సావిత్రి మెడలో పూలదండ వేలం వేస్తే.. అంత డబ్బు వచ్చిందా..? జమున చెప్పిన నిజాలు..

First Published | Sep 26, 2024, 5:15 PM IST

మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు జాతికి కీర్తి తెచ్చిన నటి. మంచి తనానికి మారు రూపం.. అటువంటి సావిత్రి క్రేజ్ కు సబంధించన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. 

మహానటి సావిత్రి.. తెలుగు సినీపరిశ్రమకు కీర్తి కిరీటం లాంటివారు. తెలుగు వారు మాత్రమే కాదు.. తమిళులు కూడా ప్రేమించి, ఆరాధించే నటీమణి సావిత్రి. వ్యక్తిగత జీవితంలో మరీ ముఖ్యంగా వివాహ జీవితంలో ఆమె ఎన్ని కష్టాలు పడినా.. సినిమా జీవితంలో  మాత్రం మకుటంలేని మహారాణిలా వెలుగు వెలిగారు సావిత్రి. 

ఆమె మంచి నటిమాత్రమే కాదు.. మంచి మనసున్న గొప్ప వ్యక్తి. ఎంతోమంది పాలిట దేవత సావిత్రి. కాని ఎవరు ఆమెపై కృతజ్ఞత చూపించలేకపోయారు. మరీ ఎవరు అడిగినా.. కాదనలేకుండా సాయం చేసే గుణం సావిత్రిది.

అంతే కాదు ఆమె విపత్తు నిథి కోసం.. 1965లో ఢిల్లీలో తన ఒంటిపై ఉన్న నగలన్నింటిని అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చి తన గొప్ప మనసుని చాటుకుంది. తనతో పాటు తన కూతురు ఒంటిపై ఉన్నవి కూడా తీసి ఇచ్చారట సావిత్ని. అంత రాణిలా బ్రతికిన ఆమె..  

తన చివరి రోజుల్లో మాత్రం ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఫేస్ చేసి... ఎవరూ లేని అనాధలా.. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ..  ఒంటరిగా 1981 డిసెంబర్ 26న కోమాలోకి వెళ్ళి కొన్నేళ్లు కోమాలోనే ఉండి.. ఆతరువాత మరణించింది. 


Mahanati Savitri Rare Photos

ఇక సావిత్రి దానగుణం గురించి.. ఆమె క్రేజ్ గురించి ఓ సందర్భంలో.. హీరోయిన్ జమునతో పాటు.. మరికొంత మది అప్పటి తరం నటీనటులు మాట్లాడుకోవడం ప్రముఖంగా చూడొచ్చు. ఓ సందర్భంలో ప్రభుత్వం విపత్తు నిథికి సినిమా వాళ్ల నుంచి విరాళాలు సేకరిస్తున్నారట.

అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రీవి నరసింహారావుగారు ఉన్నారట. అయితే ఆ సమయంలో సినిమా వాళ్లు పెద్దగా స్పందించలేదట.

అయితే అప్పుడు పీవి నరసింహారావుగారు సావిత్రి కోసం వేసిన పూల దండను.. వారు వేలానికి పెడితే.. దాదాపు గా 30 వేలకు పైగా పలికిందట. అప్పట్లోనే 30 వేలు అంటే... ఇప్పుడు 30 లక్షలకు పైనే అనుకోవచ్చేమో.. అంతకంటే  ఎక్కువే ఉండవచ్చు కూడా..? 

Mahanati Savitri Rare Photos

ఆమె క్రేజ్ అంతలా ఉండేదట. అంతే కాదు ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చే విషయంలో కూడా వేలకు వేలు అలా తీసి ఇచ్చేవారట సావిత్రి. అంతే కాదు ఆమె ఇంటి ఖర్చుక కూడా అప్పట్లోనే నెలకు 50 వేల వరకూ ఉండేంటే అర్ధం చేసుకోవచ్చు.. సావిత్రి ఎంత గొప్పగా బ్రతికిందో. ఇక ఆమె కోసం నగలు చేయడానికి సపరేట్ గా ఇంట్లోనే కౌంసాలి ఉండేవాడంటే ఆశ్చర్యం కలగక మానదు. 

పెళ్ళిచేసి చూడు` సినిమాతో నటిగా  మంచి గుర్తింపు తెచ్చుకున్న సావిత్రి.. ఈ సినిమాలో ఆమె చేసింది సెకండ్ హీరోయిన్ పాత్ర మాత్రమే. ఇక  1953 సంవత్సరం ఆమె జీవితాన్ని మరో మలుపుతిప్పింది. ఉర్రూతలూగించిన `దేవదాసు` సినిమాలో పార్వతి పాత్రకు ఎన్నికైంది సావిత్రి. అది కూడా అనుకోకుండా వచ్చిన అవకాశం. మొదట షావుకారు జానకిని తీసుకుంటే ఏవో ఇబ్బందలవల్ల ఆమె తప్పుకోవడంతో ఆ అవకాశం సావిత్రికి దక్కింది.

Savitri

సావిత్రి 30 ఏళ్ల సినీ కెరీర్‌లో 252 సినిమాల్లో నటించారు. 1950-60లలో ఆమె ఇండియాలో ఎక్కువ ఆదరణ కలిగిన నటిగా కీర్తించబడ్డారు. ఇదిలా ఉంటే  సావిత్రి జీవితకథను `మహానటి` చిత్ర రూపంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందించారు. ఇది భారీ ఆదరణ పొందింది. ఇందులో సావిత్రిగా నటించిన కీర్తిసురేష్‌కి జాతీయ అవార్డు రావడం విశేషం

సావిత్రి వైవాహిక జీవితంలో ఓడిపోయారు. ఆమె జెమినీ గణేష్‌ ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నారు. ఆయన సావిత్రిని మోసం చేశాడనే విషయం తెలిసిందే. నా అనుకున్న వారంతా మోసం చేశారు. మరోవైపు సినిమాలు నిర్మించి నష్టపోయారు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారు.

Latest Videos

click me!