ఆనందం హీరోయిన్ రేఖ వేదవ్యాస్ 41 ఏళ్ళ వయసులో కూడా ఇంకా సింగిల్ గానే ఉన్నారు. తాను ఎందుకు సింగిల్ గా ఉన్నానో తాజాగా ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
2001లో విడుదలైన ఆనందం అనే చిత్రం చాలా మంది సెలెబ్రెటీలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. దర్శకుడిగా శ్రీను వైట్లకు ఈ చిత్రంతోనే తొలి సక్సెస్ దక్కింది. హీరోయిన్ రేఖ వేదవ్యాస్ కి తెలుగులో ఇదే తొలి చిత్రం. ఫస్ట్ మూవీతోనే రేఖ విజయం అందుకుంది. అదే విధంగా హీరో ఆకాష్ కూడా ఆనందం మూవీతోనే తొలి సక్సెస్ అందుకున్నారు. ఇలా చాలా మందికి ఆనందం మూవీ లైఫ్ ఇచ్చింది.
25
ఆనందం మూవీ నా ఐడెంటిటీ
హీరోయిన్ రేఖ వేదవ్యాస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆనందం మూవీ గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనందం మూవీ నా ఐడెంటిటీ. రేఖ అని పేరు చెబితే ఏ రేఖ అని అంటారు. అదే ఆనందం రేఖ అని అంటే వెంటనే గుర్తుపడతారు. వాస్తవానికి ఆనందంలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించాల్సింది. కానీ కుదర్లేదు.
35
ఉదయ్ కిరణ్ తో 2 ఛాన్సులు మిస్
ఇది మాత్రమే కాదు మరోసారి కూడా ఉదయ్ కిరణ్ తో నటించే ఛాన్స్ మిస్ అయింది. కలుసుకోవాలని అనే చిత్రంలో ఉదయ్ కిరణ్ కి హీరోయిన్ గా నేను నటించాల్సింది. అది కూడా మిస్ అయింది అని రేఖ తెలిపారు. నటిగా ఇంత లాంగ్ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించగా.. నేను గ్యాప్ తీసుకోలేదు. అది దేవుడు సృష్టించిన గ్యాప్. మనం ప్లాన్ చేసేది ఒకటి అయితే దేవుడు ప్లాన్ చేసేది మరొకటి అని రేఖ అన్నారు.
తిరిగి తాను టాలీవుడ్ లో నటిగా రాణించాలి అని అనుకుంటున్నట్లు రేఖ తెలిపారు. దానికి నాకు మన ఇండస్ట్రీ సపోర్ట్ కావాలి అని రేఖ తెలిపారు. ప్రస్తుతం రేఖ వయసు 41 ఏళ్ళు. అయినా ఆమె ఇంకా సింగిల్ గానే ఉన్నారు. ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నిస్తే.. ఇండియాలో సల్మాన్ ఖాన్ గారు, నేను మాత్రమే సింగిల్ గా మిగిలిపోతాం ఏమో అంటూ నవ్వుతూ చెప్పారు.
55
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే
పెళ్లి చేసుకోవడానికి సరైన అబ్బాయి దొరకట్లేదు అని రేఖ అన్నారు. ఎవరినైనా మీరు ప్రేమించారా అని అడగగా.. ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, కానీ అతడికి ఆ విషయం చెప్పలేదు. ఎవరినైనా ఇష్టపడితే సరైన టైంలో ప్రపోజ్ చేయండి. నాలాగా సైలెంట్ గా ఉండొద్దు అని రేఖ అన్నారు. మన సొసైటీలో ఒక అమ్మాయికి ఒక ఏజ్ దాటిపోయింది అంటే.. ఆంటీ లేదా మమ్మీ అని అనేస్తారు. పచ్చిగా చెప్పాలి అంటే ముసలిది అని అంటారు. మహిళల్ని అలా ట్రీట్ చేస్తుంటే చాలా బాధగా ఉంటుంది అని రేఖ అన్నారు.