అల్లరి నరేష్ హీరోగా నటించిన `రంభ ఊర్వశి మేనక` మూవీ రెండు వారాల క్రితం విడుదలైంది. ఇప్పుడు థియేటర్లో క్లోజింగ్‌కి చేరుకుంది. మరి సినిమా హిట్టా ఫట్టా అనేది చూస్తే,
కామెడీ చిత్రాల హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అల్లరి నరేష్. `అల్లరి` మూవీనే తన ఇంటి పేరుగా మార్చుకొని రాణించారు. వరుసగా అనేక కామెడీ చిత్రాలు చేసి మెప్పించారు. స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. కానీ వాళ్ల నాన్న ఈవీవీ సత్యనారాయణ మరణం తర్వాత కెరీర్ గాడి తప్పింది. అంటే ఆశించిన స్థాయిలో విజయాలు రాలేదు. సరైన స్క్రిప్ట్ ల ఎంపికలోనూ కొంత తడబాటు కనిపిస్తుంది. ఈక్రమంలో ఓ దశలో ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపించలేదు. దీంతో యాక్షన్ థ్రిల్లర్స్ వైపు టర్న్ తీసుకున్నారు. మల్టీస్టారర్స్ కూడా చేశారు. అక్కడ సక్సెస్ అయ్యారు.
24
బాక్సాఫీసు వద్ద డీలా పడ్డా రంభ ఊర్వశి మేనక
కానీ మళ్లీ కామెడీ సినిమాల డిమాండ్ రావడంతో మరోసారి తన బలమైన కామెడీ కంటెంట్‌తో ఇప్పుడు `రంభ ఊర్వశి మేనక` అనే చిత్రంలో నటించారు. దీనికి చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించారు. ఇందులో సురభి, రాశీ సింగ్, విష్ణు ప్రియా భీమనేని, ప్రిషా సింగ్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి వంటి వారు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. సెప్టెంబర్ 4న ఈ చిత్రం విడుదలైంది. ప్రారంభం నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
34
రంభ ఊర్వశి మేనక కలెక్షన్లు
ఇక `రంభ ఊర్వశి మేనక` మూవీ కలెక్షన్లు ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే, సినిమా విడుదలై 13 రోజులు పూర్తి చేసుకుంది. బుధవారం దీనికి రెండు లక్షల కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.5.40కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. సాక్నిల్క్ సైట్ మాత్రం ఇది రూ.4.82కోట్లు మాత్రమే వసూలు చేసినట్టు వెల్లడించడం గమనార్హం. ఏవైనా ఇది చాలా తక్కువ కలెక్షన్లు అనే చెప్పాలి.
`రంభ ఊర్వశి మేనక` మూవీకి దాదాపు రూ.15కోట్ల బడ్జెట్ అయ్యిందట. థియేట్రికల్‌గా రూ.4.5కోట్లకు అమ్మినట్టు సమాచారం. చాలా వరకు సొంత రిలీజ్‌కి వెళ్లారు. ఏదేమైనా ఐదు కోట్ల థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు అందులో సగం కలెక్షన్లని మాత్రమే వసూలు చేసింది. థియేట్రికల్‌గా ఇది క్లోజింగ్‌కి చేరుకుంది. మన తెలుగు రాష్ట్రాల రెండు మూడు థియేటర్లలోనే ఆడుతుంది. రేపటి నుంచి అందులోనూ ఎత్తేసే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో థియేట్రికల్ రన్ పూర్తి కాబోతుందని తెలుస్తోంది. మొత్తంగా రెండున్నర కోట్ల వరకు నష్టాలను తీసుకొచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అల్లరి నరేష్‌కిది మరో దెబ్బ అని చెప్పొచ్చు.