ఇదే ఊపు కొనసాగితే 100 కోట్లు పక్కా.. బాహుబలి ది ఎపిక్ 2 రోజుల వసూళ్లు ఎంతంటే?

Published : Nov 02, 2025, 01:56 PM IST

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ నటించిన 'బాహుబలి ది ఎపిక్' రీ-రిలీజ్ అయి దుమ్మురేపుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండో రోజు ఎంత వసూలు చేసిందంటే? 

PREV
14
బాక్సాఫీస్ దగ్గర బాహుబలి మెరుపులు

పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుట్టిన సినిమా బాహుబలి. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో 2015లో బాహుబలి మొదటి భాగం రిలీజైంది. ఆ సినిమా అద్భుత విజయం తర్వాత, 2017లో రెండో భాగం రిలీజైంది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద 1700 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. బాహుబలి రిలీజై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను బాహుబలి ది ఎపిక్ పేరుతో  రీ-రిలీజ్ చేశారు. 

24
బాహుబలి ది ఎపిక్ కు భారీ స్పందన

బాహుబలి  రెండు  భాగాలను రాజమౌళి పర్యవేక్షణలో రీ-ఎడిట్ చేసి 'బాహుబలి - ది ఎపిక్' పేరుతో ఒకే సినిమాగా రీ-రిలీజ్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైంది. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ లాంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమా, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. రీ-ఎడిట్ చేసిన వెర్షన్‌లో కొన్ని కొత్త సీన్లు కూడా చేర్చడంతో, అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

34
తమన్నా అభిమానులకు నిరాశ

బాహుబలి ది ఎపిక్ సినిమాను మరోసారి  థియేటర్లలో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. కానీ ఈ సినిమా తమన్నా అభిమానులను మాత్రం నిరాశపరిచింది. ఎందుకంటే ఆమె నటించిన చాలా సీన్లను తీసేశారు. ఒక రకంగా తమన్నాది ఈసినిమాలో గెస్ట్ రోల్ గా మారిపోయింది.  కొన్ని పాటల సీన్లను కూడా ఎడిట్ చేశారు. ఈ సినిమా 3 గంటల 45 నిమిషాల నిడివి ఉన్నా, స్క్రీన్‌ప్లే చాలా వేగంగా ఉందని ఫ్యాన్స్  అభిప్రాయపడుతున్నారు.

44
బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్

బాహుబలి ది ఎపిక్ సినిమా రిలీజైన మొదటి రోజు ఇండియాలో 12.35 కోట్లు, విదేశాల్లో 4 కోట్లు, మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 16.35 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు కూడా వసూళ్ల వేట కొనసాగించి ప్రపంచవ్యాప్తంగా 13.15 కోట్లు రాబట్టింది. దీంతో రెండే రోజుల్లో ఈసినిమా  29.5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. రీ-రిలీజ్ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే మొదటిసారి. ఇదే జోరు కొనసాగితే రీ-రిలీజ్‌లో 100 కోట్ల వసూళ్లను అందుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories