అప్పట్లో పాత తరం హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కొంత మంది చాలా పొగరుగా ఉండేవారు. నడమంత్రపు సిరి వచ్చేవరకు కన్ను మిన్ను కానక కొన్ని పనులు చేసేవారు. ఆతరువాత వారు తమ తప్పులకు శిక్షలు కూడా అనుభవించారు. కొంత మంది అయితే తిండికి కూడా లేకుండా ఇబ్బందిపడిన వారు ఉన్నారు. ఈక్రమంలో నటి గురించి డబ్బింగ్ జానకి చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
రీసెంట్ గా డబ్బింగ్ జానకిని ఓ యూట్యూబ్ ఛానెల్ వారు ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో రకరకాల విషయాలను ఆమె శేర్ చేసుకున్నారు. ఆ కాలంలో నటీనటుల బిహేవియర్ ఎలా ఉండేది. ఎవరు ఎక్కువగా యాటిట్యూడ్ చూపించేవారు. ఎవరు ఎక్కువగా స్ట్రిక్ట్ గా ఉండేవారు అనే విషయాలను ఆమె వెల్లడించారు.
యాంకర్ ప్రశ్నిస్తూ.. ఓ విషయాన్ని అడిగారు.. మీ ముందే ఓ హీరోయిన్ తింటున్న ప్లేట్ ను కాలితో తన్నిందట కదా అని యాంకర్అడిగారు. దానికి సమాధానం ఇస్తూ.. డబ్బింగ్ జానకి ఆ విషయాన్ని వెల్లడించారు. ఆమె హీరోయిన్ కాదని.. ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని వెల్లడించారు. ఇప్పటికీ ఆమె ఇండస్ట్రీలోనే ఉన్నారన్నారు.
అయితే ఆమె మాత్రం నైట్ పేకాట ఆడుతూ..మందు తాగుతూ.. చాలా లేట్ గా రూమ్ కు వచ్చేవారట. అయితే తనకు ఆకలేసి ముందుగానే తినేసి.. క్యారియర్ ను మళ్ళి సెట్ చేసి..పడుకున్నారట. అప్పుడు అర్ధరాత్రి వచ్చిన ఆ నటి.. ప్కనే ఉన్న అసిస్టెంట్ తో ఈ విధంగా అన్నారట. ఆమె తినేసి పడుకుందా..? ఆమె తినగా మిగిలిన ఫుడ్ నేను తినాలా..? అంటూ క్యారేజ్ ను ప్లేట్స్ ను కాలితో తన్నిందట.
అప్పుడు ఆ అన్నం కూరలు మొత్తం గది నిండా చెల్లా చెదురుగా పడిపోయాయట. ఇంతకీ ఆ నటి ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా.. చెప్పను.. ప్లీజ్ అడగొద్దు అన్నారు డబ్బింగ్ జానకి. ఆమె తెలుగు నటే.. ఇప్పటికీ బ్రతికే ఉంది. ఇండస్ట్రీలో అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తుంది అన్నారు ఆమె. దాంతో ఆమె ఎవరా అని ఆడియన్స్ ఆలోచించడం మొదలు పెట్టారు.
ఇక మరికొం తమంది మాత్రం ఆమె రమ ప్రభ అయి ఉండవచ్చు అని కామెంట్లు చేస్తున్నారు. ఇక డబ్బింగ్ జానకి.. దాదాపు 40 ఏళ్ళఖు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తెలుగు,తమిళ భాషల్లో ఆమె సినిమాలు చేశారు. అంతే కాదు హైదరాబాద్ కు పరిశ్రమ వచ్చినా.. ఆమె చెన్నైలోనే ప్యామిలీతో ఉండిపోయారు.
ప్రస్తుతం హైదరాబద్ లో ఆమె ఒక్కరే చిన్నరూమ్ లో ఉంటూ.. సినిమాలు చేస్తున్నారు. 75 ఏళ్ళ వయస్సులో కూడా ఆమె ఇంకా యాక్టీవ్ గానే ఉన్నారు. ప్రస్తుతం సినిమాలు సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. కొన్ని టీవీ షోలు.. యూట్యూబ్ వీడియోస్ కూడా చేస్తున్నారు డబ్బింగ్ జానకి.