అతిలోక సుందరి శ్రీదేవికి కోట్లలో అభిమానులు ఉన్నారు. ఆమె అందాన్ని రకరకాలుగా వర్ణిస్తుంటారు. కానీ ఓ తెలుగు నటుడు మాత్రం.. కూరలోని వంకాయ ముక్కలను శ్రీదేవి బుగ్గలతో పోల్చాడు. ఇంతకీ ఎవరా నటుడు... ఏంటా కథ?
దివంగత తార.. స్టార్ హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అందం, నటన, డ్యాన్స్ ప్రతీది ప్రత్యేకమే. కోట్లాది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి.. సౌత్ లో తన సినీ ప్రయాణం మొదలు పెట్టి.. బాలీవుడ్ ను కూడా ఒక ఊపు ఊపేసింది. సమాన్యులతో పాటు సెలబ్రిటీలలో కూడా అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి.. 54 ఏళ్ల వయసులో అనమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూసింది. ఆమె లేకపోయినా.. ఆమె సినిమాలు, నవ్వు, నటన ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
25
శ్రీదేవి బుగ్గలను వంకాయలతో పోల్చిన నటుడు..
సాధారణంగా హీరోయిన్ల అందాలను పువ్వులతో పోల్చుతుంటారు. కవులు వారి సొగసులను ప్రకృతితో పోల్చుతూ.. ఎన్నో కవిత్వాలు కూడా రాస్తుంటారు. టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావు హీరోయిన్ల విషయంలో పూలు, పండ్లతో చేసిన ప్రయోగాలెన్నో. శ్రీదేవి అందాన్ని కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా వర్ణించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక తెలుగు నటుడు మాత్రం ఆమె అందాన్ని వంకాయ కూరతో పోల్చుతూ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఓ ఈవెంట్ లో వెల్లడించారు. ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు దివంగత స్టార్ యాక్టర్ రావు గోపాలరావు.
35
రావుగోపాలరావుతో చిరంజీవి అనుబంధం..
చిరంజీవి చాలా సినిమాల్లో రావుగోపాలరావు విలన్ గా అలరించాడు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. చాలా సినిమాల్లో కలిసి పనిచేయడం వల్ల ఇద్దరి మధ్య స్నేహంతో పాటు..సొంత వారమన్న భావన కూడా పెరిగింది. రావు గోపాలరావు ను చిరంజీవి మావయ్యగారు అని ప్రేమగా పిలిచేవారు. చిరుని అల్లుడు అని పిలిచేవారు రావుగోపాలరావు. ఇక షూటింగ్స్ టైమ్ లో ఇద్దరు కలిసి భోజనం చేసేవారు. ఆయన మరణం తరువాత రావు రమేష్ ఇండస్ట్రీలో తండ్రి పేరు నిలబెడుతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అదరగొడుతున్నారు. రావు రమేష్ గురించి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి ఓ ఈవెంట్ లో రావుగోపాలరావు ను తలుచుకున్నారు.
షూటింగ్స్ టైమ్ లో రావుగోపాల రావుకి ఇంటి నుంచి నాలుగైదు రకాల వంటలతో క్యారేజి వచ్చేదట. వాటిని చిరంజీవికి దగ్గరుంచి వచ్చేవారట రావు. ఓ సారి వంకాయకూర తినకపోతే.. ఆయన పట్టుబట్టి తినిపించారట. ''మీ అత్తయ్యగారు చాలా ప్రేమగా వంకాయకూర చేశారు. ఇది రుచి చూడకపోతే ఎలా..? ఆ కూరలో వేగిన వంకాయలను చూడండి.. ఎంత నిగనిగలాడుతున్నాయో.. అచ్చ శ్రీదేవి బుగ్గల్లా ఉన్నాయి తినాల్సిందే'' అని పట్టుబట్టి తినిపంచారట. ఈ విషయాన్ని ఓ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినిమా ఈవెంట్ లో రావుగోపాలరావు తనయుడు రావు రమేష్ నటన గురించి మాట్లాడుతూ.. ఆయన తండ్రి ప్రస్తావన తీసుకువచ్చారు మెగాస్టార్.
55
చరిత్రలో నిలిచిపోయిన అద్భుతమైన నటుడు..
తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేని నటులలో రావుగోపాలరావు ఒకరు. కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, నాగభూషణం, గుమ్మడి.. ఇలా ఎంతో మంది అద్భుతమైన నటుల సరసన రావుగోపాలరావుకి కూడా స్థానం ఉంటుంది. విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అద్భుతాలు చేశాడు. చివరిగా ఆయన చేసిన రొయ్యలనాయడు పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. రావుగోపాలరావు లేకపోయినా.. ఆయన చేసిన పాత్రలు మాత్రం అలరిస్తూనే ఉన్నాయి. ఆయన వారసుడిగా రావు రమేష్.. తెలుగువారి హృదయాలలో స్థానం సంపాదించుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.