తమిళ దర్శకుడు భాగ్యరాజ్, తనతో పాటు సినిమాలో హీరోయిన్‌గా నటించిన పూర్ణిమను ప్రేమించి ఎలా పెళ్లి చేసుకున్నారో తెలుసా? వాళ్ల ప్రేమకథలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే?
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్, యాక్టర్‌గా సౌత్ లో పేరు తెచ్చుకున్న కె. భాగ్యరాజ్, నటి పూర్ణిమ జయరాంల ప్రేమకథలో చాలా మలుపులున్నాయి. పూర్ణిమ మొదటిసారి భాగ్యరాజ్‌ను కలిసింది సినిమా అవకాశం కోసమే. ఆమె ఉత్సాహంగా ఇంగ్లీషులో మాట్లాడితే, భాగ్యరాజ్ మాత్రం 'ఓకే... సీ యూ' అని చెప్పి వెళ్లిపోయారట. దీంతో, 'భాగ్యరాజ్ చాలా పొగరున్న మనిషి' అని పూర్ణిమ అనుకున్నారు.
26
నిజాయితీగా ఒప్పుకున్న భాగ్యరాజ్..
కొన్ని నెలల తర్వాత, భాగ్యరాజ్ తన 'డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్' సినిమా కోసం కొత్త హీరోయిన్‌ను వెతుకుతున్నప్పుడు పూర్ణిమ గుర్తొచ్చారు. ఆమెను పిలిచి కథ చెప్పగా, మొదటి మీటింగ్ గురించి పూర్ణిమ అడిగారు. దానికి భాగ్యరాజ్, 'మీరు మాట్లాడిన ఇంగ్లీష్ నాకు సరిగ్గా అర్థం కాలేదు. అందుకే ఆ పరిస్థితిని మేనేజ్ చేయడానికి అలా చెప్పాను' అని నిజాయితీగా ఒప్పుకున్నారు. ఈ సమాధానంతో వాళ్లిద్దరి మధ్య ఉన్న అపార్థం తొలగిపోయింది.
36
భాగ్యరాజ్ మొదటి భార్యతో స్నేహం..
ఆ సినిమా షూటింగ్ అంతా వాళ్లిద్దరి మధ్య కేవలం డైరెక్టర్-నటి సంబంధమే ఉండేది. అప్పుడు భాగ్యరాజ్ భార్య ప్రవీణ బతికే ఉన్నారు. దాంతో ప్రేమ అనే ఆలోచనే రాలేదు. షూటింగ్ రోజుల్లో పూర్ణిమ తరచుగా భాగ్యరాజ్ ఇంటికి వెళ్లేవారు. అక్కడ ప్రవీణతో ఆమెకు మంచి స్నేహం కుదిరింది. అంతేకాదు, భాగ్యరాజ్-ప్రవీణల పెళ్లి రోజు, పూర్ణిమ పుట్టినరోజు ఒకే తేదీ కావడం వాళ్లను ఆశ్చర్యపరిచిందట.
అయితే, అనారోగ్యంతో ప్రవీణ చనిపోవడం భాగ్యరాజ్ జీవితంలో పెద్ద విషాదం. ఆ బాధ నుంచి బయటపడలేక ఆయన కొంతకాలం ఒంటరిగా ఉండిపోయారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో మళ్లీ పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ముంబైలో పూర్ణిమను మళ్లీ కలిసిన భాగ్యరాజ్‌కు, తన జీవిత భాగస్వామిగా ఆమె అయితేనే బాగుంటుందనిపించింది. వెంటనే తన ప్రేమను చెప్పాలనుకున్నారు. కానీ, మరుసటి రోజే షూటింగ్ కోసం పారిస్ వెళ్లాల్సి ఉండటంతో, అక్కడి నుంచి ఫోన్ చేయమని పూర్ణిమను కోరారు.
56
పారిస్ జరిగిన వింత డ్రామా..
పారిస్ నుంచి పూర్ణిమ చాలాసార్లు ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించారట. కానీ, ఆయన అసిస్టెంట్ ఎవరో అభిమాని అనుకుని భాగ్యరాజ్‌కు కాల్ కలపలేదు. తర్వాత నిజం తెలిసి, భాగ్యరాజ్ తర్వాతి కాల్ కోసం ఎదురుచూశారు. చివరకు ఇద్దరూ మాట్లాడుకునే అవకాశం వచ్చింది. అప్పుడు భాగ్యరాజ్ తన మనసులోని ప్రేమను బయటపెట్టారు. దానికి పూర్ణిమ, ముందుగా తన కుటుంబ సభ్యులతో మాట్లాడమని చెప్పారట. ఆ తర్వాత ఆమె తల్లి, తండ్రి, తాతగారి అంగీకారంతో ఇద్దరి పెళ్లి జరిగింది.
66
దగ్గరుండి పెళ్లి జరిపించిన MGR
నిజానికి, పూర్ణిమ కూడా అప్పటికే మనసులో భాగ్యరాజ్‌ను ఇష్టపడ్డారు. అందుకే విదేశాల్లో ఉన్నా పదేపదే ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. ప్రేమ సక్సెస్ అయితే పారిస్‌లోనే హనీమూన్ జరుపుకోవాలని కూడా ఆమె కోరుకున్నారట. పెళ్లి తర్వాత భాగ్యరాజ్ పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల వల్ల ఆ కోరిక వెంటనే నెరవేరలేదు. ఇద్దరు పిల్లలు పుట్టాక, కుటుంబంతో కలిసి పారిస్ వెళ్లి, భార్య చిరకాల కోరికను భాగ్యరాజ్ తీర్చారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీరి వివాహం ఎంజీఆర్ (MGR) అధ్యక్షతన జరిగింది.