Dharmendra: ధర్మేంద్ర బాలీవుడ్ సూపర్‌స్టార్. 89 ఏళ్ల వయసులో ఈయన కన్నుమూశారు. ఈయనకు 450 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిపై ఇప్పుడు గొడవలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు, వారికి పిల్లలు ఉన్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర మరణించడంతో సినీ పరిశ్రమ మూగబోయింది. మరికొన్ని రోజుల్లో 90వ పుట్టినరోజు చేసుకుంటారని ఆశించిన ధర్మేంద్ర అనారోగ్యంతో 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇతనికి ఇద్దరు భార్యలు, ఆరుగురు పిల్లలున్నారు. ఇక ఆస్తి విషయానికి వస్తే 400 నుంచి 450 కోట్ల రూపాయల ఆస్తి ఉంటుందని అంచనా. 65 ఏళ్లు బాలీవుడ్‌ను ఏలిన ఆయన వందల కోట్ల ఆస్తులను సంపాదించారు.
24
చివరి సినిమా ఇక విడులవలేదు
ధర్మేంద్ర చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉన్నారు. ఆయన చివరి సినిమా 'ఇక్కీస్' ఇంకా విడుదల కాలేదు. దీన్ని త్వరలోనే విడుదల చేయాల్సి ఉంది. ఆయన సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపారాల ద్వారా కూడా సంపాదించారు. ఆయనకు 'గరమ్-ధరమ్' అనే పెద్ద రెస్టారెంట్ కూడా ఉంది. ముంబైలో విలాసవంతమైన బంగ్లా, ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. ఇవన్నీ చాలా ఖరీదైనవి.
34
ఇద్దరు భార్యలు, ఆరుగురు పిల్లలు
బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య ప్రకాష్ కౌర్. ఇక రెండో భార్య డ్రీమ్ గర్ల్ హేమ మాలిని. మొదటి భార్యకు సన్నీ డియోల్, బాబీ డియోల్ అనే ఇద్దరు అబ్బాయిలు, అజిత, విజేత అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. తర్వాత హేమమాలినిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇషా, అహానా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇప్పుడు ధర్మేంద్ర ఆస్తిని వీరినెలా పంచుకుంటారనే సందేహం ఎక్కువ మందికి వస్తోంది.
భారతీయ చట్టాల ప్రకారం మన దేశంలో రెండో పెళ్లి చెల్లదు. కానీ రెండో పెళ్లిలో పుట్టిన పిల్లలకు మాత్రం తండ్రి స్వీయార్జిత ఆస్తిలో హక్కు ఉంటుంది. కాబట్టి హేమ మాలిని పిల్లలకు కూడా తండ్రిలో ఆస్తిలో వాటా దక్కుతుంది. ధర్మేంద్ర ఆస్తి మొత్తం ఆరుగురు పిల్లలకు సమాన వాటా లభిస్తుంది. కానీ హేమమాలినికి వాటా మాత్రం కేవలం ఈషా, అహనాలకు మాత్రమే వస్తుంది. హేమ మాలిని కూడా సినమాల్లో భారీగానే ఆర్జించారు.