Stree 2, OTT, Shraddha Kapoor, Rajkummar Rao
బాలీవుడ్ స్టార్స్ శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor), రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao) జంటగా నటించిన రీసెంట్ మూవీ ‘స్త్రీ 2’ (Stree 2). కామెడీ హారర్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఏ స్దాయి సక్సెస్ సాధించిందో తెలిసిందే. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో సక్సెస్ ని సొంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో ‘స్త్రీ 2’ఓటిటి లో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఓటిటిలో రిలీజైంది. ఆ వివరాలు చూద్దాం.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
ఈ సినిమా ఇదే దర్శకుడు అమర్ కౌశిక్ అందించిన ‘స్త్రీ’కు సీక్వెల్. 2018లో విడుదలైన ఈ సూపర్ నేచురల్ కామెడీ, హారర్ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్‌రావు నటన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. తమ గ్రామాన్ని పట్టిపీడిస్తున్న దెయ్యాన్ని పట్టుకోవడం కోసం వాళ్లు చేసే ప్రయత్నాలు జనాలకు తెగ నచ్చేసింది. అప్పట్లో సుమారు రూ.25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.181 కోట్లు వసూళ్లు రాబట్టడం విశేషం. దాంతో ఇప్పుడు ‘స్త్రీ 2’ని రెడీ చేసి వదిలితే అదీ పెద్ద హిట్టైంది.
ఇక ‘స్త్రీ2’ (Stree2) ఓటీటీ విషయానికి వస్తే... అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి రెంట్ బేసిస్ మీద (రూ.349) ఇది అందుబాటులోకి వచ్చింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సుమారు రూ.500 కోట్లకు పైగా వసూలు చేసి బాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.
చిత్రం కథేంటి
చందేరీ గ్రామంలో ‘స్త్రీ’ సమస్య తొలగిందని అందరూ ఊపిరి పీల్చుకునేలోగా ‘సర్కట’తో కొత్త సమస్య మొదలవుతుంది. గ్రామంలో మోడ్రన్‌గా ఉండే అమ్మాయిలను ఇబ్బందులు పెడుతుంటాడు సర్కట. ఈ సమస్యను విక్కీ (రాజ్ కుమార్ రావ్), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన (అభిషేక్ బెనర్జీ), బిట్టు (అపర్ శక్తి )తోపాటు శ్రద్ధా కపూర్ ఎలా ఎదుర్కొంటారు? అన్న కథాంశంతో తెరకెక్కిన ‘స్త్రీ 2’ మంచి ఫన్, హారర్ తో అదరకొట్టింది .
‘స్త్రీ 2’ రిలీజ్ అయ్యాక.. మూవీ మేకింగ్ గురించి సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ‘స్త్రీ’ మాదిరిగానే ‘స్త్రీ 2’ కూడా మంచి ఫన్ అందించిందని మూవీ లవర్స్ అభిప్రాయపడ్డారు. శ్రద్ధాకపూర్ - రాజ్‌కుమార్‌రావు జోడీ మరోసారి హిట్ అయ్యిందని కామెంట్స్ చేశారు.
ఆగస్టు 15న విడుదలైన పలు స్టార్ హీరోల చిత్రాలు ‘వేదా’ (జాన్ అబ్రహం), ఖేల్ ఖేల్ మే (అక్షయ్‌కుమార్)కు ఇది గట్టి పోటీ ఇచ్చింది. శ్రద్ధాకపూర్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలవడం విశేషం. ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో ‘కల్కి 2898 ఏడీ’ తొలి స్థానంలో ఉండగా.. ‘స్త్రీ 2’ రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది.