Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?

Published : Sep 17, 2026, 11:13 AM IST

Megastar: ఓ స్టార్ డైరెక్టర్ కి చిరంజీవిని పరిచయం చేయడం వల్ల సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ విషయంలో కూడా నష్టపోయాడా? ఇంతకీ ఎవరా నటుడు? ఏంటి విషయం?

PREV
15
చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో..

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. మెగాస్టార్ చిరంజీవి సాధించిన విజయం, ఆయన సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. పరిశ్రమలో ఎంతోమంది సీనియర్ నటులు ఆయన ఎదుగుదలను దగ్గరుండి చూశారు. వారిలో ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ కూడా ఒకరు. మురళీ మోహన్ కు జూనియర్ గా ఉన్న చిరంజీవి.. ఆయన కళ్ల ముందే ఒక్కో మెట్టు ఎక్కుతూ.. మెగాస్టార్ గా ఎదిగాడు. ఈక్రమంలోనే చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో జరిగిన సంఘటనల గురించి.. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మురళీ మోహన్ గుర్తు చేసుకుంటూ, ఆయన నటన, ఆత్మవిశ్వాసం, పరిశ్రమలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

25
స్టార్ డైరెక్టర్ కు చిరుని పరిచయం చేసిన మురళీ మోహన్..

సినిమా పరిశ్రమలోకి వచ్చిన మొదట్లో నటుడిగా కొన్ని లక్ష్యాలు, కోరికలు ఉన్నప్పటికీ, తనకు లభించిన పాత్రలతోనే మురళీమోహన్ ఎంతో సంతృప్తి చెందేవారు. తనకంటే వెనక వచ్చిన చిరంజీవికి ఎక్కువ పారితోషికం లభిస్తోందని లేదా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని ఆయన ఎప్పుడూ కుళ్లుకోలేదని ఇంటర్వ్యూలో తెలిపారు. "చిరంజీవి టాలెంట్‌కు అంత పారితోషికం వస్తుంది, నా టాలెంట్‌కు తగినంత నాకు వస్తుంది" అనే స్పష్టమైన నమ్మకంతో ఉండేవాడినని చెప్పారు.

దర్శకుడు, నిర్మాత విజయబాపినీడు బ్యానర్‌లో వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో, బాపినీడు చిరంజీవిని కలిసి సినిమాలో పెట్టాలనుకుంటున్నట్లు మురళీమోహన్‌తో చెప్పారు. అప్పటికి ఆయనకు చిరంజీవితో పరిచయం లేకపోవడంతో, మురళీమోహనే స్వయంగా చిరంజీవి వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. ఆ తర్వాత చిరంజీవి ఆ బ్యానర్‌లో వరుసగా విజయవంతమైన సినిమాలు చేశారు. తన బ్యానర్ చేజారిపోయిందని గానీ, అవకాశాలు తగ్గాయని గానీ ఆయన ఏనాడూ బాధపడలేదని చెప్పారు.

35
మురళీ మోహన్ తమ్ముడిగా మెగాస్టార్..

చిరంజీవి తొలినాళ్లలో నటించిన 'మనవూరి పాండవులు' చిత్రంలో మురళీ మోహన్ కీలక పాత్ర పోషించారు. ఆ సినిమాలో మురళీ మోహన్ ధర్మరాజు పాత్రలో నటిస్తే, చిరంజీవి, ప్రసాద్ బాబు, భానుచందర్ వంటి అప్పటి కొత్త నటులు తమ్ముళ్లుగా నటించారు. అప్పటికి మురళీ మోహన్ పెద్ద హీరోగా గుర్తింపు పొందగా, చిరంజీవి అప్పుడప్పుడే పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ఆ సమయంలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు, వారంతా ఒకే కుటుంబంలా కలసి మెలిసి ఉండేవారని మురళీ మోహన్ గుర్తుచేసుకున్నారు.

షూటింగ్ బ్రేక్ లో లేదా సరదా సమయాల్లో వీరంతా కలిసి థియేటర్లకు సినిమా చూడటానికి వెళ్లేవారు. అప్పటికే స్టార్‌గా ఉన్న మురళీ మోహన్ దగ్గరకు అభిమానులు ఆటోగ్రాఫ్‌ల కోసం రావడం చూసి, చిరంజీవి ఎంతో అమాయకంగా "అన్నయ్యా.. రేపు పొద్దున్న నాకు కూడా ఇలాగే జనాలు ఆటోగ్రాఫ్ కోసం వస్తారా?" అని అడిగేవారట. దానికి మురళీ మోహన్ నవ్వుతూ, "ఇలా రావడమేంటయ్యా.. నీకు దీనికంటే పది రెట్లు ఎక్కువ మంది వస్తారు. నీలో మాస్ హీరోకి కావాల్సిన అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి" అని అప్పుడే ప్రోత్సహించారట.

