రంగుల ప్రపంచం, గ్లామర్ ప్రపంచంలో చాలా మంది హీరోయిన్లు పొట్టి దుస్తులు ధరించి మెరవడం సర్వసాధారణం. కానీ, సాయి పల్లవి మాత్రం ఇలాంటివాటికి చాలా దూరంగా ఉంటుంది. దీని వెనుక ఉన్న ఒక పెద్ద కారణం ఏంటో తెలుసా?
మాలీవుడ్‌లో మలర్, టాలీవుడ్‌లో బుజ్జి తల్లి, కోలీవుడ్‌లో ఆనంది, శాండల్‌వుడ్‌లో గార్గి, బాలీవుడ్‌లో సీత.. ఇలా నటి సాయి పల్లవిని అభిమానులు అనేక పేర్లతో పిలుచుకుంటారు. నేచురల్ బ్యూటీగా పేరున్న హీరోయిన్ సాయి పల్లవి.. , తక్కువ మేకప్ లో ఉన్నా.. అందగత్తె ఎవరైనా ఉన్నారంటే ఆమె సాయి పల్లవే అంటారు అభిమానులు ..!
27
మేకప్ అంటే ఇష్టం ఉండదు..
సాయి పల్లవి ఇతర హీరోయిన్లతో పోలిస్తే చాలా తక్కువ మేకప్ వేసుకుంటుంది. ముఖ్యంగా పాత్రకు అవసరమైతే తప్ప, ఏ కారణం చేతనైనా పొట్టి బట్టలు ధరించదు. అవి కూడా మరీ పొట్టిగా ఉన్న బట్టలను అస్సలు ఒప్పుకోదు సాయి పల్లవి.
37
సాయి పల్లవి రూటు వేరు..
సాధారణంగా హీరోయిన్లు బయట ఏవైనా ఫంక్షన్స్ కు వస్తే.. మోడ్రన్ డ్రెస్సులతో కనిపిస్తారు. హాట్ గా ఉండేలా మెయింటేన్ చేస్తుంటారు. పొట్టిగా ఉండే దుస్తులు ధరిస్తుంటారు. కానీ సాయిపల్లవి అలా కాదు.. బయటకు వెళ్ళేటప్పుడు, ఫంక్షన్లకు హాజరయ్యేటప్పుడు శరీరం పూర్తిగా కప్పుకునేలా దుస్తులు ధరించి వెళ్తుంది.
పొట్టి బట్టలు (షార్ట్ డ్రెస్) ధరించకపోవడం వల్లే నటి సాయి పల్లవి చాలా మందికి నచ్చుతుంది. గ్లామర్ ప్రపంచంలో పొట్టి దుస్తులు సాధారణమే అయినా, సాయి పల్లవి తన శరీరాన్ని ప్రదర్శించేలా ఎప్పుడూ దుస్తులు ధరించదు. దీని వెనుక ఒక పెద్ద కారణం ఉందని ఆమె స్వయంగా చెప్పింది.
57
కాలేజీ రోజుల్లో జరిగిన సంఘటన
తన కాలేజీ రోజుల్లో జరిగిన ఒక సంఘటనే ఈ నిర్ణయానికి కారణమని సాయి పల్లవి చెప్పాంది. కాలేజీలో ఉన్నప్పుడు సాయి పల్లవి ఒక డ్యాన్స్ పోటీలో పాల్గొంది. అప్పుడు స్లిట్ డ్రెస్ ధరించింది. ఆమె డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. కానీ ఆ వీడియోకు వచ్చిన కామెంట్స్ చూసి సాయి పల్లవి షాక్ అయింది. అది తన మనసును చాలా డిస్టర్బ్ చేసిందని ఆమె చెప్పుకొచ్చింది.
67
ఎందుకలా జరిగింది?
'కొంతమంది నా ప్రతిభను గుర్తించకుండా, కేవలం నా శరీరంపైనే ఆసక్తి చూపారు, దాని గురించే కామెంట్ చేశారు అందుకే, ఆ రోజు తర్వాత 'నా శరీరం కనిపించేలా బట్టలు వేసుకోవడం మానేశాను' అని సాయి పల్లవి చెప్పింది.
77
రామాయణంలో సీతగా..
ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా, రాకింగ్ స్టార్ యశ్, రణబీర్ కపూర్ నటిస్తున్న 'రామాయణం' చిత్రంలో సీతగా కనిపించనుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంతో సాయి పల్లవి పాన్ ఇండియా నటిగా మారనుంది. అంతే కాదు ఆమె రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగినట్టు సమాచారం.