Devara 2 Shooting: దేవర 2 షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్, ఎన్టీఆర్ కోసం భారీ స్కెచ్ వేసిన కొరటాల

Published : Feb 09, 2025, 11:38 AM IST

Devara 2 Shooting: దేవర 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది.  ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎంత వరకూ వచ్చింది.  ఎన్టీఆర్ కోసం కొరటాల వేసిన భారీ స్కెచ్ ఏంటి..? 

PREV
16
Devara 2 Shooting:  దేవర 2 షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్, ఎన్టీఆర్ కోసం భారీ స్కెచ్ వేసిన కొరటాల

Devara 2 Shooting Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ  ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా  భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి  బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబట్టింది.

వెయ్యి కోట్లు టార్గెట్ పెట్టుకున్నా..అది సాధ్యం కాలేదు కాని ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు మంచి  కలెక్షన్స్ వచ్చాయి. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా కావడం.. రాజమౌళి సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేసిన ఎన్టీఆర్ హిట్ కొట్టడంతో..ఫ్యాన్స్ కూడా దిల్ ఖుష్ అయ్యారు. 

Also Read: 3500 కోట్ల ఆస్తి ఉన్న తెలుగు హీరో, 99 సినిమాలు చేస్తే 40 కి పైగా ప్లాప్ లే, ఎవరా స్టార్.?

26

ఇక ప్రస్తుతం అందరి దృష్టి దేవర2 పైనే ఏంది. ఈసినిమా  అప్ డేట్ ను ఎప్పుడు ఇస్తారంటూ  ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దేవర సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు చూసిన తరువాత.. ఫైనల్ గా క్లైమాక్స్ లో ఏం జరిగింది అనేది తెలిసుకోవడం కోసం ఫ్యాన్స్ ఉవ్విళ్ళూరు తున్నారు. ఈ నేపథ్యంలోనే దేవర  సీక్వెల్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకునే కొరటాల శివ ఈసినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేశాడట. 

Also Read: నిర్మాతలను భయపెడుతున్న ఐశ్వర్య రాజేష్, రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా

36
ntr, devara2, koratala shiva

ఈసారి వెయ్యికోట్ల కలెక్షన్స్ ను దాంటించడేమే టార్గెట్ గా పెట్టుకుని సినిమా స్క్రిప్ట్ ను రాస్తున్నారట. ఇప్పటికే ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు చాలా స్పీడ్ గా చేస్తున్నారట.  పుష్ప తరువాత పుష్ప2 కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అందరికి తెలుసు.. అలాగే దేవర2 కూడా అంతకుమించి అన్నట్టుగా చేయాలని స్కెచ్ వేశాడట. పుష్ఫ2 ఫార్ములాను ఫాలో అవుతూ..   స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్‌ తో గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నారట. 

Also Read: శోభితకు నచ్చని నాగచైతన్య సినిమా, మరి బాగా నచ్చిన సినిమా ఏదో తెలుసా

46

ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అంతా ఎదురు చూస్తున్నవేళ.. ఈసినిమా షూటింగ్ కు సబంధించిన వార్త వైరల్ అవుతోంది.  ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది.  ఇంకా అధికారిక మాత్రం ఈ విషయం అనౌన్స్ చేయలేదు కాని..  సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్‌ అవుతోంది. 

Also Read: రామ్ చరణ్, ఎన్టీఆర్ లాగా చిరంజీవి, బాలయ్య కాంబోలో భారీ మల్టీ స్టారర్? కథ రాస్తున్న దర్శకుడెవరంటే?

56
war2

అయితే ఈలోపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాను స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. తాజాగా ‘వార్-2’ షూటింగ్ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో చేసే సినిమాపై దృష్టి పెట్టారు.  ప్రశాంత్ నీల్ మూవీకి సబంధించి కీలక సన్నివేశాలు నవంబర్ వరకూ కంప్లీట్ చేసుకుని.. ఆతరువాత దేవర2 షూటింగ్ లో జాయిన్ అవుతారట తారక్. 

Also Read: అజిత్ సినిమా వల్ల నా జీవితం నాశనం అయ్యింది.. హీరోయిన్ ఆవేదన

66
devara part 1 six days kerala box office ntr jr koratala siva Saif Ali Khan Janhvi Kapoor

ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫస్ట్ ఫార్ట్ లో జాన్వీ ఒక పాటకు మాత్రమే పరిమితం అయ్యింది. డైలాగ్స్ పెద్దగా పడలేదు. దాంతో ఈసారి సెకండ్ పార్ట్ లో జాన్వీ రోల్ ఎక్కవగా ఉండబోతోందట. ఇక  సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాకు  అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ  కీలక పాత్రలు పోషించగా.. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. 

Read more Photos on
click me!

Recommended Stories