కెరీర్ లో గెలుపోటములు ఎన్నో చూశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కెరీర్ బిగినింగ్ లో కాస్త ఇబ్బందిపడ్డా.. ఆతరువాత స్టార్ హీరోగా పేరు నిలుపుకున్నాడు. ఇక సూపర్ స్టార్ ఎంతో నమ్మకంతో సినిమా అవకాశం ఇస్తే.. మహేష్ నునిండా ముంచిన దర్శకులు ఎవరో తెలుసా?
కృష్ణ వారసత్వం తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు.. హీరోగా సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోడానికి చాలా కష్టపడ్డాడు. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ప్లాప్ లు చూశాడు. హీరోగా స్టార్ డమ్ వచ్చి.. మంచి మంచి సినిమాలు చేస్తున్నటైమ్ లో కూడా.. సూపర్ స్టార్ కొన్ని డిజాస్టర్స్ ను చూడాల్సి వచ్చింది.
సినిమాలు, కథలు, దర్శకుల విషయంలో మహేష్ బాబు చేసిన కొన్ని పొరపాట్లు ఆయన కెరీర్ కు ఇబ్బందిగా మారాయి. ఈక్రమంలోనే హిట్ అవుతాయని నమ్మి చేసిన కొన్ని సినిమాలు మహేష్ బాబును గట్టిగా దెబ్బతీశాయి. కొంత మంది దర్శకులను నమ్మి సినిమా ఇస్తే మహేష్ కు డిజాస్టర్స్ రిజల్ ను చేతిల పెట్టారు.
25
స్టార్ హీరోలతో సినిమా అంటే చూసుకోవాలి కదా..?
చాలామంది దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలంటే.. చాలా తేలిగ్గా తీసుకుంటారు.. ఆహీరోలకు ఒక కొత్త ఐడెంటిటిని క్రియేట్ చేయాలని చూస్తుంటారు. అది కొన్నిసార్లు వర్కౌట్ అయితే మరి కొన్నిసార్లు బెడిసి కొడుతుంది. పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసేటప్పుడు వారి ఇమేజ్, అభిమానుల, దృష్టిలో పెట్టుకుని చేయాలి. అభిమానుల తమ హీరోను ఎలా చూడాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి. కానీ తమకు నచ్చినట్టు చేస్తే.. అది బెడిసికొడుతుంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో దొరికినప్పుడు కొంత మంది దర్శకులు తెలివిగా ఆలోచించి.. బ్లాక్ బస్టర్ హిట్లు కొడితే.. మరికొందరు మాత్రం అలా కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా సినిమాలను చేసి డిజాస్టర్ లను మూటగట్టుకున్నారు.
35
నమ్మి మహేష్ అవకాశం ఇస్తే..?
మహేష్ బాబు బాగా నమ్మి.. కొంత మంది దర్శకులకు అవకాశం ఇచ్చాడు. కానీ వాళ్లు చివరకు డిజాస్టర్ సినిమాలను అందించాడరు. వారిలో తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ముందుంటాడు. మహేష్ లాంటి హైట్, పర్సనాలిటీ, కలర్ ఉన్న హీరో దొరికితే.. పోలీస్ సినిమాలు ఎక్కువగా చేసే సత్తా ఉన్న మురుగుదాస్.. పవర్ ఫుల్ మూవీ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ స్పైడర్ లాంటి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాని చేసి డిజాస్టర్ ను కట్టబెట్టాడు. ఈసినిమాలో హీరో మహేష్ బాబా.. లేక ఎస్ జే సూర్యనా అని కొంత మంది తికమకపడ్డారు కూడా.
ఇక మహేష్ బాబు వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమా టేకింగ్, కథ, తెలుగు ప్రేక్షకుల మనసు దోచాయి. దాంతో శ్రీకాంత్ కు మరో అవకాశం ఇచ్చాడు మహేష్. కానీ ఈసారి మాత్రం బ్రహ్మోత్సవం లాంటి ఒక నాసిరకపు కథతో.. మహేష్ బాబు ఇమేజ్ కు ఏమాత్రం సంబంధం లేని సినిమా చేసి డిజాస్టర్ ని అందించాడు.
మహేష్ బాబు కెరీర్ లో వెనక్కి వెళ్తే.. ఒక్కడు సినిమాతో సూపర్ స్టార్ కెరీర్ ను మలుపు తిప్పిన గుణశేఖర్.. సైనికుడు లాంటి డిజాస్టర్ ను అందించాడు. పోకిరితో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరి.. బిజినెస్ మేన్ లాంటి యావరేజ్ మూవీ చేశాడు.. ఇలా మహేష్ బాబు కెరీర్ లో ఇబ్బందులు చాలానే చూశాడు.
55
రాజమౌళితో పాన్ వరల్డ్ మూవీ..
అందుకే మహేష్ బాబు ఇప్పుడు ఏ దర్శకుడుని గుడ్డిగా నమ్మడం లేదు. ప్రతి ఒక్క కథను చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని.. ఆ సినిమా ఆ దర్శకుడు క్యారీ చేయగలడా లేదా అనేది కూడా చూసుకుంటున్నాడు. మహేష్ తో పాటు నమ్రతది కూడా ఈ విషయంలో కీ రోల్ అని చెప్పాలి. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరి సినిమాలకు కమిట్ అవుతున్నాడు మహేష్ బాబు. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే మహేష్.. ఆ సినిమాతో అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మహేష్ బాబు పాన్ వరల్డ్ ఇండస్ట్రీని శాసించే అవకాశం ఉంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈసినిమాలో మహేష్ జతగా నటిస్తోంది. ఇక 1500 కోట్ల బడ్జెట్ తో ఈమూవీని నిర్మిస్తున్నట్టు సమాచారం. 2027 సమ్మర్ లో కానీ.. సంక్రాంతికి కానీ ఈసినిమా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.