషల్ మీడియాలో డిస్కషన్‌కి సంబంధించి ప్రభాస్‌కి తిరుగులేదని చెప్పొచ్చు. ఇక రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ఉన్నారు. ఆయన స్థానం కూడా పదిలంగా ఉంటుంది.
26
మూడో స్థానంలో అల్లు అర్జున్
మూడో స్థానంలో ఐకాన్ స్టార్ అ్లలు అర్జున్ నిలిచారు. ఆయన తరచూ మూడు, నాలుగు స్థానాల్లో ఉంటున్నారు. ఇప్పుడు కంటిన్యూగా మూడో స్థానంలో నిలుస్తున్నారు. `పుష్ప2` తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు అట్లీతో ఇంటర్నేషన్ మూవీ చేస్తున్నారు. దీంతో బన్నీకి సంబంధించిన చర్చ కూడా జరుగుతూనే ఉంది. ఆయన కూడా టాప్ లో ఉంటున్నారు. ఇక నాల్గో స్థానంలో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ ఉన్నారు. గతంలో మూడో స్థానంలో ఉన్న ఆయన ఈ సారి నాల్గో స్థానానికి పరిమితమయ్యారు. ఐదో స్థానంలో అజిత్ ఉన్నారు. కోలీవుడ్ నుంచి విజయ్, అజిత్ మాత్రమే ఈ లిస్ట్ లో ఉంటున్నారు. అజిత్ కూడా ఐదో స్థానానికి ఫిక్స్ అయ్యారు.
36
ఆరో స్థానంలో నిలిచిన ఎన్టీఆర్
ఆరో స్థానంలో ఎన్టీఆర్ ఉన్నారు. తారక్ స్థానం నెల నెల మారుతుంటుంది. టాప్ 6 నుంచి టాప్ 10 వరకు మధ్యలో ఏదైనా ఉంటుంది. ఆయన సినిమాలకు సంబంధించిన చర్చను బట్టి అది ఉంటుంది. అయితే ఇటీవల చాలా వరకు ఆరు, ఏడు స్థానాల్లో ఉంటున్నారు. కానీ అక్టోబర్‌లో మాత్రం ఆరో స్థానంలో నిలవడం విశేషం. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్‌తో `డ్రాగన్` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది. అందుకే తారక్ తన స్థానం పెంచుకున్నారు.
ఏడో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ ఉండటం విశేషం. ఆయన ప్లేస్ కూడా ఆరు, ఏడు, ఎనిమిది మధ్య తిరుగుతుంటుంది. ఇప్పుడు కూడా తన ప్లేస్‌ని ఫిక్స్ చేసుకున్నారు. ఏడో స్థానంలో ఫిక్స్ అయ్యారు. ఇక నవంబర్‌లో మాత్రం ఆయన స్థానం పెరిగిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళితో `వారణాసి` చిత్రంలో చేస్తున్నారు. దీని ట్రైలర్ వచ్చింది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. దీంతో ఆయన స్థానం పెరిగే అవకాశం ఉంది.
56
ఎనిమిదో స్థానంలో రామ్ చరణ్
ఇక ఎనిమిదో స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు. అక్టోబర్ లో ఆయన 8వ స్థానంలో ఉండటం విశేషం. ఆయన స్థానం అటు ఇటుగా అంతే ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం రామ్ చరణ్.. `పెద్ది` చిత్రంలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన చర్చ జరుగుతుంది. వరుసగా అప్ డేట్లు వస్తున్నాయి. దీంతో వచ్చే నెల రామ్ చరణ్ స్థానం పెరిగే అవకాశం ఉంది.
66
టాప్ 10 లిస్ట్ లోకి పవన్ కళ్యాణ్
అక్టోబర్‌లో పవర్ స్టార్ పవన్ టాప్ 10 లిస్ట్ లోకి రావడం విశేషం. ఆయన `హరి హర వీరమల్లు` సమయంలో టాప్‌లోకి వచ్చారు. మళ్లీ ఇప్పుడు వచ్చారు. ఆయన హీరోగా నటించిన `ఓజీ` మూవీ సెప్టెంబర్ చివర్లో విడుదలయ్యింది. దాని ప్రభావం అక్టోబర్ నెల మొత్తం ఉంది. దీంతో పవన్ ఈ జాబితాలోకి వచ్చారు. ఆయన తొమ్మిదో స్థానంలో ఉండటం విశేషం. ఇక పదో స్థానంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఉన్నారు. పవన్ దెబ్బకి బాలీవుడ్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించలేకపోవడం గమనార్హం.