Dil Raju: పంతానికి పోయిన నిర్మాత..గేమ్ ఛేంజర్ కంటే ముందు దిల్ రాజుకి తప్పిన పెద్ద ప్రమాదం

Published : Jan 28, 2026, 04:28 PM IST

గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కంటే ముందు దిల్ రాజుకి పెద్ద ప్రమాదం తప్పింది. దిల్ రాజు తన బ్రదర్ శిరీష్ కి నచ్చజెప్పకపోయి ఉంటే భారీ నష్టాలు మిగిలేవి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. దిల్ రాజు తన బ్రదర్ శిరీష్ తో కలసి సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతున్నారు. అదే విధంగా వీరు డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా ఉన్నారు. నైజాంతోపాటు ఇతర ఏరియాలలో దిల్ రాజు, శిరీష్ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. నిర్మాతలుగా వీరు ఎంత సక్సెస్ అయ్యారో డిస్ట్రిబ్యూటర్లుగా కూడా అంతే సక్సెస్ అయ్యారు.

25
వరుస ఫ్లాపులు

కానీ ఇటీవల దిల్ రాజుకి గేమ్ ఛేంజర్, తమ్ముడు లాంటి భారీ డిజాస్టర్ సినిమాలు ఎదురయ్యాయి. గేమ్ ఛేంజర్ చిత్రాన్ని దిల్ రాజు.. శంకర్ పై నమ్మకంతో 350 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మించారు. కానీ ఆ మూవీ రాంచరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దిల్ రాజు, శిరీష్ కూడా తమ కెరీర్ లో ఎప్పుడూ చూడని నష్టాలు ఈ సినిమాతో చూశారు.

35
చిరంజీవి ఆచార్య మూవీ

అంతే అంతకు ముందు మెగా హీరోల విషయంలో దిల్ రాజుకి పెద్ద ప్రమాదం తప్పింది. ఆ ప్రమాదమే ఆచార్య మూవీ. కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఈ మూవీలో రాంచరణ్ కీలక పాత్రలో నటించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఏమాత్రం వర్కౌట్ కాలేదు. దిల్ రాజు బ్రదర్ శిరీష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వాస్తవానికి ఆచార్య నైజాం ఏరియా హక్కులు తాము కొనాలని అనుకున్నట్లు శిరీష్ తెలిపారు.

45
శిరీష్ మొండి పట్టుదల

పోటీలో ఎక్కడా తగ్గకూడదు. అప్పుడే మన ఉనికి ఉంటుంది. ఒక సినిమా కొనాలి అనుకుంటే ఇంకేమి ఆలోచం.. కొనాల్సిందే. ఎంత రేటు అయినా మేమే కొంటాం అని శిరీష్ అన్నారు. సినిమా వ్యాపారంలో మా ముందు ఎవరున్నా సరే మేము తగ్గము అని శిరీష్ అన్నారు. ఆచార్య సినిమాని మేము కొనాలి అనుకున్నాం. నిర్మాత నిరంజన్ రెడ్డితో ఆల్రెడీ మాట్లాడం. ఆ తర్వాత కొన్ని రోజులు మరొకరు నైజాం ఏరియా హక్కులకు 42 కోట్ల ఆఫర్ ఇచ్చారట.

55
దిల్ రాజు అడ్డుచెప్పకపోయి ఉంటే..

ఈ విషయాన్ని నిరంజన్ రెడ్డి మాకు చెప్పారు. ఈ బిజినెస్ లో చిరంజీవి, కొరటాల శివ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అన్నారు. ఎంత రేటు అయినా పర్వాలేదు మేమే కొంటాం అని నిరంజన్ రెడ్డికి చెప్పా. ఎందుకు అంత మొండితనంతో వెళ్లడం, అంత రేటు ఎందుకు అని దిల్ రాజు నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. లేదు రాజు, ఈ విషయంలో తగ్గేది లేదు.. ఈ సినిమా చేయక పోతే మన విలువ ఏముంటుంది అని అడిగా. చాలా రోజులు వాదోపవాదాలు జరిగాయి. చివరికి నిరంజన్ రెడ్డి, దిల్ రాజు ఇద్దరూ నన్ను కూల్ చేసి కొనవద్దు అని చెప్పారు. ఆ విధంగా ఆ ఆచార్య సినిమాతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఎలాంటి సినిమా అయినా రేటుతో సంబంధం లేకుండా కొనడానికి ముందుకు వెళతా అని శిరీష్ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories