హీరోయిన్‌ విషయంలో బాలకృష్ణ, రవితేజ కొట్టుకున్నారా? చిరంజీవి బర్త్ డే పార్టీలో ఏం జరిగింది?

Published : Dec 08, 2024, 08:17 PM IST

బాలకృష్ణ, రవితేజ మధ్య గొడవ జరిగిందా? హీరోయిన్‌ కోసం ఇద్దరు కొట్టుకున్నారా? మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే పార్టీలో ఏం జరిగింది?  

PREV
16
హీరోయిన్‌ విషయంలో బాలకృష్ణ, రవితేజ కొట్టుకున్నారా? చిరంజీవి బర్త్ డే పార్టీలో ఏం జరిగింది?

నందమూరి బాలకృష్ణ గురించి రకరకాల వార్తలు వినిపిస్తుంటాయి. ఆయన గురించి ఒక్కోక్కరు ఒక్కోలా చెబుతుంటారు. బాలయ్య చిన్నపిల్లాడి లాంటివారని, చాలా జోవియల్‌గా ఉంటారని అంటారు. ఆయనకు చాలా కోపం అని, యాటిట్యూడ్‌ చూపిస్తాడని, చులకనగా చూస్తాడని, ఇబ్బంది పెడితే కొడతాడని కూడా అంటారు. ఇలా రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఏది నిజం అనేది ఆయనతో ఉన్న వారికే తెలుస్తుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

26
photo credit-aha unstoppable 4

ఎవరు ఏమన్నా.. `అన్‌స్టాపబుల్‌` షోతో మాత్రం చాలా నెగటివిటీకి ఫుల్‌ స్టాప్‌ పెట్టారు బాలయ్య. ఆయనలోని మరో కోణం బయటకు వచ్చింది. బాలయ్య ఇంత జోష్‌ఫుల్‌గా ఉంటాడా? ఇంత ఎనర్జీతో ఉంటాడా? ఇంత సరదాగా ఉంటాడా అని అనిపిస్తుంది. మొత్తానికి ఈ షో ఆయన ఇమేజ్‌ని మార్చేసింది. ఎంతో మందికి బాలయ్యని దగ్గర చేసింది. కొత్త అభిమానులను ఏర్పర్చింది. 
 

36

ఇదిలా ఉంటే బాలయ్యతో చాలా మంది స్టార్స్ కి పడదు అంటారు. నాగార్జునతో గొడవ అంటారు. ఏం గొడవనో తెలియదు. అలాగే రవితేజతోనూ గొడవ అనే వార్తలు వచ్చాయి. రవితేజని బాలయ్య కొట్టారనే వార్త షాకిస్తుంది.  మరి ఇంతకి ఏం జరిగింది? అసలు గొడవ ఉందా? కేవలం పుకారేనా,  చిరంజీవి బర్త్ డే పార్టీలో ఏం జరిగిందనేది చూస్తే..

46

బాలకృష్ణ, ఓ హీరోయిన్‌ విషయంలో రవితేజ గొడవ అయ్యిందట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, రవితేజని బాలకృష్ణ కొట్టారనేది రూమర్‌. చాలా కాలంగా ఈ కామెంట్‌ వినిపిస్తుంది. ఆ మధ్య రవితేజ.. బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే షోలో సమయంలో ఈ రూమర్‌ చర్చనీయాంశం అయ్యింది. రవితేజని ఈ షోకి పిలిచే ప్రయత్నాలు జరిగాయని, వీరి మధ్య ఈ గొడవ ఉందని, అందుకే ఆయన రాడు అంటూ ప్రచారం జరిగింది. 
 

56

దీనిపై రైటర్‌, డైరెక్టర్‌ బీవీఎస్‌ రవి స్పందించారు. బాలయ్య, రవితేజ మధ్య గొడవ ఉందని మొదట్లో తాను కూడా నమ్మినట్టు చెప్పారు. కానీ వారి మధ్య ఎలాంటి గొడవలు లేవు, రవితేజని బాలయ్య కొట్టలేదని తెలిపారు. ఎందుకంటే గత ఇరవై ఏళ్లుగా రవితేజతో ట్రావెల్‌ అవుతున్నాను అని,

ఆయన జీవితంలో ఏం జరిగినా తనకు తెలుస్తుందన్నారు. నాకు తెలియలేదంటే అది జరగలేదని అర్థమన్నారు. ఈ ఇరవై ఏళ్లలో రవితేజ, బాలకృష్ణ కలిసింది మూడు నాలుగు సార్లు మాత్రమే అని, ఆ సమయంలో వాళ్లు చాలా ఫ్రీగా ఉన్నారని తెలిపారు. 

66

ఆ మధ్య చిరంజీవి 60వ బర్త్ డే పార్టీకి బాలకృష్ణ, రవితేజ ఇలా చాలా మంది స్టార్స్ వచ్చారని, ఇద్దరూ చాలా జోవియల్‌గా గడిపారు. ఆ రోజు వాళ్లు అంత ఫ్రీగా ఉన్నారంటే వాళ్ల మధ్య ఏదో ఉంటే, అంత ఫ్రీగా ఉండేవాళ్లు కాదు, బాలయ్య డాన్స్ కూడా చేశాడు. ఇక అన్‌ స్టాపబుల్‌ షోకి రవితేజని పిలవాలనుకున్నప్పుడు నన్ను ఫోన్‌ చేయమంటావా రవి నెంబర్‌ నా వద్ద కూడా ఉందంటూ బాలకృష్ణ చెప్పాడట.

షో చేస్తున్నప్పుడు కూడా రవితేజ రాగానే ఆ రా రవితేజ గారు అని బాలయ్య అంటే సర్‌ మీరు అలా అనడం బాగా లేదు, మీరు పెద్ద వాళ్లు రవి అని చనువు తీసుకుని పిలవండి అన్నారట. అంత ఫ్రీగా ఉన్నారని, అదే గొడవ జరిగి ఉంటే అంత ఫ్రీగా మూవ్‌ అయ్యేవాళ్లు కాదు అన్నారు బీవీఎస్‌ రవి. 

read more: వసుంధరతో బాలకృష్ణ పెళ్లి వేళ, ఎన్టీఆర్‌ ఉక్కిరి బిక్కిరి ఎందుకో తెలుసా? మ్యారేజ్‌లో ఇదే స్పెషల్‌

also read: కోరికలు గుర్రాలైతే.. మంచు మనోజ్‌తో గొడవ వేళ మోహన్‌బాబు పోస్ట్ సంచలనం

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories