అయితే చికెన్ కర్రీలా తినడం కాదు, ఏకంగా కోడి మొత్తాన్ని తినడం ఇష్టమట. నాటుకోడిని క్లీన్ చేసి,ఆ కోడి మొత్తాన్ని కాల్చి, దానికి చుట్టూ కారం, అల్లం వెల్లుల్లి ముద్దని దట్టించి, కాసేపు అలా ఉంచి, దానికి కాస్త నెయ్యి, పెరుగు, పసుపు పట్టించి.. మంచి మంటమీద కాల్చి.. తందూరిలా చేసి.. రోటీతో తో తినడం చాలా ఇష్టమట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో తారక్ వెళ్ళడించారు.