కృష్ణంరాజు మొదటి భార్యకి పిల్లలున్నారా? రెబల్‌ స్టార్‌ కూతుళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

Published : Sep 11, 2025, 02:26 PM IST

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవి యాక్సిడెంట్‌లో మరణించారు. అయితే ఆమెకి పిల్లలు లేరనే ప్రచారం జరిగింది. కానీ దీనిపై కృష్ణంరాజు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.  

PREV
15
రెబల్‌ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన కృష్ణంరాజు

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని, స్టార్‌ స్టేటస్‌ని సొంతం చేసుకున్నారు. లెజెండరీ నటుడిగా ఎదిగారు. యాక్షన్‌ సినిమాలతో, తిరుగుబాటు నేపథ్య చిత్రాలతో మెప్పించి రెబల్‌ స్టార్‌గా విశేష ఆదరణ పొందారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా తన సినిమాలతో ఆడియెన్స్ ని అలరిస్తూనే ఉన్నారు.

25
రోడ్డు ప్రమాదంలో మరణించిన కృష్ణంరాజు మొదటి భార్య

కృష్ణంరాజు ఫ్యామిలీ విషయానికి వస్తే ప్రభాస్‌ ఆయన తమ్ముడు సూర్య నారాయణరాజు కొడుకు అనే విషయం తెలిసిందే. అయితే కృష్ణంరాజు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య సీతాదేవి. ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆ తర్వాత 1996లో శ్యామలాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు. ప్రస్తుతం ఈ ముగ్గురు స్టడీస్‌ పూర్తి చేసి వృత్తిపరంగా బిజీగా ఉన్నారు.

35
కృష్ణంరాజు మొదటి భార్యకి కూతురు ఉందా?

ఇదిలా ఉంటే కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవికి పిల్లలు లేరు అంటుంటారు. అమ్మాయిని దత్తత తీసుకున్నారనే ప్రచారం ఉంది. కానీ తన మొదటి భార్యకి పిల్లలు ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా కృష్ణంరాజునే వెళ్లడించారు. ఓపెన్‌ హార్ట్ విత్ ఆర్కే షోలో ఈ విషయాన్ని చెప్పారు. తన మొదటి భార్య యాక్సిడెంట్‌లో మరణించిందని, ఆమెకి కూతురు(ప్రశాంతి) ఉందని చెప్పారు. కూతురుకి పెళ్లి కూడా చేశారట. ఆమెకి ఇద్దరు ఆడపిల్లలని వెల్లడించారు.

45
ప్రభాస్‌నే కొడుకుగా భావించిన కృష్ణంరాజు

ఇక శ్యామలాదేవికి ముగ్గురు ఆడపిల్లలు. అయితే ఇద్దరు అమ్మాయిలు పుట్టాక, అబ్బాయి కోసం ప్రయత్నించారట. కానీ మళ్లీ అమ్మాయినే రావడంతో ఇక ఆశలు వదులుకున్నారట. కాకపోతే ఎప్పుడైనా అది గుర్తొచ్చినప్పుడు బాధగా ఉంటుందని, కానీ ఆ తర్వాత ఆ బాధ లేదని తెలిపారు కృష్ణంరాజు. తన తమ్ముడికి ఇద్దరు కొడుకులు. ప్రభాస్‌ తన వారసుడిగా, సొంత కుమారుడిగానే భావిస్తానని, వారు కూడా అంతే ఫ్రీగా ఉంటారని తెలిపారు. దీంతో తనకు మగపిల్లలు లేరనే బాధ లేదని వెల్లడించారు రెబల్‌ స్టార్‌.

55
కృష్ణంరాజు కూతుళ్లు ఏం చేస్తున్నారంటే ?

మరి కృష్ణంరాజు రెండో భార్య శ్యామలీదేవికి జన్మించిన ముగ్గురు అమ్మాయిలు ఇప్పుడు ఏం చేస్తున్నారనేది చూస్తే, పెద్ద కూతురు సాయి ప్రసీద నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె యూఎస్‌లో ఫిల్మ్ ప్రొడక్షన్‌ కోర్స్ చేశారు. ఆ తర్వాత ప్రభాస్‌తో తీసిన `రాధేశ్యామ్‌` చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇక రెండో కూతురు సాయి ప్రకీర్తి ఆర్కిటెక్ట్. ఆమె `కల్కి 2898 ఏడీ` చిత్రానికి ఇంటర్న్ షిప్‌ కూడా చేశారు. మూడో కూతురు ప్రదీప్తి సైకాలజీ చేశారు. మానసిక రోగాలతో ఇబ్బంది పడే వారిని ట్రీట్‌ చేస్తున్నారు. సైకాలజీ డాక్టర్‌గా రాణిస్తున్నారు. ఇలా ముగ్గురు తమకు నచ్చిన రంగంలో రాణిస్తున్నారు. కృష్ణంరాజు చనిపోయాక వారికి సంబంధించిన అన్ని బాగోగులు ప్రభాస్‌ చూసుకుంటున్నారని సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories