గేమ్ ఛేంజర్ ప్లాప్ తరువాత, మరో స్టార్ వారసుడితో శంకర్ సినిమా?

Published : Feb 12, 2025, 08:13 PM IST

మెగా వారసుడు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెెక్కించిన శంకర్.. ఈసినిమా డిజాస్టర్ అవ్వడంతో మరో షాకింగ్ కాంబోతో రాబోతున్నాడట. మరో స్టార్ హీరో వారసుడితో సినిమా చేయబోతున్నాడట. నిజమెం. 

PREV
16
గేమ్ ఛేంజర్ ప్లాప్ తరువాత, మరో స్టార్ వారసుడితో  శంకర్ సినిమా?
దర్శకుడు శంకర్:

గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయినా కూడా మరో వారసుడితో సినిమాకు రెడీ అయ్యాడు శంకర్.  సినిమా రంగంలో ఓటములకు బెదరని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శంకర్. 1993లో అర్జున్ హీరోగా నటించిన "జెంటిల్ మేన్" సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన శంకర్, ఆ తర్వాత కమల్ హాసన్ తో  ఇండియన్, అర్జున్ తో ఒకే ఒక్కడు, రజినీకాంత్ తో రోబో, 2.0, ఇలా సూపర్ హిట్ సినిమాలు చేశాడు శంకర్. 

Also Read: ఉదయ్ కిరణ్ తో పాటు ఈ హిట్ సాంగ్ లో నటించిన నలుగురు స్టార్స్ ఎలా మరణించారు?

26
ఇండియన్ 2, గేమ్ ఛేంజర్:

గత కొంత కాలంగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన  సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. రజినీకాంత్ రోబో తరువాత శంకర్ సినిమాలన్నీ ప్లాప్అయ్యాయి. ఇక గత రెండేళ్ళలో  ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి.  గతేడాది కమల్ హాసన్ తో "ఇండియన్ 2" సినిమా పరాజయం పాలైంది. చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాలో శంకర్ టచ్ మిస్ అయ్యిందని విమర్శించారు.

Also Read: సుమన్ ను బ్లూ ఫిలిం కేసులో ఇరికించిన ముఖ్యమంత్రి ఎవరు? అందులో చిరంజీవి పాత్ర ఏమిటి?

 

36
పెద్ద డిజాస్టర్:

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన "గేమ్ ఛేంజర్" సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, రామ్ చరణ్ కెరీర్ లో పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. శంకర్ ఈసినిమాపై సరిగ్గా  దృష్టి పెట్టలేదని విమర్శలు కూడా వచ్చాయి.  ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించిన "ఇండియన్ 3" ఈ ఏడాది విడుదల కానుంది.

Also Read:శోభన్ బాబు, జయలలిత కి పిల్లలు పుట్టారా, వాళ్ళని సీక్రెట్ గా పెంచారా, ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారు?

46
ఇండియన్ 3:

ఈ సినిమా షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక శంకర్ తన నెక్ట్స్ మూవీ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. శంకర్ రామ్ చరణ్ మాదిరి మరో వారసుడితో సినిమా చేయబోతున్నాడట.  శంకర్ తదుపరి చిత్రంలో విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించనున్నారట.

Also Read: నాగచైతన్య బాగా నచ్చిన నాగార్జున రెండు సినిమాలు, సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్న అక్కినేని యంగ్ హీరో

 

56
ధ్రువ్ విక్రమ్

ధ్రువ్ విక్రమ్ ని స్టార్ హీరోగా చూడాలని ఉంది విక్రమ్ కి. బాలా దర్శకత్వంలో "వర్మ" సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత ఈ సినిమాని రీమేక్ చేసినా, తెలుగులో "అర్జున్ రెడ్డి మాదిరిగా విజయం సాధించలేకపోయింది.

66
మారీ సెల్వరాజ్ "పైసన్":

ప్రస్తుతం మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో "పైసన్" సినిమాలో నటిస్తున్నారు ధ్రువ్. ఈ సినిమా తర్వాత ధ్రువ్ తో శంకర్ కొత్త సినిమా చేయనున్నారట. ఈ సినిమాని మీడియం బడ్జెట్ లో తెరకెక్కించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే విక్రమ్ తో శంకర్ "ఐ", "అపరిచితుడు" వంటి సినిమాలు చేసి విజయం అందుకున్నారు. మరి ధ్రువ్ కి కూడా శంకర్ విజయాన్ని అందిస్తారా? చూడాలి.


 

Read more Photos on
click me!

Recommended Stories