మగధీర సినిమాని ఓ యంగ్ హీరో రిజెక్ట్ చేశారు. కెరీర్ ఆరంభంలో అనేక హిట్ సినిమాల్లో నటించిన ఆ హీరో నటించారు. కానీ ఆ తర్వాత సరైన అవకాశాలు లేక ఆల్మోస్ట్ కెరీర్ క్లోజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.
2000 ఆరంభంలో చాలా మంది యువ హీరోలు సీనియర్లకు ప్రత్యామ్నాయంగా కెరీర్ ప్రారంభించారు. కొందరు హీరోలు షైన్ అయ్యారు. ఇప్పుడు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. కానీ మరికొందరు హీరోలు కెరీర్ ని ఘనంగా ప్రారంభించి ఆ తర్వాత కలిసిరాకపోవడం వల్లనో, స్వతహాగా చేసిన మిస్టేక్స్ వల్లనో బాగా వెనుకబడిపోయారు. అలాంటి వారిలో హీరో వెంకట్ ఒకరు.
25
హిట్ సినిమాతో హీరో వెంకట్ కెరీర్ ప్రారంభం
హీరో వెంకట్ కి సోలో హీరోగా పెద్దగా హిట్ సినిమాలు లేవు. కానీ అతడు చాలా సినిమాల్లో సెకండ్ హీరోగా, కీలక పాత్రల్లో నటించారు. అలాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో హీరో వెంకట్ 1998లో శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి అనే మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీలో ఏఎన్నార్ కీలక పాత్రలో నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది.
35
వరుస హిట్లు, కానీ రేసులో వెనుకబడిపోయాడు
ఆ తర్వాత అన్నయ్య మూవీలో చిరంజీవి తమ్ముడిగా నటించగా అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆనందం, శివరామరాజు ఇలా క్రేజీ సినిమాల్లో వెంకట్ నటించారు. కానీ ఆ తర్వాత వెంకట్ కి అంతగా కలసి రాలేదు. దీనికి తోడు బ్యాక్ ఇంజ్యూరీ కావడం ఇంకా మైనస్ గా మారింది. కెరీర్ లో వెనుకబడిపోయాడు. ఆల్మోస్ట్ కెరీర్ క్లోజ్ అనే చెప్పాలి. అయితే అవకాశం ఉన్నప్పుడు చిన్న పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా పవన్ ఓజీ మూవీలో వెంకట్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
తన కెరీర్ లో జరిగిన ఊహించని సంఘటనని వెంకట్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఓ ఇండస్ట్రీ హిట్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది అని కానీ తాను రిజెక్ట్ చేసినట్లు వెంకట్ తెలిపారు. ఆ సినిమా మరేదో కాదు రాజమౌళి, రాంచరణ్ కాంబోలో తెరకెక్కిన దృశ్యకావ్యం మగధీర. వెంకట్ మాట్లాడుతూ ఈ మూవీలో మెయిన్ విలన్ గా రాజమౌళి గారు ముందు నన్నే అడిగారు. నెగిటివ్ క్యారెక్టర్ కాబట్టి కెరీర్ ఏమవుతుందో అని భయపడ్డాను. అందుకే మగధీర చేయలేకపోయాను అని వెంకట్ తెలిపారు.
55
ఈగలో నటించి ఉంటే బావుండేది
కానీ నాకు మగధీర కంటే ఈగ చాలా ఇష్టం. ముంబైలో మా ఫ్రెండ్స్ ఈగ మూవీ చూసి కాల్ చేశారు. నువ్వు మక్కీ(ఈగ) మూవీలో నటించవా అని అడిగారు. లేదు అని చెప్పా. ఆ విలన్ ఎవరో నీలాగే ఉన్నాడు అని అన్నారు. వాళ్ళు పొరపాటుగా అలా అనుకోవడం తప్పు లేదు. ఎందుకంటే సుదీప్ కి నాకు కొంచెం పోలికలు ఉంటాయి. రాజమౌళి గారు నన్ను ఈగ సినిమాకి కనుక అడిగి ఉంటే వెంటనే ఓకె చెప్పేవాడిని అని వెంకట్ తెలిపారు. హీరో వెంకట్ చివరగా హరుడు అనే మూవీలో నటించారు. మే నెలలో రిలీజైన ఆ చిత్రం ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.