45
విలన్ కాదు.. ఇండస్ట్రీకి మొగుడవుతాడు!

'మనవూరి పాండవులు' చిత్రీకరణ సమయంలో చిరంజీవి నటనను చూసి సీనియర్ నటుడు కృష్ణంరాజు మురళీ మోహన్‌తో "ఈ అబ్బాయి కళ్లు, ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి.. మన పరిశ్రమకు ఒక మంచి విలన్ దొరికాడు" అని అన్నారట. దానికి మురళీ మోహన్ వెంటనే స్పందిస్తూ.. "విలన్ కాదండీ బాబూ.. ఆయన టాలెంట్, బాడీ లాంగ్వేజ్, ఫ్లెక్సిబిలిటీ చూస్తే నాకు మతిపోతోంది. రాబోయే రోజుల్లో ఆయన హీరోగా మారి ఈ ఇండస్ట్రీకే మొగుడవుతాడు" అని జోస్యం చెప్పారు. మురళీ మోహన్ చెప్పిన ఆ మాటలు తర్వాతి కాలంలో నిజమై, చిరంజీవి టాలీవుడ్ రారాజుగా నిలిచారు.

డ్యాన్స్, ఫైట్స్‌లో సరికొత్త అధ్యాయం

చిరంజీవి రాకముందు వరకు తెలుగు సినిమాలో డ్యాన్సులు, ఫైట్లు ఒక పద్ధతి ప్రకారం సాగేవి. సీనియర్ నటులు డ్యాన్స్‌ల కోసం రిహార్సల్స్ చేసేవారని, ఫైట్స్‌లో డూప్‌లను ఎక్కువగా వాడేవారని మురళీ మోహన్ వివరించారు. కానీ చిరంజీవి రాకతో టాలీవుడ్‌లో డ్యాన్స్, ఫైట్స్ రూపురేఖలే మారిపోయాయి.ఏ రకమైన ఇంగ్లీష్ మ్యూజిక్ లేదా వెస్ట్రన్ రిథమ్ ప్లే చేసినా, ముందస్తు రిహార్సల్స్ లేకుండానే తన బాడీలోని ఈజ్‌తో అద్భుతంగా డ్యాన్స్ చేసే సామర్థ్యం చిరంజీవికి ఉండేది. మాస్టర్లు కంపోజ్ చేసిన స్టెప్పులను అప్పటి నటులు 50% వరకు మాత్రమే చేయగలిగితే, చిరంజీవి 100% చేసి చూపించేవారు. ఆయన కళ్లలో తపన, నటనలో స్పీడ్ ప్రేక్షకులను కట్టిపడేసేవని మురళీ మోహన్ అన్నారు.

55
మురళీ మోహన్ అంటే గౌరవం..

చిరంజీవి యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని మురళీ మోహన్ కొనియాడారు. కెరీర్ బిగినింగ్ రోజుల్లో 'అన్నయ్యా' అని పిలిచే చిరంజీవి, ఈ రోజు అంత పెద్ద మెగాస్టార్ అయినప్పటికీ ఇప్పటికీ అదే గౌరవంతో 'అన్నయ్యా' అని మాత్రమే పిలుస్తారట. మురళీ మోహన్‌కు పద్మశ్రీ పురస్కారం ప్రకటించినప్పుడు, చిరంజీవి స్వయంగా ఆయన ఇంటికి వచ్చి సత్కరించి, గంటసేపు ముచ్చటించి వెళ్లిన సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు. "చెడు ఉంటే చెవిలో చెప్పండి.. మంచి ఉంటే మైకులో చెప్పండి" అనే సిద్ధాంతాన్ని చిరంజీవి బలంగా నమ్ముతారని మురళీ మోహన్ తెలిపారు. చిరంజీవి కేవలం ఒక నటుడు మాత్రమే కాకుండా, తన కష్టం, అంకితభావం, క్రమశిక్షణతో తెలుగు చిత్రసీమ గతిని మార్చిన గొప్ప వ్యక్తి అని మురళీ మోహన్ అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories