గ్యాంగ్ లీడర్ సీక్వెల్ ఆ ఇద్దరు హీరోలు మాత్రమే చేయగలరు, చిరంజీవి చెప్పిన ఆ స్టార్స్ ఎవరు..?

Published : Feb 12, 2025, 07:29 PM IST

Gang Leader Sequel : 90స్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా గ్యాంగ్ లీడర్ ను ఇప్పటి హీరోలలో ఎవరు పర్ఫెక్ట్ గా సీక్వెల్  చేయగలరు. ఆసినిమాలో మెగాస్టార్ ఇమేజ్ ను సీక్వెల్ లో ఎవరు క్యారీ చేయగలరు. ఈ విషయంలో మెగాస్టార్ చెప్పిన ఆ ఇద్దరు హీరోలు ఎవరు..? 

PREV
15
గ్యాంగ్ లీడర్ సీక్వెల్ ఆ ఇద్దరు హీరోలు మాత్రమే చేయగలరు, చిరంజీవి చెప్పిన ఆ స్టార్స్ ఎవరు..?
గ్యాంగ్ లీడర్ - 1991

Gang Leader Sequel : మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో బ్లాక్ బస్టర్ సినిమాలు చాలా ఉన్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నలిచిపోయే సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అప్పటి యూత్ నుఇప్పటి యూత్ ను కూడా ఉత్తేజపరిచే మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో గ్యాంగ్ లీర్ మూవీ ఒకటి. 

Also Read: సుమన్ ను బ్లూ ఫిలిం కేసులో ఇరికించిన ముఖ్యమంత్రి ఎవరు? అందులో చిరంజీవి పాత్ర ఏమిటి?
 

25

ఈసినిమాలో అగ్నికణంలా మండుతున్న మెగాస్టార్ ను చూసి ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోయారు. విజయ బాపినీడు డైరెక్షన్ లో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమా ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించింది. యూత్ స్టైల్స్ మారిపోయాయి.

మెగాస్టార్ స్టెప్పులకు యూత్ కు మైకం కమ్మింది. ఆయనలా డాన్స్ వేయాలని ఎంతో మంది ట్రై చేశారు. గ్యాంగ్ లీడర్ చూసి చాలామంది ఇండస్ట్రీకి వచ్చారు. అంతే కాదు ఈ సినిమాలో పాటన్నీ సూపర్ హిట్. ఎక్కడ చూసినా అవేమోగేవి. ఇప్పటికీ గ్యాంగ్ లీడర్ పాటలు అంటే యూత్ పడి చచ్చిపోతారు. 

Also Read: నాగచైతన్య బాగా నచ్చిన నాగార్జున రెండు సినిమాలు, సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్న అక్కినేని యంగ్ హీరో

35

బప్పీలహరి.. ఈసినిమాకు సంగీతం ఎలా ఇచ్చారో తెలియదు కాని.. ఇంకో వందేళ్లు అయినా.. ఈపాటలుబోరు కొట్టవు. ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా గ్యాంగ్ లీడర్ అల్టిమేట్. అయితే ఈసినిమాను సీక్వెల్ చేయాలి అంటే యంగ్ హీరోలు భయపడుతున్నారు. గ్యాంగ్ లీడర్ కు ఉన్న ఇమేజ్ ను కరెక్ట్ గాక్యారీ చేయగలమా అని అటు హీరోలు, ఇటు దర్శకులు కూడా భయపడుతున్నారు. 

Also Read:నిజంగా శోభన్ బాబు, జయలలిత కి పిల్లలు పుట్టారా, వాళ్ళని సీక్రెట్ గా పెంచారా, ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారు?

45

ఆకరికి మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, ఏకంగా చిరంజీవి కూడా ఈ సినిమాను కదిలించడానికి ఆలోచిస్తున్నారు. అయితే ఈక్రమంలో ఈసినిమాను సీక్వెల్ చేయాలి అంటే ఇద్దరికే సాధ్యం అని మెగాస్టార్ చిరంజీవి సన్నిహితుల దగ్గర అన్నట్టుగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరు. గ్యాంగ్ లీడర్ సినిమాను సీక్వెల్ చేయాలి అంటే రామ్ చరణ్ అయితే బాగుంటాడని అన్నారు చిరంజీవి. 

Also Read:సూపర్ స్టార్ మహేష్ బాబు, రజినీకాంత్ కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా?

55

రామ్ చరణ్ కాకుండా ఈ సినిమాను పర్ఫెక్ట్ గా చేయగల మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎవరు ఈ సినిమాను సీక్వెల్ చేస్తారో్ తెలియదు కాని.. ఒక వేళ సీక్వెల్ సినిమా అనౌన్స్ అయ్యి రామ్ చరణ్ కనుక ఈసినిమా చేస్తూ.. మెగా జాతర జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

Read more Photos on
click me!

Recommended Stories