కన్నడ హీరోయిన్లు భారతీయ సినిమాని షేక్ చేస్తున్నారు. అలా ఊపేసిన హీరోయిన్లలో దీపికా పదుకొనె కూడా ఒకరు. ఆమె బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. హిందీలో దాదాపు అందరు సూపర్ స్టార్స్ తోనూ సినిమాలు చేసి మెప్పించింది. ప్రస్తుతం అక్కడ అత్యధిక పారితోషికం తీసుకుంటోన్న హీరోయిన్‌గా దీపికా పదుకొనె నిలవడ విశేషం. అంతేకాదు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమలో పడింది. ఆయన్నే పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు ఉన్నారు.
25
`కల్కి 2898 ఏడీ` చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దీపికా
ఇదిలా ఉంటే దీపికా పదుకొనె గతేడాది `కల్కి 2898 ఏడీ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకుడు. ఇందులో భారీ కాస్టింగ్ నటించింది. అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ వంటి వారు గెస్ట్ లుగా మెరిసిన విషయం తెలిసిందే. ఈ మూవీ పెద్ద హిట్ అయ్యింది. ఏకంగా రూ.1200కోట్లు వసూలు చేసింది. దీనికి రెండో పార్ట్ రాబోతుంది. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం నుంచి దీపికా పదుకొనె తప్పుకుంది. చిత్ర బృందమే ఈ విషయాన్ని వెల్లడించింది.
35
అల్లు అర్జున్ మూవీలో నటిస్తోన్న దీపికా
మరోవైపు తెలుగులో మరో మూవీకి కమిట్ అయ్యింది దీపికా. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది దీపికా. ఇందులో ఆమె వారియర్ క్వీన్‌గా కనిపించనుందని సమాచారం. ఈ మూవీ త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సీజీ వర్క్ ఎక్కువగా ఉండటంతో, వాటికి సంబంధించిన ముందస్తు పనుల్లో బిజీగా ఉన్నారు.
అయితే దీపికా పదుకొనె తెలుగులో నటించిన తొలి చిత్రం `కల్కి` కాదు, దీనికంటే ముందే మరో సినిమాలో నటించింది. 16ఏళ్ల క్రితమే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఐటెమ్ సాంగ్ చేసింది. ఆ మూవీనే `లవ్ 4 ఎవర్`. ఈ మూవీకి జయంత్ సి పరాన్జీ దర్శకుడు. మృదుల, రన్‌దీప్ జంటగా నటించారు. ఈ మూవీని 2009లో రూపొందించారు దర్శకుడు జయంత్.
55
విడుదలకు నోచుకోని దీపికా తెలుగు ఫస్ట్ మూవీ
ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ కోసం దీపికా పదుకొనెని తీసుకున్నారు. ఆమెపై షూటింగ్ కూడా చేశారు. చాలా వరకు సినిమా చిత్రీకరణ పూర్తయ్యిందని సమాచారం. కానీ పలు కారణాలతో మూవీ రిలీజ్ కాలేదు. అలా పదహారేళ్ల క్రితం టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సిన దీపికా పదిహేనేళ్ల తర్వాత `కల్కి 2898 ఏడీ` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెకిది బెస్ట్ ఎంట్రీ అని చెప్పొచ్చు.